భవానీ
సంగతి కనుగొన్నావే
సరసమయీ
సారసలోచనీ భవానీ నా
సారము లేని సంసారము లోబడి
పారము గానక పరిపరి పొగిలే
దేవళములు దర్శింపగలేను
వేద శాస్త్రములు చదువగలేను
నీపద సన్నిధి నిశ్చల మదితో
నిముషమైన నే నిలువగ లేను
పొద్దు,పొద్దునా పొట్టకూటికై
యుధ్ధము చేసెడి ఈక్షణములలో
నీపద సన్నిధి ఒక పువ్వైనా
పెట్టలేని ఈపేద బ్రతుకు నా
ఒక పాటైనా పాడగ లేను,
ఒకమాటైనా పలుకగ లేను
నీకరుణామృత వర్షము కొరకై
చీకటి చిప్పలో చింతిలు చున్నాను
No comments:
Post a Comment