బి.వి.గారు
పేజి 4
అప్పుడు "సింధూర్"అనిఒక సినిమా వచ్చింది.నాన్న గారూబి.వి.
గారు వెళ్ళి చూసి వచ్చారు.సమాజానికి సందేశం ఇచ్చే ఆసినిమావీరికి బాగా నచ్చింది. ఆ ఇ
"సింధూర్"చూడని వాళ్ళు ఈ బందర్ లో వుండకూడదని పదినిముషాల కొకసారిస్లోగన్ ఘట్టిగా అరిచేవారు.మంచి మాటా,మంచిపాటా వింటే బి.వి.గారు ముచ్చట పడి తనానందాన్ని వ్యక్త పరచిపొగడ్తలందించేవారు.పొడుగాటి మొఖం,చకచకాకదిలేకళ్ళు,నవ్వుతూ
కళ్ళు తిప్పుతూ,ధృఢంగా అడుగులు వేస్తూ,వయ్యారంగా ఆయన నృత్యం చేస్తూంటే కళ్ళప్పగించి చూస్తూ వుండేదాన్ని."నాకూ డాన్స్ నేర్పుతారా? అని అడిగా.నీపాదాలు రెండూ దగ్గిర పెట్టు అన్నారు,పెట్టాను.చా!నీపాదాలు బాగాలేవు,డాన్స్ చేయడానికి పనికి రావు.అన్నారు.ఆయన పెద్ద పాదాలటొ
అడుగులు వేస్తేమద్దెలమీద దరువు వేసినట్లు శబ్దం వచ్చేది. బి.వి.గారు
మా హాలులో గుంద్రంగా తిరుగుతూ డాన్స్ చేస్తూ "గుత్తివంకాయ కూరోయిబావా"
పాడేవారు,అదికాక"కొనకళ్ళ వెంకటరత్నంగారు వ్రాసిన పాట కి దాన్స్ చేసే
వారు.ఆపాట ఇది-
రాకోయి నారాజా
నీ రాణిగారు కబురంపే దాకా
మల్లెలు మనసో మంకెన సొగసో
ఎది నీ మది కింపగునో తగునో
అడవికోన గాలించి వెదికినా
అందమైన పూవమరదు సిగలో రా
పండువంటి నా ఒడలికి దీటని
పండువ నాడీవంపిన చీర
ఎట విడిచితినో ఎట మరచితినో
ఏమితోచదెటు పాలుపోదపుడె
రానన్నాళ్ళూ రాతిరి పగలు
రాలేదని గుండెలలో గుబులు
వస్తావని విన్నపుడే మొదలు
వచ్చి ఘడియ నిలవోయని దిగులు
మోహ పడిన నారాజు కనులలో
మోజుచెడిన బతుకేలకాల్పనా రా
ఈపాతకి బి.వి. గారు అద్భుతంగా దాన్స్ చేసేవారు.
పిల్లల కోసం పాటలు వ్రాయాలని చాలా కృషి చేసి వ్రాశారు.
అక్షరాలు తనదైన స్ట్య్లులోస్పష్టంగా వుండేవి.హెచ్చు తగ్గులు,వంకర టింకరలు వుండేవికావు.చిన్నతనంలో ఎక్కడయినా ఉత్తరీయం కనపడటంచాలు దానిని గౌనుమీద ఓణీలా చుట్టుకొని మురిసిపోవడం అలవాతు.ఒక రోజు బి.వి.గారి ఉత్తరీయం తీసి ఓణీలా చుట్టుకొన్నా.అది చీరలో చింపిన భాగమని తెలిసిపోయింది.నాన్నగారికి చెప్పా.ఆయన"ఏమిటయ్యా!బి.వి. మరీపితలాటం ఎక్కువయింది.ఆతెల్ల చీర మీఆవిడకి ఇస్తే కట్టుకొనేదిగదా!
అన్నారు."సచ్చితా !పరువు తీయకమ్మా!ఎవరితో అనకు ఇక వేసుకోనులే అని
బతిమాలారు.అందరం కూర్చుని మాట్లాడుతోంటే""సచ్చితా!నీకు పెళ్ళవుతుంది,నీకో రుబ్బు పత్రం లాటి కొడుకు పుడతాడు,అని వెంటనే కళ్ళనిండా నీళ్ళు నింపుకొని"అమ్మో!సత్యనారాయణగారూ!బంగారు తల్లిని ఇంత ప్రేమగా,ఇంత ముచ్చటగా పెంచిపెళ్ళి చేసిపంపటమంటే గుండె కోసుకుపోతుంది కదండీ!అని బాధ పడ్డారు.
పూర్వపు రోజుల్లో ఆడవాళ్ళు నెలకి మూడురోజులు వంట చేసే వారుకాదు.అమ్మ వంట చేసేదాకా ఈయన ఏచుట్టాలింటికో వెళ్ళకూడదూ!చేతరాని వంట ఎలా పెట్టడం అనుకొనేవాళ్ళము.ఆయన వెళ్ళేవారుకాదు.కాఫీలు నాన్నగారూ నేనూ చేసేవాళ్ళం.మాతాతయ్య వుండెవాడు.ఆయన మడికట్టి వంట "భడవా""మొద్దూ'అని నాచేత సహాయం చేయించుకొనివంట చేసేవాడు.పెసరపప్పు,పప్పూందులో నంచుకోడానికి బెల్లం గడ్డగడ్డ బంగాళాదుంపల్ని ఉడికించి పెచ్చుతీసి మెత్తగా సుద్ద చేసిజీలకర్ర,ఒక ఎండు మెరపకాయ పోపు.అన్నం తినలెకపోయాము.సాయంత్రం అమ్మ సలహాతొ నాన్న పర్య వేక్షణతొ వంకాయ బజ్జీచేసి,జీడిపప్పులు వేయించి పోసాము.బి.వి.గారు తిని తాతయ్య నిద్ర పోయాక"సచిత తల్లి వంట చక్కన్ని వంట,తాతయ్య వంట తద్దినం వంట"అనిపాడారు.బి.వి.గారికి ఒక అమ్మాయి ఒక అబ్బాయీనుకొంటా.మొత్తానికి ఆయన పాటలు వ్రాసి"బాల బంధు"అని బిరుదు పొందారు. నాన్నగారు సినిమలు వ్రాయడానికి వెళ్ళాకేఎస్నేహబంధాలన్నీ మరుగున పడిపోయాయి.మాపెద్దబ్బాయిపుట్టాక ఒకసారి కలిశాము.మా అబ్బాయి అటూ ఇటూ చిమ్మి విశృఖలంగా తినేవాడు."వీడెక్కడివాడేమ్మా!వీడిచుట్టూ కూర్చుంటె వీడుకాక పదిమంది తినొచ్చు"అన్నారు.మదిలోని ఆస్నేహ వీణల్ని కదలిస్తేఈనాతీకి ధ్వనిస్తాయి.
2 comments:
శ్రీబీవీ గారి జ్ఞాపకాలు చాలా బావున్నాయండీ. ఆ రోజుల్లో స్నేహాలు అలా ఉండేవి. అటువంటి మహామహుల వాత్సల్యం దొరకడం కూడా ఒక వరం
ఈ కథలో అబ్బాయీ, అమెరికాలో గోల్ఫ్ అడే అబ్బాయి ఒక్కరేనా? ;-)
Post a Comment