Pages

Wednesday, February 28, 2007

శ్రీ సత్యనారాయణస్వామి వ్రత కథాగానం - 6

పంచమాధ్యాయము

సూత మహాముని మరల మునుల చూసి రమానాదా
ఇంకొక కథ చెప్పెద వినుడు ''
తుంగధ్వజుడనే రాజుకలడు ''
ప్రజలను కన్న తండ్రివలే చూచు ''
అరణ్యమునకు వేటకు బోయి ''
తిరిగీ వచ్చునపుడు ఒక చోట ''
గొల్లలందరూ సత్యనారాయణస్వామి ''
వ్రతము చేయు చేయు చుండి రచట ''
గర్వముచే రాజు ఆటకు పోలేదు ''
స్వామికి నమస్కారమైన చేయలేదు ''
ప్రసాదము తినని తప్పుకు ''
వారి నూర్గురు కొడుకులు చనిపోయిరి ''
ధన ,ధాన్యములు అంతరించే ''
లెక్కలేని కష్టములు వచ్చే ''
అపుడు రాజు కళ్లు తెరచి ''
"రాజుననే గర్వముతో నేను " ''
ప్రసాదమైనా భుజింపక వస్తి ''
నేను పొగరుగా ప్రవర్తించాను ''
ఆస్వామికి కోపము వచ్చే ''
నాఐశ్వర్య మంతా నశించిపోయే ''
అని రాజు మరల గొల్లల దగ్గిర కేగినాడు ''
యథా విధిగా సత్యమూర్తి వ్రతము చేసినాడు ''
స్వామి కృప వలన మరల పుత్రులు కలిగి నారు ''
ధనవంతుడాయి సుఖముగా బ్రతికినాడు ''
చివరికి స్వర్గ మునకు పోయినాడు ''
మహా ప్రభావ వంత మైన ఈవ్రతము ''
భక్తితో ఎవరాచరింతురో ''
కథ ఎవరు విన్దురో ''
వారికి సకల ఐశ్వర్యములు కలుగు ''
దరిద్రునకు ధనము వచ్చు ''
బద్ధుడు విముక్తు డగును ''
భయ భీతునకు ధైర్యము కలుగు ''
అపుత్రునకు పుత్రులు కలుగు ''
ఇహలోకమున సకల సౌఖ్యాలు ''
అన్త్యమున స్వర్గ లోకము ''
ఇట్టిఫలముల నిచ్చేటట్లు ''
సత్యనారాయణ వ్రతము తెలిపితి ''
కలియుగమున ఈవ్రతము ''
ప్రత్యక్షమైన ఫలము నొసగు ''
విశేష ఫల ప్రదమైనది ''
దీనినందరు ఆచరింప వలయు ''
కలియుగమున స్వామిని కొందరు ''
సత్యీశ్వరుడు , సత్యదేవుడని యందురు ''
సనాతనుడైన శ్రీహరి ''
కలియుగమున అనెకరూపముల ''
అవతరించి జనులందరికీ ''
కోరిన కోరిక లోసగు చుండును ''
ఇది సత్యము ,ముమ్మాటికీ సత్యము ''
ఈవ్రతము తామూ చేయ లేక పొతే ''
ఎవరైనా ఈవ్రతం చేస్తూంటే '
చూసిన ,కథను భక్తితో వినిన ''
సత్యనారాయణ స్వామి అనుగ్రహం ''
కలిగి ,కష్టములు తొలగు నయ్య ''
తటవర్తి భారతం జ్ఞాన ప్రసూనాంబ ''
వంశాన్ని కాచి రక్షించు సత్యనారాయణా ''
ఈపాటను పాడినా వారికి , వినిన వారికి ''
పలు శుభాములు మోక్ష ప్రాప్తి ప్రసాదించు ''
సత్యనారాయణ స్వామీ సంతసించి ''
ఆసీస్సులందించి మమ్ముల ధన్యం చేయి ''
సంపూర్ణం

No comments: