Pages

Tuesday, April 3, 2007

దేవీ pooja

పరిమళ మైన మంచి గంధము పూలతొ జల్లెదనే
పనీరు జల్లుచుమల్లె, అత్తరులు మేనున అలదెదనే
మంకెన పూలు,మాలతీలు మరి,పొన్నలు ,పొగడలతొ
రాధాకాంతల్,సంపెంగములతొ పూజలు చేసెదనే
అగరువత్తులతొ ధూపము నిచ్చెద అందుకొనంగదవే
సహస్ర దీపము సరగున నిచ్చెద జ్యొతిని చూడగదే
అరటీ పండు,మరిమామిడి ఫలములు,తేనె,పనస తొనలు
పాలు,పండ్లు, మరి కాగిన పాలను ఆరగించ వమ్మా
ఘుమ ఘుమ వాసనల్ పరిమళించగనువిడియము లివిగోనూ
చత్ర చామరాందొళన దర్పణ గీతము పాడెదనే నే
నృ త్యము చేయుచు పావలిచ్చి నీకు సాష్టాంగము పడితి

No comments: