Pages

Thursday, June 12, 2008

బి.వి. గారు

పెజి--2 బి.వి.గారు పొద్దున్నే వాకిట్లో కి వచ్చేకూరలు పిల్చి
కొన మని ఫలానా కూర చెయ్యమని ఆర్డర్ వేసేవారు.అదీ ఎలాటి కూరలంటే
అక్కడ తోటకూర కాడలు వచ్చేవి.ఇలా గిల్లితే నీరుచిమ్మేవి.మనిషంత పొడుగు
కాడలున్నా తరిగి వండేసరికి పురిషెడు కూర అయేది.తియ్యగా మెత్తగా హల్వాలా
వుంటుందికూర. ఆకాడలుతరిగి పీచుతీసేసరికి నీరసం వచ్చేస్తుంది.ఆకూర
ఒకరోజు.ఇక తోటకూర దుబ్బులని వచ్చేవి.వాటిని కావిళ్ళతొ తెచ్చి అమ్మేవారు.
ఆదుబ్బులు పళ్ళాల లాగా వుండేవి.పైన చిన్న చిన్న ఆకులు.కింద ఎర్రటికాడలు
గజిబిజిగా అల్లుకొనివుండేవి. ఆ ఆకులన్నీ వేరే ఒలవాలి.తరగాలి, దుబ్బులు లావు
సన్నం వేరుచేసి ముక్కలన్నీ ఒకేరకంగా తరగాలి, ఆతరవాత నీళ్ళలో బాగా
మూడు నాలుగు సార్లు కడగాలి,అప్పుడు దాన్ని వండటం.ఆకూర ఉల్లిపాయలువేసి
పులుసు చేస్తే పెద్ద రాచిప్పడు పులుసు ఊష్ కాకీ అయిపోయేది.సరిగా ఉప్పుకారం,పోపు
పడితె మాంచిరుచిగా వుండేది.లేహ్యంలా ఉడికిపోయేది.ఆవకాయ దానికి అనుపానం.
ఎన్ని ఎళ్ళయిందోతిని. అలాటివి మళ్ళీ ఎక్కడా చూడలా. ఆకూరకొనిపించెవారు,వారానికి
మూడుసార్ళు.ఆకూర కొని పైకి తేగానే మా అమ్మ నీరసపడిపోయేది.
"అమ్మాయా! రేపు గారెలు వండుకొందామా!"అనేవారు.అమ్మ
మినపపప్పు నానపోసి ఒఏ 15 గారెలు చేసేది.నాన్నగారికి ఆయనకి చెరో నాలుగు
గారెలు ప్లేటులో పెట్టి పట్టుకెళితే నాచేతులోంచే రెండు గారెలు తినేసి " ఇదిసాంపులా
అమ్మాయీ"!అనేవారు.మా అమ్మ గతుక్కుమనేది.మెము రందేతిని ఆయనకి పెట్టెవాళ్ళము.వ్హనువుచేత
అలా అడిగిచేయించుకొని తినేవారాయన.నెను చిన్నదాన్ని,మా అమ్మకి ఓపికలేక అవస్థ పడెది.
బి.వి.గారికి బందరులో బంధువులు,స్నేహిరులు ఆయనకి అన్ని సౌకర్యాలుచేసి ఆతిథ్యమిచేవారు
ఎంతొమంది వున్నారు,అయినా ఆయన ఎక్కడికి వెళ్ళేవారుకాదు.మాఇంట్లో ఉల్లిపాయ కారమ్నూరి
భోజనం పెట్టినౌప్పొంగిపోతూ తునేవారు.పెజి

2 comments:

oremuna said...

పురిషెడు అంటే ఏమిటి -?

Sesha said...

పురిసెడు (పుడిసెడు / పుడిసిలి) Handful

Regards,
SeshatalapSayee.