Pages

Saturday, March 17, 2007

చేతివేళ్ళు

చేతివేళ్ళు
పిల్లలు గంతులేసి ఆడుకొంటూ వుంటే 'ఆకాళ్ళూ, చేతులూ సరిగా వుంచుకొండిరా!అని పెద్దవాళ్ళు కేకలేస్తూ వుంటారు.చేతులు త్వరగా బలహీనమవుతాయి,మణికట్టు మాటవినదు.చేతివేళ్ళు సరిగా పనిచేయడానికి కొన్ని వ్యాయామాలు వున్నాయి.చేతివేళ్ళు వదులుగాపెట్టి చ్గేయి కిందికి వ్రేలాడనియ్యాలి.అరచేయి మీవైపుకి వుండాలి.వెళ్ళన్ని దగ్గరగాపెట్టి జాపాలి.చేతివేళ్ళజివిడిగాపెట్టి, రెండు దగ్గరగా పెట్టి, తరవాత తక్కిన రెండింటిని దగ్గరగాపెట్టివ్యాయామం చేయాలి.ఇలాచేయడం వలన చేతివేళ్ళలొని లింక్ బాగాపని చేస్తుంది.రెండు వేళ్ళనికలిపి అరచేతిలొనికి పెట్టుకొని, తరవాతి మరొ రెండు వేళ్ళతొ ఇలాగే చేయాలి.తరవాత ఒక్కొక్క వేలే లొపలికి పెట్టి ,తీసి వ్యాయామంచేయాలి.మణికట్టుని ముందుకు, వెనక్కు తిప్పాలి.చేతులొ విసనకర్ర పట్టుకొన్నట్లు విసురుతూ నటన చేయాలి,ధర్మామీటర్ విదుపుతున్నట్లు నటన చేయాలి బొటన వేలుని వెనక్కి,ముందుకి వంచాలి.

No comments: