హే!జగన్నాధా!
మావూళ్ళొ మాఇంటికి కుడి చేతి వేపున వేనుగొపాలస్వామి ఆలయం,ఎడమ వేపున శివాలయం వుండేవి.గొపాలస్వామీఅలయానికే మేము తరచుగా వెల్తూ వుండే వాళ్ళము.అప్పుడు గొపాలస్వామి ఆలయం అంటే గొపాలస్వామి విగ్రహం ఒక్కటే వుండేది.వుండేవాడేమొ గుర్తులేదు.విశాలంగా, పరిశుభ్రంగా వుండే ఆవరణగణపతి లోఅలయం వుండేది. దేముడి మెళ్ళొ వేసే దండలకొసం,పూజకొసం పూలు వెతుక్కొకుండాఅవరణలొనే పూలచెట్లు పుష్కలంగా పూస్తూ వుండేవి.పారిజాతాలు, మల్లెలు,గన్నేరులు,పొగడపువ్వులు పూసేవి.పొగడపువ్వు ఆకారంలొ పెద్దదికాదు,బ్రహ్మాండమైన రంగు వుండదు.వాసన మాత్రం దూరదూరాలకు సాగిపొయి నాసికాపుటాల్నిపలకరించి,నేనిక్కడే వున్నా,రండి అని ఆహ్వానించేవి.సాయంత్రం వేళ గుడికి వెళ్ళి నేలమీద రాలిన పొగడపూలు కళ్ళు విచ్చుకొని వెతుక్కొనిమాలకట్టి జడలొ తురుముకొనేవాళ్ళం.ఇంకొన్ని ఇంటికి తెచ్చుకొనేవాల్లం.పుస్తకాలలొ,బట్టల మడతల్లొ,కొబ్బరినూనె సీసాలొ వేసే వాళ్ళం.అన్ని పొగడ వాసనలు వెద జల్లుతూ వుండేవి.ఆలయానికివెళ్ళిపూజారిగారి దగ్గర తీర్ధం తీసుకొని,ఆయన పేఆఆత్తిన ప్రసాదం తిని, చెమ్మచెక్కలాడుకొని దీపం పెట్టే సమయానికి ఇంటికి చేరుకొనే వాళ్ళము.
1 comment:
పొన్నల పొగడల పూపొదరింటను
చెన్నుమీరగను సింగారంబగు .. ఇదుగో వేణూగోపాల స్వామి ఆలయం.
Post a Comment