చిన్ని కృష్ణా నీకు ఇంత అల్లరి తనమేలనురా
గొల్ల వారి ఇండ్లకేగి గోల పడనేల కృష్ణా |చి|
అమ్మ నాకు బంగారు
బండిని చేయించవమ్మా
బాలురతో కూడి నేను
పాఠశాల కేగెదను |అమ్మ|
నీ పలుకులు వినగానే
ముద్దగుచున్నవిర కృష్ణా
బండియనగ మనకెంత
బాగుగచేయించెదను |చి|
పూలతోటకు నే బోయి
పూలు కోయుచుండగనూ
గొల్లపిల్లల తల్లులొచ్చి
పాలు త్రాగమనిరి నన్ను |అమ్మ|
లేని వారి బిడ్డలవలె
లోకులపాలేల కృష్ణా
కొట్టుటకూ చేతులు రావు
కొడుకా నిన్నేమనందు |చి|
వీధిబడికి పోవుచుంటె
హేళనాగా నన్ను చూసి
నల్ల పిల్లాడో యని
హేళన చేసినారమ్మా |అమ్మ|
గోవులకాచేటిగొల్లపిల్లలతోకూడి నీవు
1,2,3,4,5 గంటలకొచ్చెదవు |చి|
వినరయ్యా జనులారా శ్రీకృష్ణుని చరితము
పన్నుగ చలమయ్య దాసు చేసెను కడు మోదముతొ |చి|
**********************************************************
దొరికేనమ్మ వెన్నదొంగ మాచేతిలో
కరుణించి రక్షించు పరమ నిక్షేపము
వెలలేని ముత్యాల కలికితురాయి
కులుకు మౌళి ముద్దులొలుకు బంగరుకొండ ||
ఫాలమందున కస్తురి బొట్టు తీరు
వేలులక్షలు మించు వెలయు గోపలుడు ||
ఆణిముత్యము నాసికాగ్రమునందు
రాణించుశ్రీకృష్ణ రాజపురాధీశుడు ||
కంఠమందునరత్న ఖచిత హారములు
జంటలుగ ధరియించు జగదేక వీరుడు ||
అధరమందున మురళి ఆనందగీతి
మధురామృతములొలుకు మదన గోపాలుడు ||
ఉరమునందున కరము మెరయు కౌస్తుభము
ధరియించి భక్తుల దరిచేర్చు పరమాత్మ ||
కరమునందున వజ్ర కంకణాల్ మెరయ
స్థిరముగ వెన్న తినెడి చిన్ని కృష్ణుదు ||
కటీతటమున పైని ఘంటల మొలనూళ్ళు
నటియించు కపట నాటక సూత్రధారుదు ||
కాళ్ళయందున గజ్జెలందెలు మ్రోయ
చాలగ నాట్యము చేయు శ్రీలోలుడు ||
భామలిద్దరు ఇరు పార్శ్వములందు
చామరంబులు వీవ సామజవరదుడు ||
**********************************
నీవేతల్లివి తండ్రివి
నీవే నా తోడు నీడ
నీవే సఖుడౌ నీవే గురుడవు దైవము
నీవే నా పతియు గతియు నిజముగ కృష్ణా!
నారాయణ పరమేశ్వర
ధారాధర నీలదేహ దానవ వైరీ
క్షీరాబ్ధి శయన యదుకుల
వీరా ననుగావు కరుణ వెలయగ కృష్ణా!
అకౄర వరద మాధవ
చక్రాయుధ ఖద్గపాణి శౌరి ముకుందా
శక్రాది దివిజ సన్నుత
శుక్రార్చిత నన్ను కరుణ చూడుము కృష్ణా!
కొంచెపువాడని మదిలో
నెంచకుమీ వాసుదేవ గోవింద హరి
అంచితముగ నీకరుణకు
గొంచమునధికంబు కలదే కొంతయు కృష్ణా!
ఓ భవ బంధ విమోచనా
ఓ భరతాగ్రజ మురారి యో రఘురామా
ఓ భక్త కామధేనువా ఓ భయహరా
నన్ను గావుమో హరీ కృష్ణా!
*******************************
No comments:
Post a Comment