Pages

Friday, June 8, 2007

ఆంధ్రా వుడ్ హౌస్ రావూరు

ఆంధ్ర వుడ్ హౌస్
రచన పుచ్చా పూర్ణానందం
జీవితం ట్రాజెడీయో కామెడీయొ మనకు తెలియదు,ఎంచేతంటే దాని సృష్టికర్త మనంకాదుకనుక,అంచేత మన చేతిలొ పని కనక కామెడీయే వ్రాస్తేపోలా!అందుకే కాబోలు శ్రీరావూరు హాస్య వ్యవసాయం చేసి నవ్వుల పంట పండిస్తున్నారు.కొందరు తన పుట్టంతా మునిగి పోయినట్లు, ఈప్రపంచ భారమంతా తమభుజ స్కంధాల మీద వున్నట్లుగా రోదన వదనంతో క్షామదేవత ఫొజు పెడ్తారు.ఆషామాషీతో వాళ్ళను సైతం పరిహాస వదనులను చేయగల ప్రజ్ఞ శ్రీరావూరుకు వచ్చింది.
బొడ్డున మాణిక్యం పెట్టుకొని పుట్టారేమో తెలియదుకాని,బొడ్డున హాస్యం మాత్రం పెట్టుకొని జన్మించినట్లు అక్షరాలా రుజువు చేసారు.సహజ చాతుర్యం, లాబర్డ్ విట్ కాదు, ఆయన విట్లొ విటమిన్స్ వున్నాయి.హాస్య సృష్టి చేయ గలుగు తున్నారు,వానలో తడవని వారులేరు, వారి హాస్యం అంతో ఇంతో రుచి చూడని వారు లేరు.ఆంధ్ర పాఠక లోకంలో పెరన్నియల్ ఫ్లో అఫ్ అమౌంట్ .తెనుగు హాస్య సారస్వతంలో ఇంతటి ప్రొలిఫిక్ రైటెర్ లేడు.కొందరు అరటి గొడ్రాళ్ళుగా మిగిలి పోతారు.మరి ఈ హాస్య కృషీవలుండు హాస్యోత్పత్తి చేస్తూనే వుంటాడు.సాలీనాకాదు, రోజువారీ తప్పాతాలూకాదు,మేలురకం రాలుబడి,ముతక మోటు, నాటు హాస్యం కాదు ఉత్తమజాతి.వీరి హ్యూమర్ క్రూడ్ కాదు,మ్యూడ్ కాదు,న్యూడ్ కాదు.వీరి జోక్ నాజూకుగా వుంటుంది, దోకు పుట్టించదు,వెకిలితనంలేదు,యెబ్బెట్టులేదు,బూతూ,బఫూనరీ కాదు.వల్గారిటీ లేదు.ఔచితి, సభ్యత, రమ్యత,సున్నితం కలిగి వున్నత మైన స్థాయిలో వుంటుంది.ఏటాపిక్ అయినాసరే టిపికల్గాచక్కని హాస్యంలోకిమ్రుదు మధురమైన భాషలో మలచగల దిట్ట.గడ్డి పోచనుంచి గాడ్వరకువీరి హాస్యానికి ఆలంబనమే. వీరి హాస్య రచనలో విటుపరేషన్,అబ్యుస్ కలికానికి కూడా కానరాదు.అన్నవస్త్రాల కొరత లగాయితు,అణ్వస్త్ర పరిమితి వరకుసమస్త విషయాలపై సరసమైన హ్యూమర్ కుప్పించారు.వ్యక్తులు చర్యలు గర్భితంగా వున్నవ్యంగ పూర్ణమైన హాస్యం,మెత్తని అధిక్షేపణ,గార్హ్యస్థ్య మైన హాస్యం కొట్టినపిండి.నల్లేరుపై బండి.వారి హాస్యం తలుపు చెక్కతో కాదు, తమలపాకుతో,దుడ్డుకర్రతోకాదు,పూలచెహండుతో,పల్లేరు ముళ్ళతో కాదు,పన్నీరుజల్లుతో.కొందరి హ్యూమర్ మేటుగా వుండిగంటా, గాయమూ.వీరి హాస్యం కితకితలు పెట్టిమోడును సైతం పకపక నవ్వింప చేస్తుంది.వీరిది ద్రాక్షపాకం,కొందరిదిగచ్చకాయ పాకం,కుంకుడు బ్రాండు.పర్రలోంచి పాంకం తీయగలదు,లోకానుభవం మెండుగా వుండి,మేధస్సు,ఓజస్సు,తేజస్సుకలిగిప్రజానీకాన్నీఅనద డోలికల్లోవూపుచున్నాడు.వీరిహాస్యం శారదకు అగరు ధూపం,వాణి కంఠ సీమలో మణిమాల.సాహిత్య సరస్వతికి అత్తరు దీపం.ఆంధ్ర వాజ్మయానికి సౌగంధం,సురుచిచేకూర్చు తున్నారు.స్కై స్క్రాపెర్ లాగాచుక్కలు తాకే రసహర్మ్యం యొక్కాఖరి అంతస్థుకు వీరి హ్యూమర్ ఎలెక్ర్టిక్ లిఫ్ట్,బ్రహ్మానంద ప్రాప్తికి షార్ట్ కట్.వీరి మణికట్టూలో పటుత్వమైన కవిత్వం వుంది.వీరి పంచి కట్టులో సిధ్ధిపరచిన రస గుళికలు, కణీకలు వున్నాయి.బారోవుడు విట్టు కాదు,ప్యూర్ ఒరిజినాలిటి. బార్న్ హ్యూమరిష్ట్ ఇతను.వీరి హాస్య స్రవంతి జీవనది.కొందరి సరసం వల్ల బోన్ ఎక్స్పెర్ట్ దగ్గికి వెళ్ళాల్సిన గతి పద్తుంది.వీరి హాస్యంతో అజీర్ణ రోగం వదలి అతిజీర్ణవ్యాధి పట్టుకొన్యుందిి

No comments: