cont
వాళ్ళమ్మ ఎప్పుడులేచిందోస్నానంచేసి పీటమీద దేముణ్ణిపెట్టి,''నాలుగుపూవులు కోసుకురావే అంటుందీ',''ఈవిడ పందిరి గుంజకు కూడా పనిచెప్పగలదు,అనుకొంటుందికాని పైకి ఏమీ చెప్పదు.
పాలు పొంగిస్తూ''పాలు పొంగిపోతూంటే,పొంగిపోతున్నాయి ,పొంగిపోతున్నాయి, అనీరవకు,అలాకాకుందాసూర్యనారాయణ మూర్తికి దణ్ణం పెట్టుకొంటే పాలుపొంగినట్లుసంసారం పొంగనిస్తాడూ' అంటుందితల్లి.గ్లాసుడు పాలుపోయినామాట్లాడదుఇల్లేరమ్మ.
పెరట్లో కచికవుంది, పళ్ళుతోముకురా!అని ఆర్డెర్ వేసిందితల్లి-కచిక తిన్నావంటే ఇంజెక్షన్ చేయిస్తాంది.ఏమాత్రం కన్వీన్సె కాకుండా పిల్లలని ఖరారుగా పెంచుతుంది.
కొత్త ఇంటి పెరడంతా తిరుగు తుంది ఇల్లేరమ్మ.పారిజాతం చెట్టు చుట్టూఅలికి వుంచారుట,పూలు రాలితే మట్టి అంటుకోకుండా వుంటుందని.అక్కదో జామవ్చెట్టు,ఇంటివాళ్ళ్కి జామచెట్టు పెంచడం తెలియదుట.చిన్న,చిన్న కొమ్మలు నేలకి వంగి వున్నాయీ'ఎవరేనా ఇలాపెంచుకొంటారా!Zవెధవ పిల్లలుంటారు చూడండి,ఇంత కిందగా కాయల్ని చూస్తే వాళ్ళు బతక నిస్తారా?[తనుచిన్నదికానట్లు.]వయసులో చిన్నతనం, ఆలోచనలో పెద్దతనం.ఒకసారి ఆజామకొమ్మలు పట్టుకొని వుయ్యాలావూగిదోసెడు పారిజాతాలు ఏరుకొని వచ్చిపీటమీద గ్రుమ్మరిస్తుంది.దేవునికవి ప్రీతి అని తెలుసు.
పూర్వం ఇంటివారు, అద్దెకున్నవారు తేడాలేకుండామసలేవాళ్ళు.ఇంటావిడ రెండు గిన్నెలలోచక్కెర పొంగలి, పులిగోరతెచ్చి,వంటింటి గుమ్మం అవతల నుంచుని లోపలికి తోసిందిట.ఇంతి వాళ్ళు అన్నీ చేసి అద్దెవాళ్ళకివ్వాలికాబోలు అనివిస్తుపోతుంది ఇల్లేరమ్మ.వాళ్ళు మధ్యాహ్నం భోజనం కూడాతెస్తానని సామాను సర్దుకోమని చెప్పి వెళుంది.ఇంకేమి పనిలేదుగామ్మా!తోట చూడ్డామురా!అంటుంది.తల్లి, చాల్లే-పురికోసలు కత్తిరించి గోనె సంచుల్లో సామానులు తీద్దామురా!అంటూంది.
నాన్నేమో పులిహోర తినిసైకిలెక్కి సైటుకెళ్ళిపోతే-అమ్మఒక్కత్తీ ఈసామానులన్నీ ఎలాసర్దుకొంటుందో?జాలైనాలేదు నాన్నకీనుకొంటుంది.ఆటకాయి తనంగా కనిపించినా అన్ని సంగతులు తెలుసు చిట్టికి. cont
No comments:
Post a Comment