Pages

Saturday, March 24, 2007

చూపు

చూపు
పూర్వకాలంలొ రాజా అనె గొల్లవాడు వుండేవాడు.ఖండొబా వాళ్ళ కులదైవం.అతనిదగ్గర ఖండొబావిగ్రహం,ఆయన వాహన మైన గుర్రం విగ్రహం వుండేవి.రెండూ బంగారు విగ్రహాలే,కాకపొతే దేవుని విగ్రహం కన్నా వాహనం పెద్దదిగా వుండేది.పెద్దలు చెపుతూ వుంటారు, ధనదేవత లక్ష్మి చాలా చంచల స్వభావం కలది,అని.కాలము, ఋతువులు మారుతున్నట్లే మానవ జీవితం కూడా మారిపొతూ వుంటుంది.ఓడలు బండ్లు,బండ్లు ఓడలు అవుతూంటాయి.ధనవంతులుబీదవారవుతారు,బీదవారు,ధనవంతులు అవుతారు.అలాగే రాజాకూడా బీదవాడయిపొయాడు.ఒక తల్లికి ఇద్దరు బిడ్డలున్నారు.ఒకడీపేరు ఇశ్వర్యం ఒకడిపేరు దరిద్రం.ఒకరంటే,మరొకరికి ప్రాణం. ఇద్ద్రూ పక్క పక్కనే వుంటారు.అన్నగారు మన దగ్గర కొస్తే మనకు ఐశ్వర్యం,తమ్ముడు వస్తే దరిద్రం.అన్న వచ్చినపుడుమనకి ధనరాశులు వస్తాయి,శక్తివస్తుంది,జీవితం పురొగమిస్తుంది,రాజ్యం చేతికొస్తుంది.అప్పుడు తమ్ముదు అంటాడట ''నువ్వు వీళ్ళకి అన్ని సమకూర్చి అలసిపొయావు,ఇక నేను చూసుకొంటానులే అంటాడట. అప్పుడు మనకిదురద్రుష్టం, చీకాకులు, దేవిరింపు,తీరనికొరికలుతయారవుతాయి.రాంజా పరిష్తితి అల్లగే వుంది.తినడానికి తిండి,తాగటానికి నీరు దొరకని రొజులు వచ్చాయి.

రాంజా ఇంట్లొ వస్తువులన్ని అమ్మేసుకొన్నాడు.ఇక దేవుని విగ్రహాలు మాత్రం వున్నాయి.అతని బధలు చూడలేక స్నేహితులు సలహా చెప్పారు. ''రాంజా? ఎందుకు తిండిలేకుండా బాధ పడతావు, నీపూజా మందిరం లొ రెండు బంగారు విగ్రహాలున్నాయికదా!భగ వంతుణ్ణి క్షమార్పణ వేడుకొని ఆరెందూ అమ్మివేయి.డబ్బులు వస్తే కొన్ని గొర్రెలు కొనుక్కొని జీవనం సాగించు.డబ్బు సంపాదించాక మళ్ళి విగ్రహాలు కొనుక్కొందువుగానీ అని.మందిరంలొ పెట్టి పూజచేసి బ్రహ్మణులకి,సాధువులకి,బీద వాళ్ళకి,గుడ్డి వాళ్ళకి,కుంటి వాళ్ళకి మంచి సంతర్పణ చేద్దువుగాని అన్నారువాళ్ళు.మానవుదు బీదవాడయితే దబ్బు లేకపొవడమేకాదు,మూగవాడయి దీనుడయిపొతాడు.రాంజికి స్నేహితుల మాటలు నచ్చాయి.మందిరం లొంచి విగ్రహాలుతీసి బట్టలొ మూట కట్టుకొనిఒక కంసాలి దగ్గరకివెల్లాడు.'ఎమిటి!రాంజా! ఇలా వచ్చావు?'అన్నాడు కంసాలి.రాంజా బట్టలొ మూట కట్టిన విగ్రహాలు,ఖండొబా,గుర్రము రెండూతీసి బయట పెట్టీవీటిని అమ్మడానికి వచ్చాను,తిండి గదవడం కష్టంగావుంది,అన్నాడు.

కంసాలి పరీక్షిస్తున్నాడు.వీటి కెంత దబ్బు వస్తుంది? అన్నాడు రాంజా.కంసాలి వాటిని తూకం వేసాడు.ఖండోబా విగ్రహమొకకిలొ బరువు వుంది,గుర్రం తూస్తే మూడుకిలొల బరువు వుంది.ఆరొజుల్లూక వెయ్యి రూపాయలు పెడీతే ఒక కిలొ బంగారం వచ్చేది.కంసాలి అన్నాడూరాంజా!ఒకవెయ్యి రూపాయలు ఖండొబా విగ్రహానికి,మూడు వేల రూపాయలు గుర్రానికి వస్తుందీ.అన్నాడు. దాంతి రాంజాకి ఎక్కడలేని కొపము వచ్చింది.నీకు అసలు బుర్రవుందా!దేవుడీకి వెయ్యి రూపాయలూ,గుర్రానికి మూడువేల రూపాయలు ఇస్తావా?అని ఎగిరి పడ్డాడూ.''రాంజా!నీకే బుర్ర లేదు.నువ్వు ఒకదాన్ని దేవుడుగా,ఒకదాన్ని వాహనంగా చూస్తున్నావు.నాకదేమీలేదు,దేవుడుకిలొ ఎత్తు తూగాడు,కనక వెయ్యి రూపాయలిస్తానన్నాను,గుర్రం మూడు కిలొలు తూగింది కనక మూడూ వేలు ఇస్తానన్నాను అమ్మితే అమ్ము లెకపొతే పొ అన్నాడుకంసాలి.దేవుడిని తక్కువ డాబ్బుకి,గుర్రాన్ని ఎక్కువ డబ్బుకి అమ్మడం దేవుణ్ణి అవమానించినట్లు భావించాడు రాంజావిగ్రహాలు తీసి బట్టలొ మూట కట్టుకొన్నాడు.కంసాలికి తెలిసిందల్లాబంగారం తూకంబట్టి డబ్బు ఇవ్వడమె ఎవరి భావం వారిది, ఎవరి చూపు వారిది.

No comments: