Pages

Tuesday, October 14, 2008

జ్ఞాపకాలు

హాస్యరస చక్రవర్తీ !......ఇదుగో ముక్కానీ
మునిమాణిక్యం వారికి విశ్వనాథ వారంటే ఎంతో
గౌరవం వుండేది. విశ్వనాథ వారికి అంతే!మునిమాణిక్యం వారిని
చూడ గానే కొంచెం "జాలీ మూడ్ " లోకి వెడుతూ వుండేవారు.
ప్రముఖులైన వారు పరిహాసాలాడుకొంటున్నా ఏదైనా వాదించు
కొంటున్నా బాగానేవుంటుంది.వాటిల్లోనూ విశిష్టత వుంటుంది.
విశ్వనాథ వారిలో కూడా హాస్యం ఎక్కువగానే వుండేది.అయితే ఆయన
బయటికి చాలా కటినంగా కనిపించే వారు.సమయం వస్తే అతి చమత్కారంగా మాట్లాడ కలిగేవారు.
ఒకసారి మునిమాణిక్యం వారు కాఫీ హోటల్లో
వున్నారు.పెసరట్టుకి ఆర్డరిచ్చి కూర్చున్నారు.ఇంతలొ విశ్వనాథ
వారు,వారి తమ్ముడు వెంకటేశ్వర్లు గారు ,నేను ,ఇంకొరు వెళ్ళాం
హోటల్ కి .విశ్వనాథం వారిని చూడగానే మునిమాణిక్యం వారు నవ్వులు నవ్వుతూ "దయచేయన్ది .ఇక్కడ కుర్చీలు
ఖాళీగా అని ఆహ్వానించారు.మేమంతా ఆయన కూర్చున్న చోటికి వెళ్ళాము.ఇంతలో
మునిమాణిక్యం వారి పెసరట్టు వచ్చింది.బల్లమీద పెట్టగానేవిస్వనాథ
వారుపెసరట్టుని చుట్ట చుట్టి నోట్లో పెట్టు కొన్నారు.
ఇక చూడండి....మునిమాణిక్యం వారికి ఎంత కోపం వచ్చిందో!
"ఏమిటయ్యా!యీపని!నేను ఆర్డరిచ్చిందే తినాలా?నాకు ఎంత ఆకలిగా వుండి
వచ్చానో తెలుసా?ఇప్పుడు వెళ్ళీ మూడు క్లాసులకి పాఠాలు చెప్పాలి.నువ్వు
మామూలు వాడివి కావు."కవిసామ్రాట్" ఒకళ్ళ పెసరట్టుకి ఆశ పడడట మేమిటి?
చూడు చుట్టు పట్ల వాళ్ళెంత నవ్వుతున్నారో!కరుణలేదుకవి అంటే ఎన్ని మర్యాదలు
తెలియాలి?ఎంత హుందాగా వుండాలి?నా పెసరట్టు తీసుకోవడానికి నీకు చేతు
లెలా వచ్చాయి?"అని మాట్లాడుతున్నారు కోపంగా.
విస్వనాథవారు తమకు ఏమీ సంబంధం లేదన్నట్లు పెసరట్టు
నములుతూ నుంచున్నారు.అక్కడ వున్న వారందరూ ఆ సీను చూసి ఎంతో సంతో షించారు.తగాదా ఎంత వరకు పోతుందోనని ఎదురు చూస్తున్నారు.విశ్వనాథ
వారు అలా నుంచునే వున్నారు.
మునుమాణిక్యం వారు మళ్ళీ ప్రారంభించారు."ఇన్ని ధర్మాలను గురించి వ్రాస్తారు.ఏమిలాభం?వాటిని ఆచరణలో పెట్టవద్దా?ఇంకోళ్ళ వస్తు అడగకుండాతీసుకోకూడదనే చిన్న విషయం కూడా తెలియదామీకు?పోనీ తినాలనిపిస్తేనన్నడగకూడదూ?ఇష్ట మైతే ఇచ్చేవాడినిగా?అదిమర్యాద
గానీ ఇదేమి మర్యాదా?దండు వెంట పెట్టుకు వచ్చాం గదాని ధైర్యమా?
ఇలా దోపిడీ చేయడమేమీబాగులేదు అన్నారు.
సత్యనారాయణ గారు అక్కడవున్న మంచి నీళ్ళ గ్లాసు తీసుకొని గడగడ తాగేసారు.మూతి తుడుచుకొన్నారు.జేబులో నుంచి మూడు కాసులు తీసారు.మునిమాణిక్యం వారి వంక చూసి"ఎందుకు అంత గాభరా పడి పోతావు?
నువ్వు సరసుడవనుకొన్నా."ఓ! హాస్యరస చక్రవర్తీ ఇదుగోముక్కానీ!అని ఆడబ్బులు
బల్లమీద పడేసారు.
ఇంతలో సర్వర్ తెలివి కల వాడు కనక మరో పెసరట్టు తెచ్చి అక్కడ పెట్టాడు.మునిమాణిక్యంవారు"ఏం! ఇదైనా తిననివ్వరా?అని విశ్వనాథ వారి వంక చూసారు."తినవయ్యా ఏదో హాస్యానికి తీసుకొన్నాను.ఆగ్రహం బయట పెట్టావు.అంటూమరో బల్ల దగ్గరకు వెడుతూ"సరసం,
సల్లాపం,చమత్కారం,చనువు-ఇవన్నీ సహజ లక్షణాలు గలవాడు భాసిస్తాడు.లేనివాడు ఊరికే ఇతరుల్ని వేధిస్తాడు"అన్నారు.
రావూరు

No comments: