Pages

Wednesday, July 23, 2008

బామ్మగారు పేకాట - 2

నవ్వించకండినగేష్ గారూ!అసలే టెన్షన్ గావుంది,అంది జయంతి.టెన్షను పోయేందుకేగా పేకాడుకొనేది,ఆటలో టెన్షనేమిటి? వచ్చేది వస్తుంది,పొయ్యేది పోతుంది,అంతా మాయ.అన్నాడు నగేష్
నిద్ర వస్తున్నట్లుంది ,రెండు గుటకలు టీ తాగితే!అన్నాదు భాను.
నేనూ అదే అనుకొంటున్నా!మళ్ళీ అడిగితే-"చిన్నదాన్ని" అంటూ
అరవింద లేస్తుంది,ఏదో పడేస్తుంది,భాను పరుగెత్తుతాడు,ఇదంతా
ఎందుకులే! అని అంది సీత. నేనేమీ పడెయ్యను బాగానే పెడ్తా.ఇందాక తాగారా లేదా?అని వెళ్ళి టీకి నీళ్ళు పడేసింది అరవింద. ఈ మాటు చేయి తగిలికౌంటరు మీదున్నఉప్పు సీసా కింద పడింది.భాను డ్రాపు వేసి పరుగెత్తాడు.ఏమేఏలేదు ఉప్పుసీసాకింద పడింది,అన్నాడు
చూసారా!రెండో సారి టీ అనేసరికి పంచదార బదులు ఉప్పు వేస్తున్నారావిడ?అన్నాడు నగేష్ అదేమీ లేదండీ బాబూ!చేయితగిలి కింద పడింది, అంతే! సరే! మీరు రండీ,మీ పతి దేవుడు మీకోసం ఆట త్యాగం చేసి ద్రాపు వేసాడు,తక్కిన టీ ఆయన చేస్తాడు లెండి.
ఓఖ్,ఓఖ్ అన్నాడు భాను
ఇంతకీ పిల్లి జోకరని ఎందుకంటారురా?అంది బామ్మ్ అదిపిల్లి లా దొంగది,ఎప్పుడొ నేనే ఆపేరు పెట్టాలెండి
అన్నాడు నగెష్ ఏం కాదు ఒకరన్నరని,ఇంకొకరు అలా అది ప్రచారమయి పోయింది.ఆజోకర్లు ఆటలో మూడే వున్నాయి.అది వస్తె వేరే జోకరు వుండదు.అప్పుడు ఆట గుగ్గిళ్ళు నమిలి నట్లుంటుంది,అన్నాదిశీను అయాం డన్ అంది సీత.
నావి రెండు ఓకులు,అంది జయంతి.
అటూ ఇటూ మార్చా,నాకు ఓకులు లేవు,అంది అరవింద
బామ్మా!జోకరు చూసావా?అన్నాడు సీను
సీకెన్సుఏదీ జోకరు చూడటానికి?దంపతులందర్నీ పెట్టుకు
కూర్చున్నా!అందిబామ్మ
అంటే! అంది నిధి
హస్బెండు,వైఫ్లు,రాజులు-రాణులు,కింగ్స్ అంద్ క్వీన్స్
జోకరు తిర గెయ్యండి అండి బామ్మ.
పిల్లి జోకరు బామ్మా!అన్నాడు సీను
ఇందాకటి నుంచి ఆట ఆలస్యంగా నదుస్తూంది.వీడు జోకరయితే అంతా నిప్పచ్చ!మూడు జోకర్లు ఇంత మందిలో ఎవరి ముక్కులోకొస్తాయి?అందిబామ్మ
ఓకులు ఎన్నివున్నాయిబామ్మా?
పళ్ళెం నిండా వున్నాయి!
అంటె ఫుల్ కౌంటా?
అంతేగామరి.
సీక్వెన్స్ లేకపోతె ఇన్
ని బొమ్మలు ఎందుకు పెత్తుకొన్నావు బామ్మా?
ఏమో!ఏ బొమ్మలో జోకరుందో నని పెట్టుకొన్నారా!
నీకు నూట అరవై ఓకులు బామ్మా!
ఎందుకు?అందరిలో పెద్దదాన్నానా?
పిల్లి జోకరయితే డబుల్ ఓకులు
ఇదెక్కది గొడవ? ఇది నాకు తెలియదే!మేము అలా ఆడే వాళ్ళముకాము.
ఇక్కడింతేరూలు బామ్మగారూ!
ఏదో ఆషామాషీగా ఆడుకోక ఇన్ని రూల్సేమిటి బాబూ!
ముందు అడగాలిఎలా ఆడతారూ?మీ రూల్స్ ఏమిటీ?అని అంది జయంతి సన్నాసి జోకరునూట అరవై ఓకులుతుకుపోయింది. అందరికంటే నావే ఎక్కువ.పోనీలే!నేను పైన వుంటాను,ఇవ్వడం దాతల లక్షణం.
టీ బ్రేకన్నాడు నగేష్
ఇంకా ఏమిటీ అండీ?టైం మూడున్నర దాటింది.అందిసీత
నగేష్ ఆకాశం వంక చూసి,ఇందాకటి నుంచీ నిరాశగా చూస్తున్నాగదా!,నిజమే!ఆకాశం నలుపు విరుగుతోంది.వేగు చుక్క వచ్చేవుండాలి,పక్కవాళ్ళ వరండాలోంచి కనపడుతుంది,కానీ ఇప్పుదు వెళ్ళి చూస్తే బాగుండదు. ఇప్పుదు ఇంటికి వెళ్ళి కాసేపు నడుం వాల్చక్పోతే నడుము విరుగుతుందీంది,సీత ఇక ఆఖరి ఆట జనగణమనాన్నాడు నగీష్.

No comments: