ఒకపూటమంత్రి-ఒకపూటరిక్షా
ప్రఖ్యాత కాంగ్రేసు వాదులు,భీమాడిన్డిమ బిరుదాంకితులు అయిన
చెరుకువాడ నరసింహంగారు ఉపన్యాసాలకు పెట్టింది పేరు.ఘంటల
తరబడి ప్రేక్షకులని ముగ్ధుల్ని చేసేవారు.వారి ఉపన్యాసాలలో అనేక
ఉపమానాలు దొర్లేవి.ఎంతోహాస్యం వుండేది.
ఒకసారి ఆయన ఉపన్యసిస్తూ మంత్రి పదవులను గురించి చమత్కరిస్తూ ఇలా అన్నారు"కొందరు ప్రముఖులు ఒక రిక్షా దారుణ్ణి
కలుసుకొని అబ్బాయి! ఇసారి నువ్వు ఎన్నికలలో నిలవాలి .కార్మిక
వర్గానికి ఎక్కువ ప్రాతినిధ్యం ఇవ్వదలిచాము."అన్నారట.ఆ రిక్షాదారుడు"
నాకేమి వద్దు బాబూ .......ఇలారిక్షా తొక్కుకు బతకనివ్వండి .........మీరందరూ వున్నారుగా పెద్దలు "అన్నాడట
ఆపెద్దలు అతన్ని వదలలేదు ఇలా అనడానికి
వీలు లేదు నువ్వు నుంచోవలసిందే ! మేమంతా ప్రచారం చేసి గెలిపిస్తాం "అన్నారట .అతగాడు ఎన్నికల సమయంలో నా రిక్షాలో తిరగండి అంతేచాలు .....పది రూపాయలిస్తే
బట్టో పాతో కొనుక్కుంటాం "అన్నాడట .
అలావీల్లేదు .నిన్ను మంత్రిని చెయ్యాలని మాసంకల్పం "అన్నారటపెద్దలు .మంత్రి అంటే మరి భయపద్దాడట రిక్షాదారుడు ."అంత పని చెయ్యకండి నానోటికాడ కూడు పోతుంది "అని గగ్గోలు పడ్డాడట .
పెద్దమనుషులు ఎలాగొఅతన్ని ఒప్పించారు .కాని రిక్షా దారుడొక షరతు పెట్టాడట "మీరు అంతగా
చెపుతున్నారు గనక వింటాను ."కాని ఒకపూటే మంత్రి పని చేస్తాను ."అన్నాడట ."అదేమిటి !ఒకపూటేమిటి ?
రెండోపూట ఏమిచేస్తావు అన్నారు పెద్దలు .
రెండో పూట రిక్షా తొక్కుకుంటా .లేకపోతె అలవాటు తప్పిపోతుంది .ఒకవేళ మంత్రిపదవి పోయినాతర్వాత రిక్షా తోక్కగలనా ?కారులో తిరగడం అలవాటైతే రిక్షా తొక్కితే కాళ్ళు పట్టు కోవూ .అసలు వ్రుత్తి పొతే
సంసారం ఎలా ?అన్నాడట .
పెద్దమనుషులు ఆలోచించి అతని షరతుకు ఒప్పు
కొన్నారట .అందులో ఒకాయన "అయితే ఒకపూట మంత్రి పని చేస్తావు -పొద్దునా ?సాయంత్రమా ?"అని ప్రశ్నించాడట .
రిక్షాదారుడు వెంటనే పొద్దున్నమంత్రి పని సాయంత్రం రిక్షా !పోద్దునపూట బేరాలుండవు .సాయంత్రంపూట అయితే ఊరంతా సినిమాలుంటాయి .నాలుగు బేరాలు తగులుతాయి "అన్నాడు .
ఈకధ చెప్పి నరసిహ్మమ్గారెంతో నవ్వించేవారు .మంత్రి పదవులు ఎంతోకాలం వుండవు .మల్లి మామూలు జీవితంలోకి అడుగుపెట్టాలి -అనడానికి ఎంతో చక్కటి కధ ఇది
రావూరు .
No comments:
Post a Comment