నీ విభుని పేరేమి ?
సరసిజనేత్ర నీవిభుని చారు
తరంబగు పేరు చెప్పుమా
అరయగ నీవు నన్నడుగ
నాతని పేరిదే చిత్తగింపుమా
కరియును,వారిరాశి ,హరికార్ముకమున్
శర మద్దమున్,శుకం
బరుదుగ వ్రాయగా నడిమి
యక్కరముల్ గణుతింప బేరగున్
కరి=సారంగం
వారిరాశి =సాగరం
హరుకార్ముకము=పినాకం
శరము= సాయకం
అద్దము= ముకురం
శుకము=చిలుక
విభుని పేరు రంగనాయకులు
[చాటుపద్య రత్నాకరము లోనిది.]
No comments:
Post a Comment