బి.వి.గారు
మా లాంతరు చిమ్నీ ఒక ముక్క విరిగి పోయింది.కొత్తది కొనాలంట్
పంచవర్ష ప్రణాళికే!గాలికి లాంతరు ఆరిపోతుందని మా అమ్మ ఓ కార్డు ముక్క అడ్డం పెట్టింది.బి.వి.
గారు ఆవెల్తురులోనే వ్రాసుకోవడం చదువుకోవడం.మా నాన్నగారి స్నేహితులందరూ నన్ను పుత్రికా
వాత్సల్యం తో చూచేవారు.బి.వి.గారు నన్ను కూర్చోపెట్టి ఇంట్లో పొద్దున్నే నిద్ర లేచాక దుప్పట్లు,
బొంతలు ఎలా మడత పెట్టాలోమడత పెట్టి చూపించారు.వాటిని గూటిలో సర్దడం కూడా నేర్పారు.
మా నాన్నగారు ప్రకృతి మీద పాటవ్రాసారు.అపాటకి తగ్గట్టుగా బొమ్మలు సేకరించాము.చెమ్మనగిరి
పేట ఇంట్లో ఇల్లంతా హాలే!పైకి వచ్చేందుకు హాలులోంచే మెట్లు వుండేవి.ఆహాలుకి అటుమూడు,ఇటు మూడు
గుమ్మాలుండేవి మూడు వాకిటి వరెండాలోకి,మూడు వెనక వేపుడాబాలోకి.హాలంతా కింద చీకలు.వెనక
వేపు డాబా లో కి వుండే గోడ తలుపులు అంతా హాలులోచెక్కే! ఒకవంతు భాగం నేల సిమెంటు చేసారు.
డాబా లోకి వెళ్ళే గుమ్మాల పైనే నాన్నగారూ నేనూ బొమ్మలు అతికించాము.బి.వి.గారువచ్చారు.
రాత్రి భోజనాలయాక నాన్న "ఒక పాట వ్రాసానయ్యా!బి.వి.అన్నారు. ఎదీ!వినిపించండీ!అన్నారాయన.
"వినిపించడమేమిటి? కళ్ళకి కనిపింపజేస్తాము" అని "రా!తల్లీ! పాడు"అన్నారు.మొదటి చరణ్మ్ మొదలెట్టగానేబి.వి.గారు"ఇక్కదకాదు,అక్కడ"అనిలాంతరు పుచ్చుకొని మొదటిబొమ్మగుమ్మందగ్గరికి పరుగెట్టి,
లాంతరు పైకెత్తి పత్తుకొని రెండొ చరణానికి రెండొ గుమ్మము దగ్గరికి వేగంగా నడిచి,అన్నిచరణాలు
అయాక మళ్ళె పల్లవి దగ్గరికి రాగానే మొదటి బొమ్మ దగ్గరికి వచ్చి లాంతరు ఎత్తి పట్టుకొని
పాట విన్నారు.
ఆ పాట ఇది-
ఋతువులకే విసుగెత్తింది
ప్రకృతి అంతా అతిగా మారింది
ఈరెండు లైన్లకి బొమ్మ,ఒక పెద్దమైదానం.దూరంగా తాటి చెట్ల వరుస,ఎగురుతున్న పక్షులు ,ఇద్దరు
పల్లె పడుచులు ఒకరి బుజాల పై ఒకరు చేతులు వేసుకొని అటువైపు వెళ్ళిపోతున్న బొమ్మ.
మానవుడే దేవుని చూచి
పరిహాసము చేసి పక పక నవ్వాడు
ఈ రెందు లైన్లకి అట్టహాసంగా నవ్వుతున్న రెండు మొఖాలు.
వెండి తెరలపై వెలిగేతారల
మనగళ హారతి పట్టారు
ఈ రెండు లైన్లకి బొమ్మ చక్కగా అలంకరించుకొని నృత్యం చేస్తున్న తారల చిత్రం.
కష్ట జీవికి కాసంతయినా
విలువనిచ్చుటే మరచారు
ఈ రెండు లైన్లకికవి,కర్షకుడు,ఇంకా వృత్తి పనులు చేసుకొనేవాళ్ళ చిత్రాలు.
చివరికి బి.వి.గారు చప్పట్లుకొట్టి హర్షం వెలిబుచ్చారు.
No comments:
Post a Comment