పచ్చిపసుపు కొమ్ములా పార్వతీదేవిలావున్నమామ్మగారువచ్చి ''తాతగారు ప్రొద్దున్నే ఆంజనేయ స్వామికి పూజచేస్తారని చెప్పి,మామనుమరాలు నీఅంతే వుంటుందిలే,కలసి ఆడుకోండీ'అంటుంది.
ఆమ్మాయివస్తేతల్లి పీటవేసీ'రా!పాపా!కూర్చో ''అంటుంది.ఆమ్మాయి జడలు రెండూనేలకు తాకుతూంటాయ్.వాళ్ళమ్మ నైసుగా గంటసేపు దువ్వి జడవేసి వుంటుంది.మా అమ్మ ఎప్పుడూ చిక్కేతియ్యదు- పైపైన దువ్వుతుంది,అడిగితే రేపుతీస్తా మాపుతీస్తా అంటుంది.
పిల్లలు తల్లితో గట్టిగా అనకపోయినాలోలోపల ఎలానిర్ణయాలు చేసుకొంటారో!
ఆపిల్ల పట్టు బట్టలు వేసుకొస్తే''నువ్వు పెళ్ళికెడుతున్నావా!అని అడుగుతుందీల్లేరమ్మ.ఆమ్మాయి 'లేదూ'అంటుంది.అయితే పట్టు పరికిణీఇంట్లో ఎందుకువేసుకొన్నావు?ఇంట్లో విస్త్రీ లేని బట్టలు వేసుకోవాలి.
తను జడ వేయించుకొని,ఉయ్యాల వూగుదాం రా! అంటుంది.ఆపిల్ల మొహమాటంగా''ఉయ్యాలబల్లమీద మా తాతయ్య వున్నాడే!అంటుంది.పూర్వం పెద్దవళ్ళనిలెమ్మనడంగానీ,వాళ్ళు పిలవకుండా వాళ్ళ పక్కన కూర్చోవడానికి పిల్లలు జంకేవారు.ఇల్లేరమ్మ నవ్వీ'పిచ్చిమొహమా!ఆవుయ్యాలకాదే,జామచెట్టు వుయ్యాలాని,ఏమిటో జామచెట్టు వుంచుకొని వుయ్యాలవూగవచ్చని కూడా తెలియదు వీళ్ళకిఏమిమనుష్యులో!qఅనుకొంటుంది.నిజంగానే వున్నదానివున్నదానిఉపయోగం,దాన్ని అనుభవి ంచడం తెలియనిమనుష్యులెంతమందోలోకంలో.
''నువ్వు మా అమ్మని చూసావుగా!మరి మీఅమ్మని చూపించు!అంటుంది.గబగబ అందర్ని చూసి పరిచయం చేసేసుకోవాలి.పైగా తను చూసాకమనకాలస్యం ఎందుకు!అని.
సున్నిత మైన హాస్యం తెలుగు నుడికారం,ఆచారాలు,అంతరంగ చిత్రాలు,భావ ప్రకటనలు,పెద్దా చిన్నల మధ్య మర్యాదగీట్లు, ఎన్నోవున్నాయి ఇల్లేరమ్మ రాలుగాయి తనానికి విస్తుపోతూ,నిశితమైన ఆలోచనలకి మురిసి పోతూఈపాత్రని మదిలో పదిల పరచుం కొంటాము.గుర్తుకొచ్చినపుడల్లా హాయిగా నవ్వుకొంటాము,ఇంతకంటే ఫలితం ఇంకేమికావాలి కధకు?
No comments:
Post a Comment