Pages

Wednesday, June 6, 2007

ఆంధ్ర వుడ్ హౌస్ raavooru

శ్రీరావూరు ఇండివిడ్యూల్ కాదు ఒక ఇనిస్టిట్యూషన్.ఆయన టెలిగ్రాఫిక్ అడ్రెస్ ''భాషాకుటీరం'.ఏ ప్రదేశం లొవున్నాఅయనతో పాటు ప్రయాణం చేస్తూ వుంటుంది.అహర్నిశలూ సాహిత్య గొష్టే.ఏకవి వచ్చినా ఏకళాకారుడు విచ్చేసినా యెట్టినోటీసు లేకుండా అర నిముషంలొ చక్కని సమావేశం ఏర్పాటు చేయగలడు.పిపీలికాది బ్రహ్మ పర్యంతం ప్రోగవుతారు.కల్చరర్ టవర్స్,లిటరరీ జెయింట్స్ హాజరవుతారు.సన్మానాలు చేయడంలొ ఎంత సరదాయో.వస్త్రార్ధం అక్షతాన్ సమర్పయామి ,ధూపార్ధం అక్షతాన్ సమర్పయామిబాపతుకాదు,అన్నీ యథావిథి .పూలహారం శాలువా, సన్మాన పత్రం, ఉపన్యాసం అన్నీ సక్రమంగా జరుగుతాయి. సభ్యుల విరాళాలు నాం మాత్రం, మూడు వంతులు చేతి చమురు భాగవతం.నిండు హర్షమూ, మహదానందం, బొళా శంకరుడు, లోకుల సొమ్ముతోలొక మరమ్మత్ కు పూనుకొన్నప్రయోజకుడు కాదు.పైసాను కసువుగా చిమ్మేసిన ఋషి.రాబడి వుండాలికానిఖర్చు బడికేమీసందేహం, సంకోచం లేదు.సమస్యలతో సతమత మయ్యేయువతీ యువకులకుసలహాలిచ్చే ఫ్రీ కన్సల్టింగ్ హోం.
ఆయనకు సంస్యలు లేవు,వున్న సమస్యల్లా వీళ్ళందరికి ఎలాసహాయ పడటమానేది.ఏదో ప్రాబ్లం వుంటేగాని నిద్ర పట్టదు.హి ఈస్ ఫైర్ టు ది ఫ్రైల్ సెక్స్ ,హి ఈస్ దైర్ గైడ్ఫ్రెండ్
అండ్ ఫిలాసఫర్.సనాతనుల్లొ, అధునాతనుడు ,అధునాతనుల్లొ సనాతనుడు.వారానికో సమావేశమ్మాసానికో కవి సమ్మేళనం వారి నివాసం సరస్వతి మందిరం.సభల్లో సర్ప్రైసింగ్ గా ప్రాక్టికల్జొక్స్.ఇంటిమేషన్ లేకుండానేప్రిసైడ్ చేయమంటారు.ఆదెబ్బతో సభాపిరికి అరేటర్,మూగమనిషి మహా వాజ్మి అయి తీరుతారు. అదంతా వారి ఇన్స్పిరషన్ చేతనే ఇలాంటి గమ్మత్తులు చేస్తూ వుంటారు.ఇలాటి తయారీ,తర్ఫీదు ఇస్తూ వుంటారు.మైడెన్ పెన్స్ కు ప్రిఫరెన్స్ ,ఇందుకు తొలకరి జల్లే తార్కాణం.
ఆరేళ్ళ వాళ్ళ తోనూ, అరవై ఏళ్ళ వాళ్ళతోనూ క్లోస్గా అసోసిఏట్ కాగలరు.పసి వళ్ళతోనూ,నుసలి వాళ్ళతోనూసమ నంగా కాలక్షేపంచేస్తూవుంటరు. ఈలక్షణం ఎవిరి ఇంచ్ అన్ ఆర్టిష్త్ అని ఋజువు చేస్తుంది.వేదాంతులను వెక్కిరిస్తూ, వెక్కిరింతలో వేదాంతం బోధిస్తారు.ఎవరూ చూడనిది వ్తికి చూపడం, మట్టి లోంచి మాణిక్యాలనుతీసికొని వెదజల్లడం, రాకెట్ లేకుండా చద్రమండలానికితీసుకొని వెళ్ళటం,పంచదార కరవు రోజుల్లొ చాతుర్యంలోని మాధుర్యం ఫ్రీగా సరఫరా చేయడమెంతోచెప్పి, ఏమీ చెప్పక పోవడం ఏమీ చెప్పనట్లే ఎంతో చెప్పటం ఈప్రక్రుతి జ్ఞాన పురుషునికిప్రత్యేక కృషి,ఏ . గూడ్ సైకాలజిష్ట్

2 comments:

oremuna said...

చాలా పెద్దగా వ్రాసినారు

ఓ నాలుగు ముక్కల్లో ముందు ఉపోద్గాతం వ్రాస్తే బాగుండేది

మన్యవ said...

ఒకే పేరా చాలాసార్లు #paste# చేసినట్టున్నారు పొరపాటున.