Sunday, June 10, 2007
పర్యావరణ దినోత్సవం
మే 5వ తేదీన పర్యావరణ దినోత్సవం జరిగింది.ప్రజలలో అవగాహన పెంచడానికి ఎన్నో సభలు సమావేశాలు, చిత్ర ప్రదర్శనలు జరిగాయి.వాతావరణం చక్కగా పరి శుభ్రం గా వుంచ టానికి అధికార వర్గాలవారు ఎన్నో సదుపాయాలు చేస్తూ వుంటారు. వాటిని ఉపయొగించుకొని వాతావరణంలో కాలుష్యం పెరగ కుండా చూసుకొవలసిన బాధ్యత మనపై కూడావుంది. మన ఇల్లే వైకుంఠం మనవాకిలే కైలాసం అనుకొని మన ఇంటిలోని చెత్త చెదారం పక్కవారి వాకిట్లోకి వూడ్చేసి ఏమీ ఎరగనట్లు వుండడం సబబుకాదు.భవనాల నిర్మాణం కోసం చెట్లు కొట్టేస్తారు, రోడ్డు వెడల్పు చేయడం కోసం చెట్లు కొట్టేస్తారు, ఎలెక్త్రిక్ తీగలకి అడ్డం వస్తున్నాయని చెట్లు కొట్టేస్తారు. తజాగాలి, చల్లటి నీడ [మనకి పక్షులకి కూడా కరువై పోతున్నది.మనకి అవసరం లేదు అనుకోగానే ఎక్కడపడీతే అక్కడ ఆవస్తువును పారవేయడంలో వెనుకాడరు. అరటి పండు తొక్కలు, కాగితాలు, పీఅస్టిక్ సంచులురోడ్ల మీద విహారం చేస్తూ వుంటాయి.చీకట్లో నడిచేటప్పుడు అవేమనకే ప్రమాదాలు తెచ్చి పెడతాయి.మన భారతీయులు విదేశాలలో వుంటే ఎంతో క్రమశిక్షణతో మెలుగుతారు, వారు అక్కడచూచివచ్చాక అయినా ఇక్కడ అలాటి క్రమ శిక్షణ తో మెలగాలని అనిపించేవాళ్ళు తక్కువ.విదేశాలకు వెళ్ళి చూచి వారి శుభ్రత,వారి కార్యాచరణానుకరిస్తే ఎంత బాగుంటుంది.అయినా మనదేశంలో మనము శుభ్రముగా వుండమా?వుంటాము,కాని ఎంతసేపూ ఎదుటి వారు పనిచెయ్యాలి అనిచూస్తారు. మనపని మనమే చేసుకోవాలి, కాళ్ళు చేతులు పనిచేస్తున్నంత కాలం ఇతరులతో పనిచేయించుకో కూడదు, అనుకొంటే శుభ్ర్త అలవాటవుతుంది.వాల్లు చేస్తారు అనుకొంటే శ్రమ తెలియదు.ఆచేత్తో ఆపని అనే సూత్రం చిన్నప్పటి నుండీ అలవాటయితే ఎంతో మంచిది. ఇంట్లో వున్నవాళ్ళు ఈఇల్లు మనది దీన్ని శుభ్రంగా వుంచాలి,అనుకోవాలి.బడికి వెడితే ఈబడి మనది దీన్నిశుభ్రంగా వుంచాలీనుకోవాలి. పార్క్ కువెడితే ఈపార్క్ లో మనం రోజూ ఆడుకొంటాము,దీన్నిశుభ్రంగ వుంచాలి అనుకొవాలి,ఆఫీసుకు వెళ్ళినా, సినిమా హాలుకు వెళ్ళినా,రైల్ ఎక్కినా,గుడికి వెళ్ళినా అదే భావంతోవుండి,మనపిల్లలకి అదే నేర్పించాలి.ఆదివసులకి పర్యావరణం గూర్చి చెపుతే తెలియలేదట.ప్లాస్టిక్ సంచులు పశువులు తింటే వ్యాధులు వస్తాయి అంటే ఒకామె పొలాలలోఅని సంచులన్నీ ఏరుకొని వచ్చి మడతపెట్టి దిండులా కుట్టిందట.పంచాయతీవారు ఆమెకు బహుమతి ఇచ్చారట.చెత్త వేయడానికి కుడీలు పెడితే అందులో చెత్త వెయ్యకుండా పక్కన,పక్కన పడవేస్తారెందుకో అర్ధం కాదు.అందరూ ఆ రూల్ తెలిసిన వాళ్ళే.అటవీశాఖవారు వుచితంగా చెట్లు పవ్చిపెట్టారు.ఎవరికి వరే చైతన్య వంతులై,తమవిధులు తాము సక్రమంగా నిర్వహిస్తే ఒకొక్కదానికి రోజులను నిర్ణయించి ప్ర్తి చెవిలో బాకావూదే శ్రమ,ఖర్చు తగ్గుతాయేమో
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment