Pages

Thursday, June 12, 2008

శ్రీబి.వి.నరసిం హారావు గారు

శ్రీ బి.వి.నరసిం హా రావుగారు
బందరులొ తరచుగా మాఇంటికి వచ్చి మాతొబాటు కలిసిపోయి
వుండేవాళ్ళల్లో బి.వి.గారొకరు.స్కూల్స్ ఇనస్పెక్టరు గా పనిచెసేవారు,ఉద్యోగరీత్యా
10,15 రోజులు బందరులో కాంప్ వుండేది.నాట్యాచార్యులు, స్నేహశీలి,నిరాడంబరుడు.
ఆయన వచ్చారంటే ఆటలు,పాటలు,కవిత్వాలు,వంటలు ఒకటే హడావుడిగా వుండేది.
ఆయన రంగస్థలం మీద నృత్యం చేయడం నేను చూడలేదు కానీ మాఇల్లేఆయనకో
నర్తనశాల.సంగీతం,సాహిత్యం,పకపకలు. మేముచెమ్మనగిరి పేట ఇంట్లోవున్నపుడు కింద
నేలమీద చెక్కలు పరిచి వుండేవి.మేము పైన నడిస్తే కిందవాళ్ళకి ధనా ధనా
మని వినిపించేది.ఎవరూ లేనప్పుడు మాఇల్లు అతి నిశ్శబ్దంగావుండేది,"నాన్నగారు ఒక
చోటవ్రాసారు,లేడిగిట్టల చప్పుడికి కూడా నాభావాలు చెదిరిపోతాయి."అని.అందుకని
ఇంట్లో మేమువున్నా లేనట్లే వుండేవాళ్ళము.ఇంటివాళ్ళు ఏమన్నా అనుకొంటారేమోనని,నెమ్మదిగా
నడిచేవాళ్ళం.బి.వి.గారు వచ్చినపుడు దానా దీనా ఆలోటూ తీరిపోయేది.
పగలంతా పనితో తిరిగి ఇంటికివచ్చాక 11 గంటలయి అంతా సద్దు
మణిగాక వీరిద్దరికి అప్పుడు ఆవేశం వచ్చేది,కళాకారులుగదా!నాన్నగారు ఏదైన ఒక
కొత్త పాట వినిపిస్తే ఆయన గబ గబా లేచి తదనుగుణంగా అడుగులువేసి నృత్యంచేసేవారు.
తాళం వేస్తూ గొంతువిప్పి పెడ్డగా ఆపాట పాడేవారు.తెల్లవారగానే ఇంటివాళ్ళు అడిగేవారు,
రాత్రంతా ఒకటేచప్పుడు,ఆడాన్సాయన వచ్చాడా!సచితా!{ఇది మానాన్నగారు పెట్టుకొన్న
పేరు అదిపూట్టింటికే పరిచయం,అత్తవారింటికి వచ్చాక అన్ని మార్పులతో పాటు పెరు జ్ఞాన
ప్రసూనగా మారింది.]అని అడిగేవారు,ఎన్నాళ్ళుంటారు?అని అడిగేవారు.
ఆరోజుల్లో మా అమ్మ పిట్టలావుండి,బలహీనం గా వుండేది.మానాన్నగారికి,
నాకూ మాత్రం అన్నంవండే శక్తివుండేది అంతే!మధ్య మధ్యలో తలనొప్పి వచ్చి,రెండుమూడు రోజులు,తిండీ
తిప్పలూ లేకుండాపడివుండేది.

No comments: