ఇదే ఇదేవసంత లీలా ఉగాది
అదేఅదే మధుమాస హేలా
అవనిలొ తరువులు
చివురులు తొడిగే
చివురుల వెనక
మొగ్గలువూగే
మొగ్గే పూవయి
విరిసినవేళ
పంచ బాణుదే
పరుగున వచ్చె
కబురందగనే
కొయిల పాడే
చిరు నగవులతొ
ఉగాదివచ్చె
పసుపుకుంకుమల
పళ్ళెరములతొ
ఆభరనములతొ
ఆహార్యములతొ
రా రమ్మని
పలకండమ్మా!
శ్రీలిమ్మని
వేడండమ్మా!
No comments:
Post a Comment