Pages

Sunday, November 9, 2008

నవ్వుల భోషాణం

నవ్వులభోషాణం స్కెనాజర్ [2]
వీడునన్ను పట్టుకొన్నాడేమిటీ!ఈదుస్థితికి నేనే కారణమైనట్లు?అనుకొన్నాను.నేను"నిజమేనండీ!వెధవ చదువులు కావుటండీ ఈకాలపు చదువులు?మీరన్నమాట నిజమేనండీ!స్కెనాజర్ అంటేతెలియకపోతే ఇక వాడూ ఎందుకు పనికి వస్తాడండీ!అటువంటి వాళ్ళు చూసారూ అడుక్కుతింటూపోవాల్సిందే"అన్నాను నేను.ఏదో కసి తీర్చుకొన్న తృప్తితో.ఈమాట మీదాయన"అడుక్కుతిణడానికి మాత్రమెల్లాగా పనికి వస్తాడండీ వెధవది స్కెనాజర్ అంటే ఏమిటో తెలియకపోతే అన్నాడు.
నేనేం చెప్పేది?అడుక్కు తిండానికికూడా 'స్కెనాజర్ అంటే ఏమిటో తెలియాలె కాబోలునూఅనుకొన్నాను.ఆయన నన్ను ఇంకా అనేక ప్రశ్నలు వేసేటట్ళూన్నాడు. నాతెలివితక్కువ తనాన్నికూడా బయటపడేయ్యాలనేఆయన అలోచిస్తున్నట్లున్నదీఅయన వ్యవహారం చూస్తే.ఆయన అడిగే ప్రశ్నలకు నేను చెప్పే జవాబులలొ ఎక్కడొ నా అజ్ఞానం బయట పడక మానదు.అయితే ఒక్క ఉపాయం తోచింది.ఆయన చెప్పిందానికల్లా"నిజం,నిజం అంతేనండి మరీ"అని కప్ప దాట్లువేస్తేఆయన నన్ను పట్టుకోలేడు అనుకొన్నాను.
అక్కడినుంచీ ఆయన ఇష్టం వచ్చినట్లు మాలాడాడు.మొదట ఆయన "ఆమాటకు అర్ధం తెలియని వాడు"ఎందుకూ పనికిరాకుండా పోతాడు అంటే"అంటే నేను"నిజమే!అటువంటి వాదు ఎందుకు పనికి వస్తాడండీఅంటూ దీర్ఘాలు తీసాను."అటువంటి తెలివి తక్కువ దద్దమ్మనుతలో మొట్టికాయ వేస్తారు.అని ఆయన ఖచ్చితంగా చెపుతే"వెయ్యక వూరుకొంటారుటండీ!అని ఆమోదసూచకంగా నవ్వాను. ఆయన చెప్పిన దానికి నేను అంగీకరించడం వలన ఆయనకి ఉత్సాహం కలిగి"చూడండీ,భూమి గుండ్రంగా వుందనీ స్కెనాజర్నల్లగా వుందనీతెలియక పోతే ఇంకేముంది చెప్పండి?అంతా నవ్వుతారా నవ్వరా?అన్నాదు "తప్పకుండా చచ్చినట్లు నవ్వుతారు>"అంటూ తార్కాణంగా నేను విరగబడి నవ్వాను.
" ఆమాత్రం జ్ఞానం లేనివాడు వట్టి వెధవ " అని ఆయన అంటే:ఇంకానయంమెల్లగా అంటారేం!అటువంటి వాడు వెధవేమిటీ? వెధవన్నర కూడాను"అన్నాను ముఖం చిట్లించి,కనుబొమలు ముడివేసీటువంటి మనిషి యందు నాకుగల ఏహ్య భావాన్ని వ్యక్త పరుస్తూ.ఆతరవాత అక్కడుంటే లాభం లేదని తోచిందినాకు,ఉంటే అవాచ్యాలన్నీవాగిస్తూవుంటాడని తోచిమూటాముల్లె తీసుకొని దిగిపోదామనిలేచాను.

No comments: