వెనక కొంచెం దూరంగా ఎన్నో లైట్స్ వెలుగుతున్నాయి.అన్ని ఇళ్ళల్లొ మనుషులు వుండే వుంటారు, కని ఎవరికీ నాపిలుపు వినపడదు. పక్క ఫ్లాట్స్ వాళ్ళకి కూదా వినపడదు.జైలులో పడ్డట్లయింది ఏమి చేయాలి? ఇదంతా పావురాల మూలంగానే! ఈ ఇంటికి వచ్చిన కొత్తలో పావురాల కూతలు అవి వరండాలో కి వచ్చి పోవడం బాగానేవుండేది. ఎండాకాలం లో ఒక పళ్ళెంలో నిల్లు పోసి పెడితే తాగేవి.వూరుకొక నేను ఎవరింట్లో నుంచో తెచ్చి పంచముఖి మందార, గులాబి రంగు మందార , కరివేప చేట్టు,పెట్టాను,అవి ఏపుగాపెరిగాయి,పెద్ద కుండీల లోకి మార్చాను,ఒక రోజు పొద్దున్నే చూసేసరికి ఆ చెట్ల మొదళ్ళలో పావురాలు గుడ్లు పెట్టాయి. వాటిని పొదగటం, అవిపుట్టాక రెక్కలువచ్చేదాకా ఆకుండీలోనే అన్ని చేస్తూ వుండడం తో వాసన ఎక్కువయి పొయింది. వీటిని పరామర్శిస్తూ ఇంకా కొన్ని పావురాళ్లు వచ్చి పిట్టగోడమీద సభ తీర్చి మాకు ఎరువు ప్రసాదించి వెళ్ళడం జరిగీది. అవన్ని సొంతంగా శుభ్రం చేసుకొంటూంటే మా మామయ్య వచ్చి ఏమిటే! చాదస్తం? ఇంకా వరండాకి మెష్ పెట్టించుకోలా? మాఇంట్లొ నాలుగువేపులా పెట్టించేసాను. చీమ కూడా లోపలికి రాదు. అని కేకల్త్ సలహా ఇచ్చాడు, మావారు విని వెంటనే మెష్ కి ఆర్డరిచ్చేసారు. అసలు ఈపని ఎఫ్ఫుడొ జరగాల్సింది, నేనె అయిష్టం ప్రకటించాను,వరండాలు అలా మూసివేస్తే బాగుండదు జైలు లా వుంటుంది, ఎవరేనా వస్తూంటే చూడలేము, ఎవరేనా వెడుతుంటే గేటు దాటే దాకా చూస్తూ చెయ్యి ఊపలెము, పున్నమి నాడు చంద్రుణ్ణి వంగి చూడలేము అని, కాని తరవాత తప్పిందుకాదు.
ఇప్పుడిది నిజంగా జైలు లో పడ్డట్టయింది.వాచ్మన్ వెంకయ్యని పదిసార్లు పిలిచింది సుభద్ర ,చివరికి వెంకయ్య వచ్చి మాకు వీధివేపున వున్న వరండా దగ్గర నుల్చుని తన కోసం చూస్తున్నాడు,మళ్ళి సుభద్ర " ఇక్కడున్నా వెంకయ్యా!అని పిలిస్తే వచ్చాడు. ఇదీ సంగతి అని చెప్పింది సుభద్ర. వాకిలి తలుపు తీసివుందామ్మా!అన్నాడు, లేదు వెంకయ్యా!అదీ మూశేవుంది,అంది సుభద్ర. మరిఎలాగా? అని వెంకయ్య వెళ్ళాడు. సుభద్రకి గొంతు ఆరిపోతోంది.గదిలో ఫోను తలుపు పక్కనే టబిల్ మీద వుంది, కాని ఏంలాభం? తలుపురాదుగా మళ్ళి చీర పుచ్చుకు గుంజింది సుభద్ర. తలుపు ససేమిరా కదలలా! ఆతలుపుకు నిమ్మకాయంత స్టాపర్ వుంది. గుండురాయిలా వుందది, దాన్ని పట్టుకు గుండ్రంగా తిప్పింది,తిప్పింది,చేతులు ముద్ద మందారాలయాయి కాని తలుపురాలా! సుభద్ర గుండె దడ దడా కొట్టుకొంటోంది.మూడో అంతస్థు దాకా ఎవరేనా ఎలావస్తారు? పై డాబా మీదకి వెళ్ళి తాడుకట్టుకొని గోడ వెంబడి కిందకి జారి నా మెష్ ఎలా తీస్తారు?ఈమధ్య ఇంటికి పెయింట్స్ వేసినప్పుడు మెష్కి కూడా రంగు వేసారు, అప్పుడు మెష్ కిటికీ కివున్న తాళానికి కూడా రంగుతో స్నానం చేయించాడు, తాళం చెవు వున్నా అది దూరదు, దాన్ని పగల కొట్టాలి ఇందంతా ఎప్పుడయ్యేను, సరోజా వాళ్లు డిన్నరుకి వెళ్ళారు, లేకపోతే ఏదో ఉపాయం చేసేవారే!చెమటలు పోసాయి సుభద్రకి,కనకం వాళ్ళు ఇంట్లో లేనప్పుడే జరగాలా!ఖర్మ కాకపోతే?నోటికొచ్చిన స్థోత్రాలన్నీ చదివింది సుభద్ర . మళ్లీ మరోసారి ప్రయత్నిద్దాము అని,చీరపుచ్చుకు ఘట్టిగా లాగింది.చీర తడి ఆరిందో ఏమో తెలియదు, ఏదేవుడు కనిక రించాడొ తెలియదు, తలుపు తెరుచుకొంది,హమ్మయ్య!అని లోపలికెళ్ళీ నేలమీద కాసేపు చతికిల పడిపోయింది సుభద్ర.మెల్లగా లేచివెళ్ళీ గ్లాసుడు నీళ్ళుతాగి వీధి తలుపు తెరిచింది.ఎదురుగా వాచ్మన్ మరో నలుగురు నిలబడి తలుపుఎలా తీయాలా అని ఖంగారు పడుతున్నారు. సుభద్రని చూడగానే"హమ్మయ్య!తలుపు వచ్చిందా?అని వెళ్ళిపోయారు.
మర్నాడు తత్క్షణమే కార్పెంటర్ ని పిలిపించి తలుపుకి వెనక హాండిల్ పెట్టించింది. వాళ్ళతోనే మెష్ కిటికీ కివున్న తాళం బద్దలుకొట్టించింది.పావురాళ్ళు,ఉడతలు వస్తాయని మెష్ పెట్టిస్తే అది మనల్నే బంధించింది.మర్నాడు కనకం వాళ్ళు రాగానే "ఎంత పని జరిగిందో తెలుసా? అని కన్నీళ్ళతో చెప్పింది, "ఎప్పుడూ నిన్ను విడిచి వెళ్ళమే?అన్నాడు,పిచ్చివాడా!దేముడు రక్షించాలికాని,మనల్ని మనం రక్షించుకొందామని ప్లాను వేస్తే అదేమనకు ఉచ్చుగా మారుతుంది.అంది సుభద్ర
No comments:
Post a Comment