Pages

Sunday, April 13, 2008

వెనుకటి జ్ఞాపకాలూ

వెనకటి జ్ఞాపకాలు
రామక్రిష్ణా మఠంలొ ఏకాదశి భజనకి వెళ్ళితిరిగివస్తూ మందిరం
మెట్లు దిగుతున్నా,పూర్వం మేము అద్దెకున్న ఇంటి వారి అమ్మాయీ'ళలితా'
కనపడింది.కొన్ని ఏళ్ళయిపోయింది చూసి.అయినా ''ళలితా' అలానేవుంది,
ఏమీమారలా సన్నగా అగరుబత్తిలా. మీరిక్కడ,ఎలా? అంది.మేము ఈవూరు
వచ్చేసాము, ఢిల్లీవదలి రెండేళ్ళయింది, కానీ ఎవరినీ కలవలా.
ఇంకాఎవరెక్క్డ వున్నారోఅ వెతుక్కొంటున్నాను,అన్న,నువ్వు కనిపించావుసంతోషంగా
వుంది,అన్నా.కుశల ప్రశ్నలు అయాక సుందరం,విమల,కల్యాణి,రాజమ్మగారు ఎక్కడున్నారో
తెలుసా?వాళ్ళా అమ్మాయిలిద్దరికి పెళ్ళిళ్ళయిపోఅయాయి, ఇద్దరూ యు ఎస్ లో వున్నారు.
మీరుమాతోఅపాటు వాళ్ళకి ప్రైవేటు చెప్పే వారుకదండీ?అందిలలిత ప్రైవేటు
అనంగానేనాకు నవ్వు వచ్చింది,మరే,విమల ఎప్పుడూ ఇంగ్లీష్ చదివినా కాటన్,
కాటన్ అంటూ వుండేది,అన్న.ఆ ఆ అమ్మాయిలిద్దరూ ఇప్పుడు ఉద్యోఅగాలు చేస్తున్నారు.
నిజమా?అన్నాను.
తరవాత వాళ్ళ అడ్రెస్ కోసం గాలించానుకానీ దొరకలా.యు.ఎస్ వచ్చి

వెళ్ళానుగాని, వాళ్ళతోఅ ఫోఅనెలో నయినా మాట్లాడలేకపోఅయానని లోఅలోఅపల
పీకుతూనేవుంది.ఈమాటు విమల,కల్యాణీల ఫోనె నెంబర్లు మొత్తానికి సంపాయించి తెచ్చా.
ఫొనె చేస్తే ఇన్నాళ్ళయినా గొంతు గుర్తు పట్టారు,హ్ఫొనెలో ఎంత ఆనందం ఒలకపోఅసారోఅ?
వాల్లమ్మగారు ఇక్కడేవుంది.ఆవిడానేను ఎంతోఅ సాయిలా పాయిలాగా వుండేవారము.ఇళ్ళు
వేరేగాని,ఒక కుటుంబంలా మెలిగే వాళ్ళం.రాజమ్మగారు ఉత్సాహంగా వాళ్ళ పొల్లల పెళ్ళిళ్ళు,ఉద్యోఅగాలు,
వాల్ల మనుమళ్ళు అందరిసంగతి చెప్పింది.పాత స్నేహితుల్తోఅ మాట్లాడితే హృదయ తంత్రులు
వాటంతట అవే కదులుతాయి.మీరు ప్రైవేటు చెప్పి మమ్మల్ని పైకి లాగకపోఅతే మే మెక్కడ వుండే వాళ్ళమో నండీ,అన్నారు ఇద్దరూ.ముగ్గురి మొహాలూమూడు పువ్వుల్లా,వికసించి కనిపించాయి. ఆయిల్లు, పెద్ద గేటు,లోఅపలికి రాగానే బిల్వ వృక్షం, పక్కన ఉసిరిచెట్టు, నీటి తొట్టె,పక్కనే పంపు అక్కదే మాసమావేశాలు గంటల తరబడి జరిగేవి.
మనమేదోఅ చేసామని అంకొంటారుగానీ,ఎవరి అదృష్టం,కృషివాళ్ళకి విజయాన్నిస్తుంది.

1 comment:

Rajendra Devarapalli said...

అమ్మా మీరు రావూరి గారి కుమార్తె అని మీ పాతబ్లాగు టపాల వల్ల తెలుసుకోగలిగాను.మీ బ్లాగులో కామెంటు రాయటం కొన్ని సార్లు దాదాపు అసాధ్యం అవుతుంద.మీరు అన్యధా భావించక ఒక్కసారి ఈ devarapalli.rajendrakumar (@)gmail.com కు ఒక్క బ్లాంక్ మెయిల్ పంపగలరా?
అభివాదాలతో
రాజేంద్ర