Pages

Saturday, March 17, 2007

ఇదివిన్నారా?

ఇది విన్నారా సరిపొయేదికొన్నాళ్ళదాకా.మాస్టెర్ బెడ్ రూం అని కొంచెం విశాలంగా గది అమర్చుకొని ఇల్లాలు,ఇంటాయన సంతొష పడేవాళ్ళు.ఇప్పుడు కొత్త సమస్య వచ్చి పడింది. భార్యకి, భర్తకి వేరే వేరే గా మాస్టెర్ బెడ్ రూంలు కొరుకొంటున్నారు.అమెరికా లొ బిల్డెర్స్ అంటున్నారు ''ఈమధ్య ఇళ్ళు కట్టించుకొనే వాళ్ళంతా రెండు మాస్టెర్ బెడ్ రూంలు కావాలంటున్నారుట.2015 వచ్చేసరికి ప్రతి ఇంట్లొ భార్యకి, భర్తకి విడి విడిగా గదులున్న ఇళ్ళేచూస్తాముట.దానికి కారణాలు బొలెడు చెపుతున్నారు.''గురక పెట్తారని ,అర్ధరాత్రిదాకా ఈమైల్స్ చూస్తూ,పంపిస్తు వుంటారని,దానివల్ల నిద్ర భంగ మైపొతొందని,ఎక్షెర్ సైజుకొ ,వాకింగ్కొ వెళ్ళడానికి తెల్లారగత్లే లేచి చప్పుడు చేస్తారని.ఒకావిడ అంతూంది;తనకి నిద్ర పట్టక పొతే లేచి కూర్చుని కబుర్లు చెప్పమంటాడు.నానిద్ర పాడయిపొతే నాకిష్టం లేదు, హాయిగా నాగదిలొ నేను పడుకొంటే తంటాలేదు.''అని.ఒకరికొకరు అనేది పొయి 'నాకు నేనే' అనే నినాదాలు విని పిస్తున్నాయి ఈగాలులు అన్నిచొట్లకు వీచే ప్రమాదం వుంది.స్వెచ్చ కావాలి గదండీఅందరికీ

No comments: