ఊరేగింపు
తొమ్మిదేళ్ళు దాటకుండా ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు చేయడం
తక్షణ కర్తవ్యంగా భావించేవారు ఆరొజుల్లో! సంపన్నులు పెళ్ళిళ్ళు
ఆడంబరంగా చెసేవారు.ఊరేగింపు లేకుండా పెళ్ళి చేసేవారుకాదు.
పల్లకీలు వుండేవి.పొడవాటి కర్ర మీద బండి గూడులా అమర్చేవారు
పల్లకి కప్పు ఎర్రటి బట్టతో వుండేది.అంచులకి పొడుగాటి పూసలు,
కుచ్చులు వ్రేలాడ దీసేవారు.దీనిని మనుష్యులు మోసేవారు.పెళ్ళికొడుకు,
పెళ్ళికూతురు ఎదురు బదురుగా అందులొ కూర్చునేవారు.ఎడపిల్ల లెవరైన
వుంటె వాళ్ళని పల్లకిలో కూచొపెట్టెవారు.పిల్లలకి అలా కూచొవడం
ఎంతో ఆనందాన్నిచ్చెది.పెళ్ళికి వచ్చిన స్త్రీలు పల్లకి పక్కనె
నడిచి వెళ్ళెవారు.వరసయినవాళ్ళు వధూవరులపై చెణుకులు విసురుతూ
వేళాకోళాలు చెస్తూ నవ్వులు చిందిస్తూ వుండెవారు.పెళ్ళిలో అన్నిటికన్నా
హుషారయిన ఘట్టం ఇదె!బందరులో సన్నాయివిద్వాన్సులు చాలామంది
వుండెవారు.పల్లకి ముందు సన్నాయి వాయిస్తూ నడిచెవారు. వారి పాట
ఎంత హృద్యమంగా వుండెదో.చాలావరకు శాస్త్రీయ సంగీతమే వాయించెవారు.
అప్పుడప్పుడూ సినిమా గీతాలు వినిపించెవారు.నాలుగురోడ్ల కూడలి
రాగానె అక్కడ నిలబడి ఒక కీర్తన వాయించి ముందుకు నడిచెవారు.
వారి సంగీతాన్ని బట్టి ఊరెగింపు ఎంతదూరం వుందొ, మన వీధికి
ఎప్పుడు చెరుతుందో అంచనా వెసేవారు జనం.ఊరేగింపులు పొద్దొ పోయాక
మొదలెట్టేవారు.నాలుగు రోడ్లు తిరిగే సరికి రాత్రి రెండు,మూడు అయెది.
నిద్ర మత్తులో ఆసన్నాయి వింటె ఎక్కడో తేలిపొతున్నట్లుండేది.
బందరులో "తగతూ లని మండపం లాగా వాసాలతో
కట్టెవారు.దేవుని ఊరెగిస్తారె అలాగె వుండేవి.మల్లెపూలు దొరికె కాలంలొ
మల్లెపూలతో అలంకరించెవారు.మామూలు రోజుల్లో అయితె కాగితం పూలతో
తయారుచేసినవి అలంకరించెవారు.తగతులొ మధ్య రెండు కుర్చీలు వెసెవారు
పెళ్ళికొడుకు,పెళ్ళికూతురు కూర్చోడానికి.వారిద్దరికి బరువైన పట్టువస్త్రాలు
కట్టెవారు.పెళ్ళికూతురికి అదిచాలదన్నట్లు పూలజడ.ఈ బరువులతొ వంగిపోయెది.
మతాబాలు కాల్చెవాళ్ళు.ఊరెగింపుకు ముందుగా ఈబాణసంచా
కాల్చే వాళ్ళు,ఒక పొడవాటి కర్ర పై రింగులా వున్నదానిపై చిచ్చు
బుడ్డిలాటిది పెట్టి వెలిగించెవారు,ఎంత వెల్తురో,ఎన్నిరవ్వలపువ్వులో!వీధి
వీధంతా కళ కళ లాడిపోయెది.తారా జువ్వలు ఎగరెసెవారు.తరవాత
సన్నాయి పాటగాళ్ళు.దాలిపర్తి పిచ్చిహరి గారని వుండేవారు,ఆయనఫాట
తేనెల సోనలా వుండెది.పెళ్ళికొడుకు పెళ్ళికూతురు చిన్నచిన్న వాళ్లు,
కాసెపట్లొ నిద్రలొ తూగెవాళ్ళు.వూరివారంతా ఈఊరేగింపు మహోత్సవాన్ని
తనివితీరా ఆనందించెవాళ్ళు.ఈతగతును మనుష్యులె మోసెవాళ్ళు.
ఆధునికత పెరిగాక ఊరెగింపు మోటు అయింది. కొందరు సరదామంతులు
మాత్రం కారులొ ఊరెగింపుచెసెవారు. తరవాత అవీపోయాయి.అయిదు రొజుల
పెళ్ళిళ్ళు మూడురోజులయి,
సంతకాలలోకి జారుకొన్నాయి. పెళ్ళంటే అప్పుదూ,ఇప్పుడూ ఖర్చె!కాకపోతె
వినోదాలె మైనస్ అవుతున్నాయి.
No comments:
Post a Comment