Pages

Thursday, October 23, 2008

వ్యాసాలు

ఇక్కట్లు
ఈమధ్య హైదరాబాదులొ బయటికి వెళ్ళాలంటే బహు కష్టంగా వుంది.ఆటో
మీటర్లు మార్చాక ఇక్కట్లు ఎక్కువయాయి.సాధారణంగా ఒకేచోటికి వెళ్ళినా
రిక్షాల రేటు విడిగానే చూపిస్తుంది.కొద్దిమంది వి మాత్రం అసలు ఖరీదును
చూపిస్తాయి.కొన్నాళ్ళు మీటరు మార్చలేదు కొందరు.మార్చాక దీనివల్ల నష్టమయిపోతోందండీ!అనిరిక్షా దిగగానే అయిదు రూపాయలియ్యండి అని,రెండురూపాయలియ్యండీ అని,లేకపొతే చార్జికి పోగా మిగిలిన చిల్లర ఇయ్యక పోవడం ఇలాజరుగుతుంది. పన్నెండు రూపాయలు మినిమం చారిజ్.పదిహేను రూపాయలు ఇయ్యండి అంటున్నారు.అశొక్ నగర్ నుంచి, చిక్కడపల్లి మార్కెట్కొ,దేవాలయానికొ,ఆస్పర్తికో,మందులకో,కొండొకచో బట్టలకి,నగలకి
వెళ్ళాల్సి వస్తూనే వుంటుంది.అయిదు నిముషాల ప్రయాణానికి అరగంట వాకిట్లో నిలబడి ఎదురుచూసి బెరాలాడితేనేకాని,రిక్షా యోగం పట్టదు.కొంతమందిపిలిస్తె ఇటు చూడరు,కొండరు చాలాఈసడింపుగా చూస్తారు,కొందరు ఆపుతారురిక్షా,హమ్మయ్య రిక్షా దొరుకింది అనుకొంటె "ఎక్కడికి వెళ్ళాలి?'అని అడిగి వస్తాను,రాను అనికూడా చెప్పకుండా వెళ్ళిపోతారు.కొందరుపాతిక రూపాయలిమ్మంటారు.పదిరూపాయల వస్తువు తెచ్చుకోడానికి వెడితే యాభై రూపాయలు రిక్షాకి. తొందర పనివుండొ,నడవలేకపోతేనో రిక్షాయే శరణ్యం కదా?పన్నెండు రూపాయలు కూడా అవని దూరానికి పాతిక రూపాయలంటే ఏమిమాత్లాడుతాము.పదకోండొ నెంబరు బస్ {కాలినడక] లొ వెడదామంటే రహదారుల అభివ్రుధ్ధికార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి,అన్నిదారుల్లో!సినిమాల్లొ చూస్తూంటాము,విలన్ బంధించిపెడ్తాడుఎవరినో,వాళ్ళు అతనికి తెలియకుండా పారిపోదామని ప్రయత్నిస్తే,ఎటు వెడితే అటు అడ్డం. అలావుందిరోడ్ల సంగతి.రోడ్డు మధ్యలో తవ్వి పెడ్తారు,వాహనదారులు అవితప్పించుకోవడానికి రోడ్డుపక్కనుంచినడపుతారు,వినయంగా వొదిగి వొదిగి నడిచేకాలినడకదారులకి హడలెత్తిపోతూవుంటుంది.కొండలమీదనడుస్తున్నట్లుంటుంది గాని రోడ్డుమీద నడుస్తున్నట్లుండదు.ఎందుకండి ఇన్ని ఎత్తుపల్లాలంటే ఎప్పుడో తవ్వి పూడ్చిన గోతులు చదును చేయని కారణంగా చిన్న చిన్న కొండలు,గోతులు రోడ్డు మీద బైఠాయించి
మనకానందాన్ని కల్పిస్తున్నాయి.రోడ్లు బాగుచేయడం పైపు లైన్లు వేయడం ప్రజల సౌకర్యార్ధమే?సంతొషించవలసిన విషయమే!ఆకార్యక్రమమేదో నెలలతరబడికాకుండా త్వరగా ముగించి రొడ్లుమళ్ళి సమానంగా చదును చెయిస్తె బాగుంటుంది.ఒక శాఖవారు పూడ్చాక మరోశాఖవారు వచ్చి తవ్వుతారు,ఈలోగా ఇళ్ళుపడఘొట్టి ఫ్లాట్ల తయారీకి ఇచ్చెకార్యక్రమం వలన రోడ్ల మీదికి ఇసుక కుప్పలు,కంకర గుట్టలు .బడికి వెళ్ళెపిల్లలు,వ్రుధ్ధులు ఎలానడవగలరు?ఇంతా అయాక ఒక వాన కొట్టి రోడ్లపై చెలమలుతయారవుతాయి.కారు చక్రాలు ఆనీటిని చల్ల చిలికి ఫక్క నడిచేవాళ్ళ వస్త్రాలపై అద్దకాలువేయడం,లోతు తెలియని గుతలలో పడి పాదాలు మెలికపడడటం,ఫ్రాక్చర్లు కావడం ఇలాటి బహుమానాలందుతాయి.కూరగాయల కొట్టువద్ద పెద్దదిగుడుబావిలా తవ్వారు,నెలలయింది.రోడ్డుముయ్యలేదు,పక్కనె ఎగుడుదీగుడుగా దిబ్బలపై నడుస్తున్నారు జనం,కాలు జారిందంటే ఏమౌతారొ?
సర్వేజనా సుఖినొ భవంతు

2 comments:

Viswanadh. BK said...

మీ బ్లాగు మొదటి సారి చూడటం. మంచి సమాచారం మరింత మంచిగా అందిస్తున్నారు.
అభినందనలు.

Ramani Rao said...

హైదరాబాదు రోడ్లగురించి ఓ పెద్ద గ్రంధమే రాయొచ్చండీ. ఆటోలయితే మన పర్స్ ఖాళీనే. బస్ లో అయితే ట్రాఫిక్ జాంల గోల. చాలా బాగా చెప్పారు హైదరాబాదు ఇక్కట్లు.