సరస్వతి ప్రార్ధన
ఓరాగ వల్లరీ!
నాహ్రదయ పల్లవీ !
నీమూగ రాగాలే
మాకుగాదులు దేవి
కొనగోట నీవీణ
కొసరి మీటుము
ఓవాణిగీర్వాణి
విద్దేలా రాణీ
కవిత ఒరిగిన చోట
గానమోలికినబాట
బతుకు వెన్నెల తోట
పలుకు ముత్తేపుమూట ఓవాణి
శ్రోణీ భరమ్ముతో
వేణీ ఘనమ్ముతో
వీణ తీగలు మీటి
రాణివాసముదాటి
పారాణి పాదాల
పరువెత్తి రావమ్మ
మాఎడదలే నీకు
విదిదిసేసేదమమ్మ
విశ్వ మోహనగీతి
వినిపిమ్పరావమ్మా! ఓవాణి
1 comment:
ఈ సరస్వతి ప్రార్ధన కవిత చక్కగా ఉందండి
ఇటువంటి తెలుగు ప్రార్ధనా గీతాలు ఇంకా ఎన్నో మీనుండి రావాలని ఆశిస్తున్నా.
Post a Comment