నిద్ర
ఎందుకో రాత్రి అంతా నిద్ర పట్టలేదండీ!చక్కగా వేసిని పక్క క్రికెట్ ఆడీనట్లుగా, కుస్తీ పట్టినట్లుగా నలిగి తుక్కుతుక్కు అయిందిగాని,కంటి రెప్పలు మాత్రం కలవలేదు, ఒక్క కునుకు పట్ట లేదు. అంటారు.నిద్రని ఒక దేవతని ఆరాధించి నట్లుగా ఆరాధించాలి లేకపొతే రాదు.అలాని నిద్ర ఎక్కువయినా మనుగడకే చేటు తెస్తుంది.జీవి మాతౄ గర్భంలొ పడి నప్పటినుచీ నిద్రిస్తూ పెరుగుతాడు. జన్మించిన తరువాత వేళ కిన్ని పాలిస్తే తాగి మళ్ళి నిద్ర లొకి జారుకొంటాడు.నెమ్మదిగా నిద్ర టైమె తగ్గుతూవుంటుంది.బాలానాం, వ్రుధ్ధానాం ,అన్నారుగదా!ముసలి తనం వచ్చేసరికి 60 దాటాక వీళ్ళకి నిద్ర తగ్గిపొతూ వుంటుంది.వయస్సు తెచ్చే మార్పువల్ల, నీరసం వల్లా, బాధలవల్లా నిద్ర పొయే సమయం తగ్గిపొతుంది.25 ఏళ్ళు వచ్చేదాకా మనిషిలొ స్రుజనాత్మక శక్తి పెరుగుతుంది.8గంటల కాలం నిద్ర పొతారు.30 ఏళ్ళదాకా బాగానే వుంటుంది. తరవాత పుష్టిగా పెరిగిన హార్మొనెస్ తరగడం ప్రారంభిస్తాయి.60ఏళ్ళు వచ్చేసరికి 40%తగ్గుతాయి. దాంతొ నిద్ర పొయేకాలం 6గంటలకు దిగుతుంది.ఇంతకంతే నిద్ర తగ్గిపొతే దినచర్య గడపడ కష్ట మవుతుంది.నిద్ర చాలని శరీరం సహకరించడం మానేస్తుంది.చాలినంత నిద్ర కావాలంటే ఏమిచేయాలి?చిన్నపిల్లల కయితే అమ్మ ఉయ్యాలలొ వేసి చిచ్చికొట్టి, జొలపాడి నిద్ర పుచ్చుతుంది>సినిమాలలొ లాగా ఏహీరొయిను వచ్చి మనకి రావె నిదురా హాయిఘా,జొజొ ముకుందా,హరి శ్రీచరణా జొజొ అని ఏవరూపాడరు.మనమేఏవొ పధ్ధ్తులు కనిపెట్టి అలవరచుకొవాలి.
మంచి నిద్రకావాలనుకొటున్నారా!అయితే ఈ పదహారు నియమాల్ని పాటించండి.
1.నిద్రపొయే సమయం,నిద్ర లేచే సమయం నిర్ధారణ చేసుకొని,అదేసమయాన్ని పాటించాలి.
2నిద్ర బాగా ముంచుకొచ్చినప్పుడే మంచం మీదపడుకొవాలిగాని,ముందుగా వెళ్ళి శయనిస్తే,నిద్ర రాదు సరికదా,బుర్ర దేశ సంచారం చేసి అశాంతిని రేపుతుంది.
3నిద్ర టైం 30 నిముషాలు దాటినా విద్ర రాకపొతే పక్కకి విడాకులిచ్చేసి,లేచి ఏదొ ఒక వ్యాపకం పెట్టుకొండి.లేకపొతేపానుగంటివారివొ,చిలకమర్తి వారివొ,మొక్కపాటి వారివొ,మునిమాణిక్యం వారివొ,రావూరువారివొ,జంధ్యాల వారివొ ,బాపురమణలవొ,సొమరాజు సుశీల గారివొ లేకపొతే మీకిష్ట మైనవారి వొ రచనలు చదవండి.
4 ఒక విషయం ముఖ్యం,మీరు ఎక్కువ నిద్ర పొయినా, తక్కువ నిద్ర పొయినా ఒకే టైం కు నిద్ర లేవాలి.
5 మీరు నిద్ర పొయే గదిశుభ్రం గా,నిశ్శబ్దంగా,చల్లగా,కొంచెం వెల్తురుతొ వుండాలి.
6 నిద్ర పొయేముందు ఆల్కహాల్కానీ,కఫ్ఫీకానీ,టీగానీ ,పొగ త్రాగడం కానీ చెయ్యకండి.
