దార్పంటే !అందిబామ్మ
బామ్మా!డార్పుకాదే డ్రాపు
అదేలే,అంటే ఏమిటో చెప్పు
ఆట బాగా పడకపోతే నేనాడలేను నేగేలవలెను అని ముక్కలు కింద పడేస్తారు.వాళ్ళకి ఇరవై ఓకులు పడతాయి
వట్టినే ఇరవై అయిదు ఓకులా? ఆడటం లేదుగా?ఈడార్పులు మాకులేవు,చేతిలోకి ముక్కలువచ్చాక ఆడవలసిందే పిరికివాల్లలా కింద పడేయటమేమిటీ?చేతులు కట్టుకు కూర్చోవడమేమిటి?అరవిందా!జోకరు చూడలేదా?సీకవన్సు వుంటే కానీ జోకరు చూడనియ్యరుట
కదా?ఇంకా ఏమిభయం?
ఒక్క సీక్వెన్స్ వుంటే ఏమిలాభం బామ్మగారూ జోకరు కాస్తా సెట్లో ఇరుక్కుపోయింది తక్కినవన్నీ చెత్తే!అంది అరవింద
మంచి పని చేసావు,అంది సీత
సీతగారు మీఎద్మ పక్కనుంటే భయపడాలి కానీ లేరుగా!ఆవిడుంటే ఆకా సాన్నుంచి చుక్కలైనా రాల్తాయిగానీ ఆవిడచెతులోంచి మనకి పనికి వచ్చే ముక్క మాత్రం రాలదు
ఆమాట వేరే చెప్పాలా!అన్నాడు భాను
అన్దరూ దాన కర్ణులు .నేనే ఎవరికేదికావాలో అడిగి మరీ ఇస్తారు నేనేఇయ్యనిదాన్ని
భానుకి ఆటబాగా పడలా,అబ్బ ఎవరికేనా మూడు త్రిప్లేక్స్లు వస్తే బాగుండును ఆట పారవేయవచ్చు,అన్నాడు
మూడు త్రివేణీలన్టే? అంది బామ్మ
త్రివేణీలుకాదు బామ్మా!ట్రిప్లెక్స్ ,ఒకేసంఖ్య గలవి రెండేసి,మూడుజతలు వస్తే ఆట పారేస్తారు.అయాం డాన్ అనిసీత ముక్కలు పరిచింది.
నెట్టి కొట్టుకొని,నుదురు కొట్టుకొని ఓకులు లెఖ్ఖ పెట్టారు.స్కోరు వేసే బాధ్యతా ఏప్పుడూ భానుదె!ఎవరేనా డ్రాపు వెయ్యగానే ఇరవై అయిదు ఓకులు వాళ్ళకి కలిపేస్తాడు.యమధర్మరాజు దగ్గర చిత్రగుప్తుదిఅంత నిజాయితీగా.ఆట అవగానే స్కోరువేస్తాడు.
లోపలికి వెళ్లి తెల్లకాగితాల్ బుక్ పట్రా నిధీ!అని కూతురికి చెప్పాడు శీను
నిధి లోపలికి వెళ్లి తెల్లకాగితాల బుక్ తెచ్చింది.భాను పేజీ తిప్పి ఎంత మెత్తగావున్నాయోకాగితాలు?కవిత్వం వ్రాసుకోతగిన వాటి మిఇడ పేకాట పద్డా?
అయ్యో!అపచారం,అపచారం!అందిబామ్మ
అందరూ ఏమిటన్నట్లు చూసారు.
నేను రామ నామం వ్రాసుకొనే బూక్కర్రా అది
పోనీలే,బామ్మా!!వెనక ఓపేజీలో వ్రాస్తారు, అన్నాడు శీను
ఇంకానయం,తప్పునాయనా అని పుస్తకంలాక్కుని కొంగుతో తుడిచి లోపల పెట్టి వచ్చింది బామ్మ
జయంతి లోపలికి వెళ్లి మరో బుక్ తెచ్చింది
అందరి పేర్లు వ్రాసి స్కోరు వేసాడు భాను.
ముక్కలు వేసేలోపున స్కోరు వినిపించవయ్యా!అన్నాడు నగేష్
మీకు యాభై నాలుగు అన్నాడు భాను
అయ్యా బాబోయ్!అయితే నేకాస్సేపు ప్రకృతిని చూసుకొన్టా!అని కిటికీలోంచి ఆకాశాన్ని చూడసాగాడు.{అతనికి నిరాస కలిగినప్పుడల్లా అలా కిటికీ లోంచి ఆకాశం చూసుకోవడం అలవాటు.
బామ్మ ముక్కలు కత్తెర వేసి పంచ లేదుగా బామ్మ బదులు నే ముక్కలు వేస్తా!అన్నాడుసీను.ముక్కలు పంచడం అయింది.
ఒరేయ్ నాకు అవి వచ్చాయిరా? అంది బామ్మ
అవి అంటే! ఏమిటవి?
అవేత్రివేణీలురా!
ట్రిప్లెక్స్ లా!ఎన్ని?
మూడూ వున్నాయి
సరే! పడేయండి, మళ్ళీ కలుపుతా!శీను ఓపెన్ కార్డ్ జోకర్ పెట్టాడు.నాకు పన్నెండు ముక్కలే వచ్చాయి అంది జయంతి.
అవునా ?బామ్మా! నీకెన్ని వచ్చాయే!
నాకు పద్నాలుగు వచ్చాయిరా!అందిబామ్మ
No comments:
Post a Comment