Pages

Wednesday, May 30, 2007

గుడి

cఆసాయంత్రాలు ఎంత అంద మైనవొ?దేవుడు భక్తి ఏమీ తెలియని వయస్సది.అయినాసరేసాయంత్రం అయేసరికి ఆలయానికి లాక్కుపొయేది మనస్సు.అక్కడికి వెళ్ళి వస్తే ప్రశాంతత నెలకొనేది.ఇప్పుడు ఆలయాలలొ ప్రశాంతత కొరవడు తున్నది.ఆలయాలకి వెళ్ళేవాళ్ళు ఇప్పుడుఎక్కువయిపొయారు.నిజంగా దేవుణ్ణి సేవించుకొందాం అని వెళ్ళేవాళ్ళెంతమంది?అనిప్రశ్న జనిస్తొంది.నేనూ నాస్నేహితురాలూ కలసి గుడికి వెళ్ళాము.జనం కిటకిట లాడుతున్నారు.ఆగుళ్ళోందరు దేవుళ్ళూ వున్నారు.ప్రదక్షిణాలు చేసే చోటజాగాలేదు.అందరికి ఆఫీసులకి కాలేజీలకు వెళ్ళే హడావుడి.''నువ్వేమిటి అడ్డం'అన్నట్లు ఒకరినొకరు తోసుకొంటూ పరుగు పందెంలాగా ప్రదక్షిణాలు చేస్తున్నారు.ధ్వజ స్తంభం దగ్గర నిలబడి ఒకావిడ ఎవరితొనో వాదన పెట్టుకొంది.ఒక పడుచు సెల్ ఫొన్ చెవులొ పెట్టుకు ఆపులేకుండా మాట్లాడేస్తోంది. రెండేళ్ళ పిల్ల

2 comments:

రానారె said...

గుడికి వెళ్లటం ఒక ఫ్యాషన్. సంప్రదాయ దుస్తులు ధరించి సంస్కృతి కాపాడుతున్నామనే విషయాన్ని ప్రచారం చెయ్యడానికి వచ్చేవారు, ఆ దుస్తులు వేసుకొని మరెక్కడికీ వెళ్లలేక గుడికి వచ్చేవారు, మేము మోడ్రన్ అనిపించుకోవడానికి మోడ్రన్ దుస్తులలో గుడికొచ్చేవారు, కొన్ని అందమైన ముఖాలను చూడొచ్చునని గుడికొచ్చేవారు, ఆర్భాటంగా నడుస్తూ అందరి దృష్టీ ఆకర్షించ ప్రయత్నించేవారు, గట్టిగా మాట్లాడుతూ నగలప్రదర్శన పెట్టేవారు, ఇంకా ఇలాంటి మరికొందరితో ఎక్కువగా గుళ్లు నిండుతున్నాయి. ప్రశాంతతనూ నిశ్శబ్దాన్నీ ఆశించి గుడికెళ్లటం దండగ. భక్తి అంటే ఏమిటి, గుడికెందుకు వెళ్లాలి - లాంటి విషయాలను మీబోటి పెద్దలు తెలియజేయ ప్రయత్నించగలరని నా విన్నపం.

Naga said...

తెలియలేరు రామా భక్తి మార్గమునూ.. తెలియలేరు రామా.. భక్తి మార్గమునూ..