బాకీతీరి బహుమానం లభించింది
స్వర్గీయ మాధవపెద్ది బుచ్చి సుందర రామ శాస్త్రి గారు
ప్రతిభావంతులైన కవులు.దానితోపాటు వారిలో ఎంతో
చమత్కారం వుండేది.ఆయనగారి చాటువులే అందుకు
నిదర్శనం. వారిని చూడటం తోనే ఎంతో సంతోషము సంతృప్తి
కలిగేవి. ఆయన ప్రసంగం లో ఎంతో హాస్యం తొంగి చూసేది.
కలుసు కొన్నప్పుడల్లా ఏదో ఒక కొత్త సంఘటన తెలియ జేసి
అలరింప జేసే వారు. వారు ఒకసారి చెప్పిన ఉదంతం.
తెనాలిలో ఒక సబ్ ఇనస్పెక్టర్ గారింట్లో పెళ్లి వచ్చింది. అది
ఆయనకుమారుని వివాహం. పెళ్లి కుమార్తెది గుంటూరు .ఇన్స్పెక్టర్ గారు
లగ్నానికి నాలుగు రోజులు ముందుగా బుచ్చి సుందర రామ శాస్త్రి
గారిని కలుసుకొని శుభలేఖ ఇచ్చి "తమరు తప్పకుండా కల్యాణానికి
దయచేసి వధూవరులను ఆశీర్వదిన్చాలి "అన్నారు.
శాస్త్రిగారు "ఆహా,మీ ఇంట్లో పెళ్ళికి రాకుండా వుంటానా?
తప్పకుండా వస్తానన్నారు "ఇన్స్పెక్టర్ గారు ఎంతో సంతోషించి
పదిహేను రూపాయలు చేతిలో పెట్టి "ఏమి అనుకోకండి .మీరు
బస్సుల్లో రాలేరు. రైల్ లో ఫస్ట్ క్లాసులో రండి "అన్నారు.
శాస్త్రిగారు"మీరు డబ్బివ్వాలా!అలాగేవస్తాను,తప్పకుండా
వస్తాను."అని కొంచెం పోజుపెట్టారు .ఇన్స్పెక్టర్ గారు బలవంతం
గా శాస్త్రిగారి గుప్పెట మూసి వెళ్లిపోయారు.పెళ్లి రోజు శాస్త్రి గారికి
జ్ఞాపకమే లేదు. పదిహేను రూపాయలు పులుసు లో పడి
పోయాయి.
రెండురోజుల తరవాత ఒకనాటి పొద్దున్న శాస్త్రిగారు కాఫీ
హోటల్ కి వెడుతున్నారు.కొంచెందూరం వెళ్ళేసరికి ఇన్స్పెక్టర్
గారు ఎదురుగా సైకిల్ మీద రావడం చూసారు శాస్త్రిగారు. తప్పు
కోవడానికి సండులుగూడా లేవు .గత్యంతరం లేక శాస్త్రిగారు తల
వంచుకొని నడిచారు."సబిన్స్పెక్టర్ ఏదో పనివుండి పొద్దున్నే
బయలు దేరాడుఆగుతాడా?"అనుకొన్నారు.అంతగా చూస్తె
సలాం కొట్టి ముందుకు సాగిపోదాం అనుకొన్నారు.కాని ఇన్
స్పెక్టర్ గారు దగ్గరగా వచ్చి సైకిల్ దిగారు."శాస్త్రి గారూ నమస్కారం '
అన్నారు.శాస్త్రి గారికి కొంచెం వణుకు పుట్టింది. మాటల్లో నత్తి కూడా వచ్చింది.అలాగే ధైర్యం చేసి "ఆరోజు నాకు హఠాత్తుగా జ్వరం
వచ్చింది. హండ్రెడ్ దాటింది. అందువల్ల రాలేకపోయాను. మీరు
సొమ్ము కూడా ఇచ్చారు "అని జేబులో చెయ్యి పెట్టారు.
ఇన్స్పెక్టర్ గారు శాస్త్రిగారి చెయ్యి గభాలునగుంజి
"బాగుంది మీరు చేసేపని !జ్వరం వచ్చి రాలేకపోయారు.
దానికేమిచెస్తాం? అందుకని డబ్బు వాపసు చేస్తారా?ఉంచండి,
ఉంచండి"అన్నారు."అదేమీ బాగుంటుంది?వచ్చి పద్యాలు
చదవకపోగా డబ్బు కూడా తీసుకోనా?అని శాస్త్రిగారు
మల్లి జేబులోకి చెయ్యి పోనిచ్చారు.ఇనస్పెక్టర్గారు
చేయిమళ్లి ఇ వతలకు లాగి "మీరు ఒకపని చేయండి.పెల్లికూతురూ,
పెళ్ళికొడుకు ఇక్కడే వున్నారు.ఇవాళ మధ్యాన్నం మా ఇంటికి
భోజనానికి రండి.వధూవరులను దీవించండి.ఎంతో సంతోషిస్తాం.అన్నారుశాస్త్రిగారు."దానికేం తప్పకుండా వస్తా
ఇవాళ జ్వరం లేదు."అన్నారు."పదకొండు ఘంటలకు కాని
స్టేబుల్ మిఇంటికి జట్కా తెస్తాడు."అని ఆయన వెళ్లిపోయారు.
శాస్త్రి గారి గుండెలు కొంచెం కుదుటబడ్డాయి. నిజానికిఆయన జేబులో
రూపాయికి కొంచెం తక్కువగా చిల్లరడబ్బులు మాత్రమేవున్నాయి.
ఇన్స్పెక్టర్ గారు చెయ్యి గుంజకపోతే ఏమయ్యేదోననిఅంతూశాస్త్రిగారు పకపక నవ్వారు.
కాని స్టేబుల్ కూడా వస్తానన్నాడుకనక పదకొండుఘంటలకు ఇంటి దగ్గరే వున్నారు.జట్కాలో ఎక్కి వారింటికి వెళ్ళారు.సుష్టుగా భోంచేసి
వధూవరుల్ని ఆశువుగా ఆశీర్వదించారు. గొంతెత్తి వారు పద్యాలు
పాడడంతో ఇన్స్పెక్టర్ గారికి ఆనంద భాష్పాలు కురిశాయి. నూతన వస్త్రాలు
పెడదామనుకొన్న వారు మనసు మార్చుకొని
అర్ధ నూట పదహార్లిచ్చి
మళ్లి జట్కాలో ఇంటికి పంపించారు.
ఈ వృత్తాంత మంతా చక్కటి కథ లాగా చెప్పి "బాకీ తీరింది బహుమతి లభించింది" అన్నారు శాస్త్రి గారు. "కల్యాణానికి వెడితే పదిమందిలో
ఒక్కణ్ణి అయ్యేవాణ్ణి . ఇంతఘనత దక్కెదికాదు అన్నారాయన అరచేతితో
పొట్ట సవరించుకొంటూ.
రావూరు
No comments:
Post a Comment