Pages

Monday, June 2, 2008

వెలుగు


వెలుగు
నీలం కాదు,నలుపుకాదు
ఆకాశమంతా కారుమబ్బులు
కమ్ముకొన్నాయి
ఒక వూపు వాన
కురిసి వెలిసింది
మళ్ళీ కారుమబ్బులు
ఇంతలొ ఎక్కడినుంచో
వెలుగు--వెలుగు
బంగారం కరిగించి
చెట్ల తలలపై
పూసినట్లు
ఎక్కడో సి.ఐ.డి పెద్ద
టార్చి లైటు వేసి
చూస్తున్నట్లుగా కాంతి
వచ్చి పడింది
ఒకచో విడింది మబ్బు
ఒకపెద్ద సూర్య కిరణం
దూసుకొచ్చింది
ఫెళఫెళా
ఇంతలొవిరిసింది
అందమైన హరివిల్లు
ఆకాశంలొ పరుచుకొంది
విచిత్రం
ఇవాళ రెండు హరివిల్లులు

ఒకదానికి మరోటినీడా?
ఇంతవెలుగేమిటి?
రెండు హరివిల్లు లేమిటి?
విచిత్రం

3 comments:

Kathi Mahesh Kumar said...

ఫోటో లేకున్నా కూడా మీ కవిత ఒక ‘విజువల్ ఇంపాక్ట్’ సృష్టించేది,సృష్టించింది కూడా.‘సి.ఐ.డి టార్చిలైటు’ కొత్తగా ఉంది.

please visit: www.parnashaala.blogspot.com

Anonymous said...

nijamEkaduu! iMdra dhanussu,adEnaa mari,mEgha maalikalU,taarakaluu,graha raasuluu,aa aakaaSamuu....annii adbhutamE! aMtaa sRshTi vilaasamE!

Anonymous said...

"velugu"viluvanu iMtiMtani kolava galamA?