7 మధ్య రాత్రిలొ లేచి టైం చూడకండి. నిద్ర దెబ్బతీస్తుంది.
8 అందరూ సమస్యలని పొగు చేసుకొని పక్కమీదకి వెళ్ళాక వాటిని పేక ముక్కాల్లా పేర్చి ఆలొ చిస్తూ వుంటారు.నిద్ర పాడవడమేకాని సమాధానాలు అంత తొందరగా దొరుకుతాయా?వాటిని నివారించే బాధ్యత ఆపరమాత్మకి అప్పగించండి.
9 తీవ్ర మైన సమస్యల గురించి వేదన చెంద కుండా, మీకిష్ట మైన దెవుని నామాన్ని జపించండి.
10 నిద్ర బాగా పట్టేందుకు పనికి వచ్చే వ్యాయామాలు చేయంది.
11 ఎప్పుడూ వత్తిడి లేకుండావుండేలా విశ్రాంతికి ఉపాయాలు వెదకండి.
12 నిద్ర సమయానికి 90 నిముషాల ముందు గొరు వెచ్చని నీటితొ స్నానం చేయండి.
13 శాస్త్ర ప్రకారం రాత్రి 11గంటల నుంచి తెల్లవారు ఝామున 5గంటలవరకునిద్రకి చక్కటి సమయమా తైం లొ నిద్ర పొయి శక్తిని పుంజుకొండి.
14 మధు మేఘం వున్న వారికి నిద్ర పొయే సమయానికి కాలు, బొటన వ్రేలు నొప్పి వస్తూవుంటుంది.అలాటప్పుడు గొరు వెచ్చని నీళ్ళలొ కాళ్ళు ముంచి 10 నిముషాలు వుంచితే నిద్ర వస్తుంది.
15 నిద్ర టైం అయాక త్. వ్ ఇ చూడడాం,ఫొనె లొ ంట్లాడడం మానివేయాలి.
16 నిద్ర పొయే ముందు దైవ ప్రార్ధన చేయడం.
మప్పటం తేలిక గానీ, మానిపించడం చాలాకష్టం అంటారు. నిద్ర కొసం కొందరు మాత్రలు వేసుకొంటారు. వాటివల్ల వేరే సమస్యలు మొలకెత్తుతాయి.కొందరికి ఎక్కువ నిద్ర వచ్చి తెల్లవారాక కూడా నిద్ర వస్తూంటుంది. కొన్నాళ్ళు పొయాక మందు వేసుకొన్నా నిద్ర రాని పరిస్తితి ఏర్పడుతుంది.నిద్ర రాకుండాను, ఆకలి వేయకుండానూ మాత్రలు కనిపెట్టారు.ఇవి మనకెంత వరకు ఉపయొగ పడతాయి, వేసుకొవడం అవసరమా? అని ఆలొచించాలి .నిద్ర మాత్ర వేసుకొన్నాక నిద్ర భంగ మయితే ఎన్నొ యాతనలు వస్తాయి.దూర ప్రయాణాలు చేసే టప్పుడు ఈనిద్ర మాత్రలు వేసుకొవడం శ్రేయస్కరం కాదు.మందులు తయారీ చేస్తున్నారు, డాక్టర్లు వేసుకొ మంటున్నారు, చేతిలొ మాత్రలు కొనేందుకు దబ్బు వుంది అనిమాత్రలు వాడేయ కూడదు.చిన్న చిన్న జ్వరాలకి, జలుబులకి, పసికూనలకి కూడా యాంటీ బయాటిక్స్ వాడేస్తున్నారు.కొర్స్ సరిగా వేసుకొకపొతే తరవాత వేసుకొన్నపుడు పని చేయవు అంటారు, ఒక మాత్ర వేసుకొగానే నీరసం మనిషిని కుంగ దీసేస్తుంది.ఇచ్చే దాక్టర్లు, వేసుకొనే రొగులు నిదానంగా ఆలొచిస్తే మంచిది.నిద్ర పొయే ముందు మంచి స్నేహితుని తల్చుకొంతూనొ, మధుర మైన సంగీతం వింతూనొనిద్ర కి ఉపక్ర మించండి.పక్కే హన్స తూలికా తల్పమయి, వెండి మబ్బులే తలగడాలయి, చంద్రుడే నెచ్చెలియై తారకలు జొల పాడతాయి.అన్నం తినక పొయినా ఫరవాలేదుకాని, నిద్రలేక పొతే తెల్లారే సరికి కళ్ళు పీక్కుపొయి, మొఖం వేళ్ళాడిపొతుంది.నిజ మైన ఆరొగ్యానికి నిద్ర నిచ్చెన లాటిది.
No comments:
Post a Comment