Pages

Thursday, October 4, 2007

కిటికీలో పూలు

నాకు నచ్చిన కధ
కిటికీలో పూల తోట
రచన టి.జ్ఞాన ప్రసూన
హాస్యం వ్రాయడం అనేది హాస్యం కాదు.హాస్యం పాఠకుల హృదయాల్ని కదిలించి,గిలిగింతలు పెట్టి,కవ్వించి, నవ్వించివ్యధలను, వ్యాధులను వదలగొట్టి,ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది.హాస్యకధలు వ్రాసే రచయిత్రు లలోడా .సోమరాజు శుసీలగారొకరు.వారు రచించిన ఇల్లేరమ్మ క్స్ధలు ఇంపైన కధలు.నాకు నచ్చిన కధ ''కిటికీలో పూలతోటా'
ఇల్లిల్లూ ఏలుతూ తిరిగే శుసీలకి ఇల్లేరమ్మ అని ముద్దుపేరు.ఎంత తెలివికలదో, అంత అమాయికముగా ప్రశ్నలు వేసి, అమ్మచేత మొట్టికాయలు తింటుంది.నలుగురితో తిరిగి పరిచయాలు చేసుకోవడం,రుచికరమైన వంటలు తినడం,తన దృక్పధానికి భిన్నంగా వ్యవహరించే వ్యక్తుల్ని చూసి ఆశ్చర్య
పోయి,నోరు వెళ్ళ బెట్టడం ఇల్లేరమ్మ స్పెషాలిటీస్.బెజవాడ నుంచి ఇల్లేరమ్మ నాన్నగారికిఏలూరు బదిలీఅయింది.పెందరాళే బయల్దేరదామనితయారవుతే ఇంటి మామ్మగారు వర్జ్యం వుందని ఆపేసారు.అంచేత కృష్ణ దాటగానే తెచ్చుకొన్న పులిహోరకాస్తా తినెయ్యాల్సి వచ్చిందిట.అరటిపళ్ళోఓ ఆరగించేసారు.ఒకవేళ వూరు వెళ్ళేలోపున అన్నాలు తినెయ్యాలేమో?అనుకొంటుంది ఇల్లేరమ్మ.అమాయికంగా'భోజనం వేళకి ఆకలేస్తే అన్నాలెలా?అంటుంది.వళ్ళమ్మకి చర్రున కోపం వస్తుంది,''పులిహోర చేస్తేప్రయాణంలోకాస్త కడుపు నిండుతుందనీనుకొంటే అది తినేసి,అన్నమెలా? అంటుందా?'టిఫిన్లు టిఫిన్లులా తినాలి ,పిల్లలు పిల్లల్లా వుండాలి,అని రూల్సున్న అమ్మా'నీది కడుపా!కండవిల్లి మడుగా!అని అక్షింతలు వేస్తుంది.దానితో నిద్ర పోయిన ఇల్లేరమ్మని అదే అవ్స్తలోకొత్త ఇంట్లో గదిలో పడుకో పెడ్తారు.అక్కడ పూల పరీమళం ఇల్లేరమ్మని తట్టి లేపుతుంది.ఒక కిటికీ లోనుంచి రాధామనోహరంతీగ,మరొక దాంట్లోంచి గిన్నె మాలతి పూలు,మూడో దాంట్లోంచి జాజి తీతీగ లాంటిది వుంటాయ్' ''ఏలూరులో కిటికీల్లొంచి పూల తీగలు వాటంతటవే వచ్చిపూస్తున్నాయి,ఈవూరివాళ్ళెంత పుణ్యం చేసుకొన్నారో అంటుంది సుశీల. cont

No comments: