Pages

Tuesday, August 12, 2008

జర భద్రం

జరభద్రం
ఎందుకో తెలియదు,ఒక వారం నుంచి విపరీతమైన చల్లదనంతో
ఈదురుగాలి.వంద మంది చేరిఒక్క సారి భవనాల్ని లేపుకు పోతున్నార్ అన్నంత బోయ్ మని రోద చేస్తూగాలి.ఏదైనా అతి అయితే భరించ లేక విసుగనిపిస్తుంది.ఒక మోస్తరు చెట్ల కొమ్మలుఈసురోమని అటు ఇటు వ్రేలాడుతున్నాయి,చిన్న మొక్కలు"మావల్ల కాదుబాబూ"అన్నట్లుగా తలలు వంచి భూదేవికి నమస్కరిస్తున్నాయి.సుభద్ర గాలి భరించలేక
కిటికీ తలుపులన్నీ బంధించివేసింది. లేకపోతే ఏచిన్న్ కొక్కేమో పెట్టడం మర్చిపోతే ఈగాలికి అద్దాలన్నీ విరిగి ముక్కలవుతాయి.గోపీ,కనకం ఒక్కరోజుకని గుడివాడ వెళ్ళారు. ఇంట్లో సుభద్ర ఒక్కతే వుంది.చల్లగా వుంటే అసలు పని చెయ్యబుద్ది పుట్టదు . కనకం వాళ్లు లేకపోవడం తో మామూలు పని కూడా లేదు. చేసేందుకు పని లేకపోతె ఏదో ఒక పని కల్పించుకు అలిసిపోయెలా పనిచేసి నిద్ర పోవడం సుభద్ర కి అలవాటు. సుభద్ర బుర్ర ఆలోచిస్తోంది,ఇప్పుడేమి పని మొదలెట్టాలా? అని.కారిడార్లో పెట్టిన ప్లాస్టర్ ఆఫ్ పారిస్ బొమ్మ తల్లిబిడ్డ కనిపించింది. యదాలాపం గా ఇందిరాపార్క్ నుంచి వస్తూ రోడ్డు పక్కన పేవే మెంట్ మీద్ పెట్టిన బొమ్మలుచూసి బావుందని కొన్నది.కళ కలే ! పాలరాతి బొమ్మయినా, ప్లాస్టర్ ఆఫ్ పారిస్ బొమ్మయినా, శిల్పి కష్టం ఒకటేకదా! పైగా మనం పెట్టగల ఖరీదులో
దొరికింది.ఆబోమ్మని దులిపి,టేబిల్ క్లాత్ మార్చి నది.బొమ్మపై సన్నగా దుమ్ము పడింది, దులిపితే ఎంత కళకళ లాడుతున్నదో!
ఇంకేమి చేయాలి?కనకం మొన్న పిక్నిక్ కి కట్టుకేల్లిననైలాన్ చీర్ ఉతక లేదని గుర్తొచ్చింది.ఒకానొకప్పుడు ఫారిన్ నుంచి ఈచీరలు తెస్త్వాటి మీద ఎంత క్రేజో! వీటికి గంజి,విస్త్రీ అఖ్ఖర్లా!కట్టుకొంటే తెలిగ్గావుంటాయి.వుతికితే ఇట్టే ఆరిపోతాయి,పైగా జన్మంతా కట్టినా చిరగవు, వెలవవు .ఒక్క చెంచా సోపు పౌడరువీసి సుతారంగా వుప్పలించి నీల్లు ఒడాక్ ఆరవేస్తే నిముషంలో ఆరిపోతాయి.సుభద్ర నైలాన్ చీర్ సోపులో వేసి ఝాడించి నీల్లు వత్టి వరండాలో ఆరవేయడానికి పట్టుకేల్లింది.చీర్ తడిగా వుండి ఎక్కడికక్కడ అతుక్కు పోతుంది .చీరనినిలువుగా రెండు మడతలు పెట్టి,మళ్లీ సగానికి మడిచినిఇల్లు దులిపిఒక కొస తాడుమీద వేసికిన్దకి లాగింది.పెద్ద శబ్దంతో ఈదురుగాలివచ్చిమిగతా చీర్ చేతులోన్చిఎగిరి గదిలోకి దూసుకు పోవడం వరండా తలుపు దభాలున మూసుకోవడం రెండూ ఒక్క లిప్త పాటులో జరిగిపోయాయి.తలుపు మధ్య పడి చీర్ రెండు ముక్కలయిందేమో అనుకోన్ది సుభద్ర.చీర్ పుచ్చుకు లాగింది సుభద్ర, చీరా రాలేదు, తలుపు తెరుచుకోలేదు.తలుపుతీసుకు లోపలికి వెళదామంటే తలుపురావడంలేదు, ఏంచేయాలి?తలుపులకి వెనక లాగడానికి హాన్డిల్స్ వుంటాయి అది లేదు. లేదనే సంగతి ఇప్పటిదాకా ఎవరిదృష్టి లోకి రాలేదు.టైం ఆరున్నరే అయినా ముసురు మూలంగా చీకతి పడిపోయింది.అది ఒక అపార్ట్మెంట్లలో తర్డ్ ఫ్లోర్ .ఈవారండా వెనకవేపుది. సుభద్ర వరండామెష్ లోంచి బయటికి చూసింది. ఎవరు లేరు. బయటికి తలపెట్టి చూసి పిలుద్దామంటే మెష్ ఒకటి .

No comments: