దసరా
ఈశ్వరీ యని నిన్ను ఏవేళపిలిచెద
ఆదరింపగదమ్మ అండనిలచి
కాత్యాయనీ యంచు కరమెత్తి మ్రొక్కెద
అభయమ్ము నీయవె అతివనీవు
శివు రాణిరో నిన్ను శిరమువంచి పూజింతు
కాపాడగావలె కరుణజూపి
గిరిరాజ పుత్రికా చరణమ్ము లన్టెద
సాకగావలె మమ్ము శక్తి నొసగి
మూడులోకమ్ము లేలెడి ముద్దరాల
జీవితమ్బుల నేలేడు సిద్దురాల
ఉవిద లందరి లోనను వృద్ధు రాల
భక్తీ శ్రద్దల నిను గోల్తుమో భవాని!
రావూరు
1 comment:
fine!
Post a Comment