Pages

Friday, June 20, 2008

సంపాదనకు సవా లక్ష దారులు

సంపాదనకు సవా లక్ష దారులు.
"ఎంతకొట్టుకొన్నా పైసా సంపాదించే దారి దొరకడం లేదు " అని అంటూవుంటారు.చదువులేక పోతే సర్వ నాశన మైపోతారు, అని పిల్లల్ని శపించి భయ పెడ్తూ వుంటారు.తమ పిల్లలు డాక్టరొ ,ఇంజినీయరో అయితేతప్ప సంపాదన దొరకదని ఘాబరా పడిపోతూవుంటారు. ఇళ్ళండు విద్యలూ చెప్పిస్తారు. ఉస్తాహమూ,నిత్య శుధ్ధి వుంటె సాధించలేనిది ఏమీ లెదు.ఈపనిచేస్తేపరువు తక్కువ,ఈపని చేస్తే చులకనగా చూస్తారు అని అనుకోకుండా మనకి ఉత్సాహాన్నిచ్చేది, మనకి అందుబాటులోవున్నది ఏవిద్య అయినా అభ్యసించి రాణించవచ్చు.సంపాదనేకాదు,పేరు-ప్రతిష్టలు కూడా తెచ్చిపెడుతుంది.మనం చేసే పనిమీద మనకి విశ్వాసం వుండాలి.
రష్యాలో పుట్టి పెరిగిన "ఇరిన" ఎప్పుడూ బెలూన్లతో చేసిన బొమ్మలని చూడలేదు.ఒకసారి ఒకరింటికి పుట్టినరోజు వేడుకలలో పాల్గొనడానికి వెళ్ళిందిట. ఎవరో ఒకరు బెలూన్లటొ చేసిన బొమ్మలు తెఛ్చి బహూకరించారట ఆపాపాయికి. ఆబొమ్మలు చూసి ఇరిన ముగ్ధురాలయిపోయి వెంటనే బెలూన్లు హోల్ సేల్ గా అమ్మే షాపుకి వెళ్ళి కావలసిన సామాన్లన్నీ కొనుక్కువచ్చింది. మొదట్లొ బెలూనులు గుండ్రటి ఆకారంలో వచ్చేవి. తరువాత సన్నగా పొడుగ్గా గొట్టాల వంటివి వచ్చాయి.వీటితోనే కావలసిన ఆకారంలో మెలిపెట్టి రక రకాల ఆకౄతులు చేయవచ్చు. ఎలా చేయాలో నేర్చుకొంది.తయారు చేసింది."వంట చేయడం ఒకకళ అయితే,వడ్డించడం మరొక కళ "అలాగె వస్తువు తయారుచేయడం ఒక కళ అయితే దానిని అమ్మడక్ మరొక గొప్ప కళ." నెను గొప్ప కళాకారుణ్ణి. నావస్తువలు ఇంకా గొప్పవి అని మురిసిపోతూ ఇంట్లొ కూర్చుంటె మనకి బేరాలురావు.దనిని ప్రజల వద్దకు తీసుకు వెళ్ళాలి తక్కువ ఖర్చుతో.ఇరిన తన బొమ్మలు తీసుకొని పెద్ద పెద్ద మాల్స్ దగ్గరికివెళ్ళి వాకిత్లో వాతిని పరిచి కూర్చునేదిట. వచ్చేపోయేవారు చూసి అమ్ముతావా?అంటే,మీరు సరుకు తెచ్చుకోండి, నీను ఉత్తినే తయారు చేసి పెడతా ననేది. అలా చేసిపెట్టినందుకు ఘంటకి 50 డాలర్లు వసూలు చేసేది.రంగు రంగుల బెలూన్లు మెలిపెట్టి వంచి రక రకాల బొమ్మలు చేసి ఇచ్చేదిట. ఇక ఆర్డర్లు కుప్పలుగా వచ్చి పడ్డాయి.ముఖ్యముగా పార్టీలకు ఎక్కువ పిలిచేవారు.కోతి బొమ్మలు, పువ్వులు,తోరణాలుచేసేది.ఆర్డర్లు ఎక్కువ అయి ఆమె కాలెండరులో ఖాళీయే వుండతం లేదు. ఎంత డబ్బు అడగాలో తెలియక అలా బొమ్మలు తయారుచేసే వాళ్ళను అడిగి ఇప్పుడు ఒక ఘంటకి 250 డాలర్లు వసూలు చేస్తూందిట.రేడియోలలో టీ.వీ లో ఈబొమ్మలగురించి టాక్స్ ఇస్తూంటుంది.బిజినెస్ కార్డులు వేయించింది.పిల్లలకి పెద్దలకి పంచిపెట్టింది.ఆరు నెలలలో తన ఉద్యోగానికి రాజీ నామా ఇచ్చి తన సమయాన్నంతా బొమ్మలు చేయడానికే ఉపయోగిస్తోంది.
ఆమె కాలెండెర్ లో ఎక్కడా ఒక్కరోజుకూడా ఖాళీగాలేదు.ఈకళాత్మక సృష్టి,కృషి ఆమెకు "ది రష్యన్ క్వీన్ అఫ్ బెలూన్సనే
బిరూను తెచ్చ్చి పెట్టింది."ఇది వరకు నాకేమీ ప్రత్యేకత వుండేదికాదు,నలుగురుతో పాటు నరాయనా."అనిపించేది,కానీ ఇప్పుడునన్ను గురించి ప్రజలు చెప్పుకొంటున్నారు.అదినాకు చాలు.'అంటున్నది.ఆమె తన సంగతులన్నీ చెప్పుకోటానికి,తన కళాకృతులు ప్రదర్శించుకోడానికి వీలుగా ఒక బ్లొగ్ ప్రారంభించింది.అన్నిటికంటే ఈసాధనం ప్రచారానికి ఎంతో ఉప్యోగిస్తుంది అంటుందామె.ఆమె బ్లొగ్ పేరు "మై లైఫ్ అండ్ ఆర్ట్ .టైప్ పాడ్.కాం.
ఉత్సుకత కలిగినవారు ఇది చూడవచ్చు.ఏపని అయినా ఉత్సాహంతో,విశ్వాసము తో చేస్తే విజయం మనదే!
ఉమన్స్ డె కి కృతజ్ఞతలతో

No comments: