నుదుట కుంకుమ బొట్టు నూరేళ్ళు వర్ధిల్ల
దీవిన్చగావలె దేవినీవు
కన్నవారెల్లరు వెన్నెలబొమ్మలై
అభివృద్ది నం దగ అభయమిమ్ము
నీతి కల్యాణంబు పచ్చ తోరణమట్లు
వంశంబు వర్ద్దిల్ల వరములిమ్ము
ముక్తికి మార్గమౌ భక్తీ మార్గమ్మును
మాకోసంగుము నీవుమాతృమూర్తి
పసుపుకుంకుమ మాయింట పండి ఒరుగ
నిత్యహారతి మా ఇంట నెలవుకొనగా
మంగళ హారతి మా ఇంట ఖంగు మనగ
వచ్చి పోవమ్మ బ్రతుకులు పండి ఒరుగ
రావూరు
No comments:
Post a Comment