పెళ్ళిచేసుకొనే పిల్ల దగ్గరనుచి,ఆటవస్తువు,తినె వస్తువుదాకా
ఎప్పుడు ఎవరికి ఎందుకు నచ్చుతాయో తెలియదు. ఎంతసామాన్యమైన విషయమైనా
నచ్చితె మాత్రం మహ సంతోష పడతారు.మర్యాద,మాట, పని కొన్ని
భలేగా నచ్చుతాయి.ఎక్కడికైనా వెల్లినప్పుడు,పెద్దవాళ్ళని,పిల్లలని,ఆడ
వారిని ముందు లోపలికి వెళ్ళనిచ్చి తరువాత తక్కిన వాళ్ళు వెడితె
నచ్చుతుంది. ఆచీర చూడగానె నాకు నచ్చింది,అంటారు.అందులో ఏపువ్వో,
లతో కంటికి ఇంపుగా వుండివుంటుంది.ఆఇంట్లో ఎడమవేపువసారా బాగా
నచ్చేసింది,ఆఇల్లు కొనాల్సిందే అంటారు.మాబంధువుల ఆవిణ్ణి హరిద్వారం
తీసుకెళ్ళాము.హరిద్వారంలో గంగ స్వచ్చంగా శుభ్రంగా వుంటుంది.స్నానం
చెసాము.ఆనీళ్ళు ఒంటిమీద పడగానే విద్యుత్తు శరీరం నిండా ప్రవహిస్తుంది.
కొత్త శక్తి వస్తుంది. వదిలి రాబుధ్ధికాదు.వడ్డుమీదకూర్చును చెంబుతో
పోసుకొంటేనే ఇంత బావుంది, నాలుగు అడుగులు నీళ్ళల్లోకి వెళ్ళి మునిగితే
ఇంకా ఎంత బాగుంటుందో అనిపించింది. స్నానం అయాక గాలి కొరికేసింది.
తడిబట్టలనుంచి విముక్తి పొంది ఇవతలకు రాగానే మా బంధువులావిడ
"ఈతడిచీరలెలాగె!అంది.''అవి తీసుకెళ్ళి రూములో పెట్టాలంటె చాలా
దూరం.తడిసినవి మరీ బరువుగా వున్నాయి.ప్లాస్టిక్ సంచీలో పెట్టి,
రూములో పెట్టివస్తారెమో అంటె అంత త్యాగధనులు కారుమావాళ్ళు.అవి
పుచ్చుకు నీళ్ళుకారుకొంటూ గుడిలోకి ఎలా వెడతాము? 'మీరు ఆకొసన
చీర పట్టుకోండి, నెను ఈకొసన పట్టుకొంటాను,గాలికి ఆరతాయేమో
అన్నాను.ఎండ గాలి బాగానె వున్నాయి,ఇద్దరం చెరొక కొస పట్టుకు
నిల్చున్నాము,అయిదు నిముషాలలో చీర తడిపోయి,మరో రెండు
నిముషాలలో చీర ఆరిపోయింది. ఇక ఆవిడ సంతోషానికి
అవధులులేవు, ఇదెక్కది గంగా?ఇదేమి హరిద్వారమే అమ్మా?
ఇదేమిఎండా? ఇదేమిగాలి? చిటుక్కున చీర ఆరిపోయిందేవిటేమ్మా?
అని ఆవిడ ఆనందంలో మునిగిపోయింది.తరవాత దేముణ్ణిచూసింది
బజారుతిరిగాము,హోఅటలుకువెళ్ళి భోజనం చెసాము,రూముకి వచ్చాము
అప్పటికి ఆవిడ ఆశ్చర్యములోంచి తట్టుకోలేదు, ఎంతబాగా చీర
ఆరిపోయిందేమ్మా?పుణ్యమంతా నీదేనే అంది,దేనికి చీర త్వరగా
ఆరెసిపెట్టినందుకు. ''యాత్రలు బాగాజరిగాయా అంటే'ఆ చక్కగా
జరిగాయి,హరిద్వారంలో చీర చిటుక్కున ఆరిపోతుంది.''అని చెప్పీది.
పైగా నెనెప్పుడు కనిపించినా చీర ఎంతబాగా అరెయించి పెట్టావే
అని వీపుతట్టి మరిచెప్పేది. ఇంతకీ చెప్పొచ్చేదేమిటంటె ఆచీర
ఆరడం ఆవిడకి అంత బాగా నచ్చేసింది.
కొత్తగా వచ్చిన సినిమా చూసివచ్చింది
ఒకావిడ."ఏమండీ !సినిమా ఎలావుంది? అన్నా.''హీరోయిన్ పొద్దున్నేలేచి
బాయిలర్ అంటించడం నాకు మహ బాగా నచ్చేసింది"అన్నది.
ఒకాయనకి వాకింగుకి వెళ్ళినా,గుడికి వెళ్ళినా
ఆడవాళ్ళని తేరిపార చూడడం అలవాటు. ఆయన తన భార్యని
ఎప్పుడూ వెంటతీసుకు వెళ్ళేవాడు.ఒకసారి ఇద్దరు కలిసి వెళ్తోంటె
ఎదురుకుండా ఒక ఆవిడ ఎటో వెళ్తూంది.ఆవిడవీళ్ళదగ్గరికి రాగానే
ఆయన ఆవిడమీద చూపునిలిపి ఆగిపోయాడట. పక్కన మీ ఆవిడవుంది
కనక వూరుకొన్నాను,అనివెళ్ళిపోయింది.అప్పుడు భార్య "ఏమిటాచూపులు అర్ధంలేదు
లేదు,అని కూకలేసింది."అదికాదోయ్! ఆవిడవేసుకొన్న మఫ్లరు నాకు బాగా
నచ్చేసిందోయ్!అవునవున,నెను దగ్గరలేక పోతె ఆవిడకి మీబుగ్గలు నచ్చేవి
మర్నాటికి అవివుబ్బేవి,ఆవిడ అలా చేసినట్లయితె నాకెంత నచ్చేదో? అందిట.
నాస్నెహితురాలితో కలసి ఒకావిడ మాఇంటికి వచ్చింది.
నాస్నేహితురాలికి పుస్తకాలు ఇస్తెచాలు ఏనుగెక్కినంత సంబరపడిపోతుంది. పుస్తకం
ఇచ్చాను.పక్కావిడకి ఏమి ఇవ్వాలో తెలియలేదు.నెను ఇంట్లో ఏవొకళాఖండాలు
తయారు చెస్తూ వుంటాను. ఆవస్తువులుకొన్ని,బజారులో బాగున్నవని కొనితెచ్చిన
వస్తువులుకొన్ని అక్కడపెట్టి "మీకిష్టమయింది తీసుకొండీ!అన్నా.అందమైన చిలుక
కొండపల్లి బొమ్మ వుంది,ఎంబ్రాయిడరీ చెసిన రెండు కుషన్ కవర్లు వున్నాయి,
మూగ్గురుపిల్లలు నవ్వుతున్న్ ఫొటొతో కీచైన్ వుంది, ముచ్చట గా వున్న లెటర్ పాడ్
వుంది,సగ్గుబియ్యంతో చెసిన ఫ్లవర్ వెజ్ వుంది. అన్నీవదిలి పెట్టి ఆవిడ ఆసగ్గుబియ్యపు
వెజ్ తీసుకొంది. ఇది నాకెంతో నచ్చిందండీ!అంది.
భాను ఫొనె చేసి "నామారెజి అయింది ఆంటీ!అన్నాడు
ఒహొ!అలాగా?అని వివరాలడిగాను,అవెమీ చెప్పకుండ ఆ అమ్మాయిచాలా క్యూట్ గా వుంటుంది,
బ్యూటిఫులన్నాడు.తరవాత చాలా రొజులకి వాళ్ల వూరు వెళ్ళి ఆ అమ్మాయిని చూసా!
నాకళ్ళకి క్యూట్‌నెస్ కనిపించలా!వాళ్ళ స్నేహితుడు అన్నాడూ'ఆ అమ్మాయికి ఎడమ కణత
పై శెనగ గింజంత పుట్టు మచ్చవుంది,అదివాడికి చాలా నచ్చేసిందట!అని.
పిల్లకి ఉయ్యాలా తెమ్మని భర్తకి డబ్బుఇచ్చిపంపించింది ఒక అమ్మాయి. అతను
వెళ్ళి పెద్ద అద్దం కొనుక్కు వచ్చాడట.ఇదేమిటి అంటే"అంటె "దోసకాయ ఆకారంలొ
వున్న ఈ అద్దం,దాని చుట్టూ వున్న నల్లటి రింగులూ నాకెంతో నచ్చేసాయి, ఉయ్యాలా
తీరికగా కొందాంలె!అన్నాడట.
1 comment:
Post a Comment