Pages

Friday, June 1, 2007

శ్రీ శేషేంద్ర శర్మ

శేషేంద్ర శర్మ శేష సూక్తులు శ్రధ్ధాంజలి
1తడి పచ్చిక కొసలు తగిలితే చాలు, తలలొ విచ్చుకొంటుంది సహస్రార కమలం.
2పక్షులు సృష్టిలో ఆదికవులు.
3మనిషి తోటలు పెంచుకొవాలి,బయట కంటే లోపల.కవిత్వం లాంటి ఆతొటలొ నెమలి సిమిలీ లా నర్తించాలి. 4 ఒక్క పువ్వు రంగును చూస్తూ శతాబ్దాలు బతక గలను.
5కల లేని వాడు, ఒక శిల వంటివాడు.
6రోజూ నా కష్టాల్ని టేబులె మీద పరచిలెఖ్ఖ పెట్టుకొంటాను,ఏంచేయాలో తొచక మళ్ళీ అలమారాలొ పెట్టుకొంటాను.
7తారల గ్రామాల్లోకి వెన్నెల మందలు తోలుకొచ్చాడు చంద్రుడు.
8ఎంతటి గాఢ తమస్సు
చీకటి దుప్పటిలొ ముఖం దాచుకొని
భ్రాంతుల దుస్తులు తీసి
కడుపులోకి కసుక్కున
ప్రశ్నతో పొడుచు కొంటాను.
రక్త ధార లెగ జిమ్ముతాయ్
రేపటి లలిత చేలాంచలాన్ని మలినం చేస్తాయి.
9ఉత్తరాలు విప్పాను పేజీల్లోంచి వెన్నెల రాలింది.''
10''ఒక పువ్వెడు వసంతం కొసం
చెట్లు ఆకులన్నీ రాల్చు కొంటున్నాయి.''
11నాపేజీ మీద ఒక సముద్రం పెడతా
దానిమీద ఒక పడవ పెడతా
దానిమీద ఒక తుఫాను ఊదుతా
అదిపద్యమై ఏతీరాలకు
కొట్టుకు పొతుందో చూస్తా.
.

No comments: