Pages

Tuesday, July 1, 2008

అంధ్ర నాటక కళా పరిషత్

ఆంధ్ర నాటక కళా పరిషత్
మా నాన్నగారు అంధ్ర నాటక కళాపరిషత్ లో కార్యదర్శిగా
చాలా ఏళ్ళు పనిచెసారు. నాన్నగారి తొ పాటు యర్రోజు మాధవాచారిగారు,దుక్కిపాటి మధుసూధన రావుగారు ఇంకాఎవరెవరో వుండేవారు.వుయ్యూరు కుమార రాజాగారు అధ్యక్షులుగా వుండేవారు. అంధ్ర
నాటక కళా పరిషత్తు సభలు ఏడాదికి ఒకొక వూరిలో మూడు రొజుల పాటు
నాటకాలు,నాటికలు ,ప్రదర్శించి సన్మానాలు,సభలు,ఉపన్యాసాలు నిర్వహించెవారు.నాటక నాటికలకి పోటీలు వుండేవి. ప్రముఖులని న్యాయ నిర్ణేతలుగా పెట్టి బహుమతులు అందించెవారు. ఏంతోమంది నటీ నటులను నాటక కళా పరిషత్తు పరిచయం చేసింది.ఈసభలు మూడు రొజుల పాటు జరిగేవి.కళాపరిషత్తు జరిగిన రెండు నెలల లోపే తరువాతి సభలకి
ప్రయత్నాలు మొదలు పెట్టెవారు. చేయి తిరిగిన వారి తో మంచి మంచి వంటలు చేయించి పెళ్ళి విందులులాగా జరిగెవి.పగలు ఉపన్యాసాలు,సాయంత్రం నాటక,నాటికల పోటీలు జరిగేవి.బందరులోనూ,ఘుడివాడలోనూ,భెజవాడలోనూ జరగటం నాకు గుర్తు.
బందరులో జరిగినప్పుడు చిన్నతనమే! కా
నీ మానాన్నగారి హడావిడి, ఆదుర్దాలు జ్ఞాపకం వున్నాయి.
బందరులో పరిషత్తు జరిగినప్పుడు మా నాన్న గారు
వ్రాసిన "కీర్తి" అనే నాటకం వేసారు.మూడు నాలుగు నెలల ముం దునుంచీ సాధన మొదలు పెట్టేవారు.మొదటి రొజునే నాన్నగారి నాటకం.హాలు అంతా నిండిపోయి వుంది.ఒకాయన సహ పాత్రధారి మెకప్ వేసుకొని స్టెజి పక్కనుంచి హాలులోకి తొంగి చూసారు. అంతమందిని చూసేసరికి ఆయనకి ఖంగారు పుట్టింది."అమ్మో !ఎంత మందో!వీళ్ళేదుట నేనెం
చెపుతాను?అని వెనకవెపునుంచి పారిపోయారు. కవి ముఖ్య పాత్రధారి."ఆయన తయారుగానె వున్నారు.రెండో ఆయన కోసం నాటకం దర్శకుడు నాన్నగారు వెంటబడి ఆయనకి రెండు సోడాలు తాగించి ధైర్యం చెప్పి తీసుకువచ్చారు.నాటకం పది నిముషాలు ఆలస్యమయింది.తరవాత బాగానే నడిచింది.
బెజవాడలో పరిషత్తు జరిగినప్పుడు మా నాన్నగారు నన్ను,మా అమ్మనితీసుకువెళ్ళారు.ఆసభలకి ప్రఖ్యాత సినీ దర్శకుడు వి.శాంతారాం వచ్చారు.ఆయనకి సన్మాన పత్రం నాన్నగారె వ్రాసారు. అంత పెద్ద దర్శకుడిని పిలిచి సన్మానించడం ఎంతో గొప్పగా గర్వంగా భావించారు.మొదటి రొజె సన్మానం .నాన్నగారు చదవడానికి ఎంతో ఆత్రతతొ ఎదురుచూస్తున్నారు.మేము,మా పిన్ని ఒకామె చుట్టాలింటి లో దిగాము.
బెజవాడ అంటె అప్పుడు మహా పత్నం.మాకు వూరు కొత్త.మానాన్న గారు తొందరగా వెల్తూ మీకు గుర్రపు బండీ పంపిస్తాను, వచ్చేయ్యండి. అని చెప్పి వెళ్ళారు.మా అమ్మ,నేను,పిన్ని తయారయాము,బండీ వచ్చింది.అందరం హాలుకి వెళ్ళాము. ఒకాయన ఎదురువచ్చి "అమ్మా!ముందు అంతాఫుల్ అయిపోయింది,వెనక కూర్చోండి అని మమ్మల్ని బాల్కనీలో వెనక వరుసలో కూర్చోపెట్టి వెళ్ళాడు.
స్టేజి అందంగా అలంకరించారు,కుర్చీలలో అందరూ కుర్చున్నారు.సభ ప్రారంభమయింది.అందరికి పూలమాలలు వెస్తున్నారు,మానాన్నగారు ఒకసారి స్టేజి మీంచి హాలు లోకి తొంగి చూసి వెళ్ళిపోయారు.ఆయన ఎప్పుడు వచ్చి సన్మాన పత్రం చదువుతారా?అని మెము ఎదురు చూస్తున్నాము.నాన్నగారు ఎంతకీ రాలా.ఎవరో సన్మాన పత్రం చదివేసారు,ఏమి జరిగిందో మాకు అర్ధం కాలేదు. తరవాత ఝవేరీ సిస్టర్స్ డాన్స్.బుట్ట బొమ్మల లావున్న వారి దుస్తులు,చమక్ చమక్ మంటూ కళ్ళు మిరుమిట్లు గొల్పుతూంటె వారు వయ్యారంగా,సున్నితంగా,అడుగులు వేస్తూంటె,మంద్రంగా సంగీతం వినిపిస్తూంటే మేము మై మరచిపోయాము.అది అయిపోయాక నాన్న గారిగురించి గుర్తుకు వచ్చింది. విశ్రాంతి,భొజనానికి ఇంటికి బయలుదేరి,మేమే బండి మాట్లాడుకొని ఇంటికి వచ్చాము.ఇంటికి వెళ్ళగానే మా అత్తయ్య "ఇంతసేపూ ఎక్కడికి వెళ్ళారూ?అంది.హాలుకి వెళ్ళివచ్చాము.అన్నది అమ్మ.ఇంతలో మానాన్న గారు గుమ్మం లొకొచ్చి"దొరికావా!తల్లీ!అని దగ్గరికి తీసుకొన్నారు.గుండెలు అవిసిపోయాయేతల్లీ!బతికి కనిపించారు అంతేచాలు అన్నారు.మాకేమీ అర్ధంకాక తెల్ల మొహాలు వేసాము.
ఇంతకీ జరిగిందేమిటంటే సభ ప్రారంభం కాగానే నాన్న గారు మాకోసం ముందు సీట్లలో చూసారట.మేముకనిపించలేదు.రాలేదేమో నని ఇంటికి వెళ్ళారట.వాళ్ళు ఇందాకే వెళ్ళిపోయారని చెప్పారట.దానితొ ఘాబరాపడి తప్పిపోయామని వెతికారట.దొరకలేదు.ఎన్నిసార్లు వచ్చి చూసినా హాలులో మేము కనిపించలేదు.ఇక గుర్రపు బండీ వాడు మోసం చేసాడని వాడికోసం వెటికి పట్టుకొంటే వాదు నేను అప్పుడే ఇక్కడ దింపి వెళ్ళానన్నాడట.నాన్నగారు సన్మాన పత్రం ఎవరినో చదవమని కారు తీసుకొని వూరంతా తిరిగి,బండీ వాణ్ణి పొలీసులకి అప్పగించి, మళ్ళి చూసివద్దాము అని ఇంటికి వచ్చారట.అయిదు నిముషాలు స్థిమిత పడ్డాక నాన్న గారికి పిచ్చకోపం వచ్చింది."ఏదొ సభలు చూస్తారుగదా!అని తీసుకువస్తే ఇలా చేస్తారా? పిల్లనయినా పంపి ఫలానా చోట వున్నామని కబురు చెపితే నేను సన్మాన పత్రం చదివే వాణ్ణికదా?ఇంక మీకు సభలు లెవు ఏమీ లేవు అని వెళ్ళిపోయారు.సరదా అలా వికటించింది.చివరి రోజు ఒకసారి వెళ్ళావేమొ అంతే!సాయంత్రం వచ్చేసరికి మా అత్తయ్య మా పెట్టెలు వాకిట్లో పెట్టి పుట్టింటికి వెళ్ళిపోయింది.నరాయణరావు బాబాయి మామ గారింటికి వెళ్ళి ఆరాత్రి వుండి మర్నాడు బందరు వెళ్ళాము.

No comments: