Pages

Sunday, March 23, 2008

సఖీ!చెలీ!
కళ్ళల్లో మెరుస్తున్న కాంతి దాచుకోకు
మళ్ళీమళ్ళీ పెదవులపై మల్లెపూలు పూయనీ
మదిలోపల మాత్సర్యం మదం పెంచుకోకు
అదికాదు వాటికిచోటు
అక్కడ
అంటే నీఅంతరంగంలో
అల్లుకుపోవాలని
ఆతృత పడుతున్నాయి
అంతులేని భావాల
భామామణులు
శాంతి, సత్యం
కరుణా సేవా
వినయం, విజ్ఞానం
వాటికియ్యి చోటొకింత
గుంపులో ఒక మనిషిగా
గుర్తింప బడతావు
ఎక్కడో
ఉన్నత స్థానంలో
నువ్వు నిలబడితే
అప్పుడేపూస్తాయి
నాకళ్ళల్లో పారిజాతాలు
టి.జ్ఞాన ప్రసూన

No comments: