తపన
కవిత్వం వ్రాయాలి
ఇవాళే వ్రాయాలి
ఇప్పుడేవ్రాయాలి
ఎలా?
ఎలాఏమిటి
తామర పత్రంలాటి
కాగితం కావాలి
ఇదుగో
లేడిలా పరుగెత్తే
కలంకావాలి
ఇదుగో
అందమైన కిటికీ పక్కన
మెత్తటి కుషనువేసిన
ఉయాలా వూగే
కుర్చీ కావాలి
ఇదుగో
బయట పచ్చని మైదానం
చ్ గుబురుగా చెట్ళు
చెట్లనిండా పక్షులు
వాటినిండా పూలు
పరిమళాలు కిటికీలోనుంచి
పరుగెత్తుకు రావాలి
ఇవిగో
వూహలు రేకెత్తిస్తూ
హృదయాన్ని కవ్వించే
సంగీతం కావాలి
ఇదుగో
ఇంకేమికావాలి?
పళ్ళా,పాలా?జిలేబీలా?
ఏదో కావాలి, ఇంకేదో కావాలి
ఆహా!ఇప్పుడు తెలిసింది
ప్రపంచం మరచిపోయి
ఆకాశపుటంచుల్లో
తెలిమబ్బులనావల్లో
పరుగెడుతూ
పాటలల్లడానికి
సృజనాత్మక శక్తి
ఉత్సాహమూ,ఊహా
నీకుకావాలి
అవేలేకపోఅతే
ఇవన్ని ఎన్నివున్నా''సున్నా'
టి.జ్ఞన ప్రసూన
No comments:
Post a Comment