Pages

Sunday, July 22, 2007

ఆష్టా చెమ్మ

అష్టాచెమ్మ ఆట
అష్టాచెమ్మ ఆటకిముందుగా గడులు నేలపైన సుద్దతో గీసుకోవాలి.దీనికి ఎటుచూసినా అయిదు గడులు వచ్చేలా గీసుకొవాలి.ఈగళ్ళు చతురస్రాకారంగావుంటాయి. కెంద్రంగావుండేమధ్య గడిని ఖాళీగావుంచి,దానికి సమానంగానాలుగు వెపులాగళ్ళలో ఇంటూలు దిద్దాలి.దానిపై వరసలోరెండవ వరసలో పెట్టిన ఇంటూలకి ఎదురుగానాలుగువేపులా ఇంటూలు పెట్టాలి.అప్పుడు ఆట ప్రారంభించాలి.ఈఆటలొ నాలుగు వేపులా నలుగురు కూర్చుని ఆడవచ్చు. ఒక్కొక్కరివద్దా నాలుగు,నాలుగు పావులుంటాయి. పందానికి నాలుగు పెద్ద గవ్వలు కావాలి.ఎవరివేపు వున్న ఇంటూనించి వారు ఆట మొదలుపెడతారు.వారిపావులు అక్కడినుంచెqఅ కదలడం ప్రారంభించాలి.గవ్వలు గిలకరించి పందెం వెస్తే నాలుగు గవ్వలు బోర్లాపడితేఅష్టాంటారు,అప్పుడు పావులు ఎనిమిది గడులు నడుస్తాయి.తరవాత పందెం వేసే అవకాసంవీరిదే.నాలుగు గవ్వలు తిరగపడితే చెమ్మాంటారు, దీనికి బ్ పావులు నాలుగు గళ్ళు నడుస్తాయి. తరవాత ఇంకొకసారి పందెం వెయ్యవచ్చు.ఇంటులు లేని గడులలే వేరే వారి పావులు వున్నచోటికి మన పావుల లెక్కతే వెడితే వాటిని చంపాలి. అప్పుడు మరొక పవ్దెం వేసే అవకాసం కలుగుతుంది.పావులు కుడి వేపునుంచి కదల్చాలి. పావులు మొదటి వరసని చుట్టివచ్చాక ఎడమవేపు నుంచి లోపల ఘదికివెళ్ళి ఖాళీగావున్నగడి చుట్టూతిరిగి ఆగడిలోకి వెడితేపండిపోయినట్లు లెఖ్ఖ. ఎవరిపావులైతే మధ్య్ గడిలోకి నాలుహు చేరతాయో వారు గెల్చినట్లులెఖ్ఖ.
లొపల సాదాగళ్ళలో కూడాపావులను చంప వచ్చు.
ఇది నాకు తెలిసిన అఖ్టాచెమ్మ ఆట.
టి. జ్ఞానప్రసూన

3 comments:

కొత్త పాళీ said...

శ్రీమతి జ్ఞాన ప్రసూన గారికి నమస్కారం.
కీ.శే. భానుమతి గారి గురించి భరాగో వెలువరించిన పుస్తకం మహామహిళలో - భరణీ వారి ఆస్థాన రచయిత శ్రీ రావూరి సత్యనారాయణగారి అమ్మాయి జ్ఞాన ప్రసూన గారు ఒక వ్యాసం రాశారు - మీరేనా ఆ జ్ఞాన ప్రసూన?
అలా ఐతే చాలా సంతోషం. మీ తండ్రి గారి జీవిత రచనా విశేషాలు, భానుమతి ని గురించి మీకు తెలిసిన్ ఇతర విషయాలేవైనా కూడా మాతో పంచుకోమని మనవి.

విహారి(KBL) said...

చిన్నప్పుడు ఈ ఆట తెగ ఆడేవాళ్లం.మళ్లి గుర్తుచేసారు.

Unknown said...

వెండితెరపై తనదైన శైలిలో నవ్వులు కురిపిస్తాడు బ్రహ్మానందం. ఒక్క డైలాగ్ కూడా మాట్లాడకుండా నవ్వించగల సత్తా ఆయనది. ఓ మంచి కళాకారుడికి నిదర్శనం బ్రహ్మనందం అంటే అతిశయోక్తి కాదు. బ్రహ్మీ మంచి నటుడే కాదు.. మంచి పెయింటర్ కూడా. ఇప్పటివరకు ఎన్నో బొమ్మలు గీశాడు. వాటిలో శివుడు, వెంకటేశ్వర స్వామిని కలిపి, గీసిన అద్భుతమైన బొమ్మ ఒకటి. తాజాగా, వెంకటేశ్వర స్వామి బొమ్మ తయారు చేశారు బ్రహ్మానందం. అయితే.. పెన్సిల్ తోనో, కుంచెతోనో కాదు. మట్టితో తయారు చేశారు.
ఆ విగ్రహం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
http://www.netitelugu.com/telugu/brammanandam-art/