శ్రీముట్నూరి కృష్ణారావు పంతులుగారు
ముట్నూరి వారి పేరు తలవగానే హిమాలయ
పర్వతాలు గుర్తుకు వస్తాయి.తెల్లటి బట్టలు, మల్లెపువ్వు వంటి తల
పాగా,ఎత్తైన ఆకృతి ,ఆజానుభావులు,మితభాషులు,వేదాంతులు,హాస్య
ప్రియులు,దేశభక్తులు,సంఘసేవకులు,పత్రికా సంపాదకులుసాహితీ వేత్తలు
అయిన ముట్నూరివారు ఆంధ్రులకు చిరస్మరణీయులు,వందనీయులు.వారు
కౄష్ణాపత్రిక స్థాపించి ఎందరో కవులకు,రచయితలకు,వేయూతనిచ్చారు.
వారి అధ్వర్యంలొ "కృష్ణాపత్రిక"దెశభక్తిని పురికొల్పి సమాజానికి
అనన్య సేవలందించింది.బందరులొ అదిఒక చిన్నకార్యాలయం,కానీ
అది ఆంధృలకి విలువకట్టలేని ఆలయం.
నాచిన్నపుడు చాలా సార్లు అక్కడికి మానాన్న
గారితో వెళ్ళే దాన్ని.వాకిట్లో రెండు చిన్న మెట్లు వుండేవి ఆంఎట్లు
ఎక్కగానె ఒక విధ మైన ఆవెశము,ఆనందము కలిగేవి.అక్కడ చిన్న
నడవా వుండేది.లొపల వరండా వుండేది.ఎడమ చేతివేపు మనెగర్శ్రీ
కాజ శివరామయ్యగారు,గుమాస్తా పదవిలో,వడగళ్ళ నాయకుడు శ్రీ
అద్దేపల్లి మల్లిఖార్జున రావుగారు కృష్ణాపత్రిక ఆర్ధిక వ్యవహారాలు
చూసేవారి.ఆగదికి వీధి వేపు ఒక వ్హిన్న కిటికీ వుండేది.కాస్త
వెలుతురు ఇస్తూండేది.ఆగదిలోనుంచి తలుపులు ల్లేని ద్వారం ఒకతి వుండేది.
ఆగదిలో ఇనప రాకుల్లో బ్లొచ్కులు వుండేవి.చాలా మందమైన చెక్కమీద
లోహంతో వున్న చిత్రపు ప్లెతు అతికించి వుండేది.కుప్పులువుండేవి అందులోంచి
ఒక బ్లొచ్క్ వెతకాలంటే య్జం.పొడుగాటి పుస్తకాలలో ఈబ్లొచ్కులు ఒక్కొక్కటి
ముద్రించి వాటికి నుంబెర్లు వేసి అదేనుంబెర్ బ్లొచ్క్ మీద లావుగా సిరాతో
వ్రాసి పెట్టెవారు.పుస్తకాలలో బొమ్మలు వరసగా వుండేవికానీ,బ్లొచ్క్లు
మాత్రం చెల్లచెదురయ్యేవి.ఆగది చీకటీగావుండేది.ఎడమ చేతివేపే
సంపాదకులు,సహాయ సంపాదకులువుండేవారు.శ్రీ ముట్నూరివారు గుమ్మానికి
కుడివేపున పడకకుర్చీలో కూర్చుని వుండేవారు.మా నాన్నగారి కుర్చీ
గుమ్మానికి ఎదురుగా వుండేది.ఆయనకు పక్కనే శ్రీకమలాకర వెంకటరవు
గారు
కూర్చునేవారు.పెద్ద పెద్ద అట్టలు సిరా మచ్చ్లతో వీరి వ్రాతలకి
సాక్షిగా కనిపిస్తూవుండేవి.అక్కడినుంచి వెనక తోటలోకి ద్వారం వుండేది.
శ్రీముట్నూరివారు తరచు ఆతోటలో మెల్లగా విహరిస్తూ వుండేవారు.ఆఫీసు
లొపలికి రాగానె వున్న వరండానుంచి ముద్రణాలయంలోకి వెళ్ళేతోవ.అక్కడ
వరండాదగ్గిర అందమైన శిల్పరాజాలుండేవి.క్రొటన్సుమొక్కలుండేవి.ముద్రణాలయంలో
పని అంతా చేతితోనే!కంపొజింగ్ కి గళ్ళ గళ్ళ చెక్క గదులలో అక్షరాలు,వత్తులు,
పోసి వుండేవి.రచయితలు వ్రాసిన స్చ్రిప్ట్ దగ్గర పెట్టుకొని వారు కంపొజె
చెసేవారు.ఎన్నో సంవత్సరాల అనుభవమున్న కంపొజిటర్లుసక్రమంగా,సునాయాసంగా
కంపొజె చేసి సకాలంలో పత్రికను బయటికి తేవడానికి సహకరించెవారు.
పెద్దరొలర్ కింద కాగితం పెట్టి ప్రింట్ చేసేవారు.ఆర్ప్లర్ని చేతితోనే తిప్పాలి.
కలర్ ప్రింటింగ్ పెడ్డగా చెసె వారుకదు.కృష్ణాపత్రిక ఆఫీసులొ అడుగుపెట్టాక
వచ్చె వరండాపక్కగా చెక్క మెట్లు వుండేవి.ఆమెట్లమీదుగా వెడితె కృష్ణాపత్రిక
ఆస్థాన చిర్తకారులు శ్రీతోటె వెంకటేస్వర రావుగారు వుండేవారు.కుంచెలు,రంగులు
ప్రశాంత వాతావరణం.హైందవ సాంప్రదాయ పధ్ధతిలో,సుందరంగా,అత్యంత
ఆకర్షనేఏయంగా చిత్రాలు చిర్తించేవారు.ఒక గుంద్రం చందమామ లాగా అందులో శ్రీ
ముట్నూరివారు చేతికర్ర చెతులొ నిలబెట్టి కూర్చుని వున్న బొమ్మవేసారు.అది
సంపాదకీయంపైన వెసేవారు.లేళ్ళు,దీపాలు,అత్తరుపనీరుపళ్ళాలు,అజంతాబొమ్మలు
జీవకల వుట్టి పడుతూ వుండేవి.కిందనుంచి పైదాకా ఆమెట్ల దగ్గిర ఒక బాతుపూల
తీగ వుండేది.ందూరు వైలెట్ రంగు,తెల్లటి రెక్కలపై చుక్కలు, పొవ్వు అచ్చం
బాతులాగానే వుందేది.
వెళ్ళినప్పుడు ఎవరు చూడకుండా పూలు కోసుకు తెచ్చుకొనేదాన్ని.పదేళ్ళ చిన్నారి
వయసులో అదిఒక మధురానుభూతి.
No comments:
Post a Comment