ప్రేరణ
"ఏమిటోయ్!అన్నపూర్ణా!అసలుకనిపించడం మానేసావ్!అన్నాను.
వూరువెళ్ళానండీ!వూళ్ళొలేను.అంది.
కార్తీక మాసం రాలేదుగా?ఏవూరెళ్ళావు?అన్నాను.అన్నపూర్ణ దేవీ ఉపాసకురాలు.పంచదశి మంత్రోపదేశం తీసుకొంది.పర్వడి దినాలలో
అలంపుర్లాటి చోట్లకు వెళ్ళిజోగులాంబ సన్నిధిలో వుండి జపం చేసుకొని వస్తూ వుంటుండి. "జిలుగుమాడు" వెళ్ళానడీ!అంది.
అదెక్కడ? అక్కడేంపని?అన్నాను
ఖమ్మం జిల్లామధిర మండలం.అక్కడ మాతాతగారు ప్రతిష్టించిన శ్రీ శారదా చంద్ర మౌళీశ్వరాలయం వుంది.ఒకప్పుడు "జిలుగుమాడ"ప్రజలు అక్కడ స్వామిని దర్శించుకొని సేవించుకొని,వ్రతాలు పూజలు,వనభోజనాలు చేసుకొనేవారట.1969 లో
వరద వచ్చి గ్రామమంతా మునిగిపోయిందిట.ప్రజలు కట్టు,బట్టలతో బయటపడ్డారట,కాని స్వామివారు మాత్రం చెక్కు చెదరలేదట.తరువాత ప్రజలు మధిర సమీపం లో కొత్తగ్రామము ఏర్పాటు చేసుకొని,అక్కడ ఒక రామాలయాన్ని నిర్మించుకొని సేవించుకొంటూ చంద్ర మౌళీస్వరాలయం లొ స్రీ అంజనేయ స్వామి వున్నాడుకదా,ఆయన్ని తెచ్చి ఇక్కడ ప్రతిష్ట చేద్దామని50మంది వచ్చి పెకలించారు.ఆయన ససేమిరా కదల లేదు."వీరికి ఇక్కడనుంచి కదలడం ఇష్టం లేదు"అని వెళ్ళిపోయారట.
ఆగుడి చూసివచ్చావా?అన్నాను.
మొన్న మాకుటుంబ ం లోని వాళ్ళం అంతా కలిసాము.కబుర్లలొ ఆవూరు గుడి గుర్తు చేసుకొన్నాము.మాతాత గారు ఆగుడిలో ఒక బావి తవ్వించారు.పుష్కలం గా మంచి నీరు వుండేది.వాడుకలేక పూడిపోయిందట.వేపచెట్టు రావిచెట్టు పెట్టారు. వాటికి పిల్లలు లేనివారు 40 ప్రదక్షిణాలు చేస్తే సంతానం కలిగేదని ఆవూరివారి నమ్మకం.గుడికి ఆగ్నేయమూల ఒక పాము పుట్ట వుంది.అందులో పాములు
రెండు వుండేవి.స్వామిని చుట్టుకొని వుండేవి.ఒకటి అదృశ్య మయింది.ఒకటి ఇప్పటికి వుంది.ఎవరిని ఏమీ చెయ్యవు.ఆపుట్ట త్రవ్వడానికి ఒకరు ప్రయత్నం చేయగా అంధుడయిపోయాడట.ఆప్రయత్నం విరమించుకొన్నాడు.నేను మా అందరిలో పెద్ద దాన్ని కనుక నాకు కొంచెం గుర్తు వుంది.ఆగుడి చూడాలనిపించింది.ఆగుడి బాగుచేయించి, బావి పూడిక తీయించి, స్వామివారికి గ్రిల్ పెట్టించి,ప్రహరీ గోడ బాగు చేయిస్తే మంచిది,తాతయ్య విగ్రహం కాని కనీసం ఫొతో అయినా పెట్టాలి అనుకొన్నా.మావాళ్ళు దబ్బు ఒక లక్ష దాకా విరాళం ఇచ్చారుకాని పని చెయ్య డానికి ముందుకు రాలేదు.
నేను జిలుగుమాడ వెళ్ళి పెగళ్ళపాటి రాక కిషన్ రావు గారి పెద్ద మనుమ రాలిగా పరిచయం చేసుకొన్నాను.మాతాత గారు కట్టించిన గుడి బాగు చేయిద్దామని వచ్చానని చెప్పాను. వారు చాలా సంతోషించి నన్ను అక్కడికి తీసుకువెళ్ళి చూపించారు.గుడిలో క్షీణత తప్ప అభి వృధ్ధి లేదు. చెట్లు వట వృక్షాలయినాయి.నేనే వెళ్ళి బావి పూడిక తీయించాను,ప్రహరీ గోద బాగుచేయించాను.ధూప దీలు, నైవేద్యానికి ఏర్పాటు చేసాను. ఆ ఆంజనేయ స్వామిని, ఆశివుని దర్శించుకొని సేవిస్తే కోరుకొన్న వన్ని నెరవేరుతాయని ప్రతీతి. కొన్ని ఉదాహరణలుకూడా ప్రజలు చెప్పారు. ఆపనిలోవున్నా.అన్ని.
"అమ్మో!ఎంతపెద్ద పని కి సాహసించావు అన్నపూర్ణా!ఇంత ధైర్యం నీకెలా వచ్చింది?అన్నాను.
"నాకు తెలియకుండానే స్వామి నన్నీ పనికి ప్రేరేపించారు.చేతనయింది చేద్దామని మొదలెట్టాను.గుడికి వెళ్ళడానికి సరయిన దోవలేదు.రాళ్ళల్లోంచి, గోతుల్లోంచి నడవాలి నలుగురు వస్తేకదా దేవాలయానికి,పేరు,రాబడి వచ్చేది. అందుకని మైన్ రొడ్డుదాకా రొడ్డు వేయించాలని తిరుగుతున్నాను.ఎవ్రేనా భక్తులు, సహృదయులు సహాయం చేస్తే ఆకార్యము నిర్విఘ్నముగా వెరవేరుతుందని ఆశిస్తున్నాను.అంది అన్నపూర్న.చాల మంచిపని.అన్నాను.
అన్నపూర్ణ సామాన్య గృహిణి, భాద్యతల కేమీ తక్కువలేవు.మాటి మాతికి అక్కడికి వెళ్ళి పనులు చేయిస్తున్నదంటే ఆమెలోని సత్సంకల్పము,దీక్ష,త్యాగము,గొప్పవి.ఇలాటి కార్య క్రమాలు ముఖ్యం గా ధన్ముకావాలి,ధనం తొ చాలదు,అంగ బలం కావాలి.ఈరెండూ కలిస్తే గాని కార్యక్రమము నడవదు.
యూరప్ చూడలేదు, జపాను చూడలేదు అనుకొంటాముకాని మన చుట్టుపక్కల వున్న మన గ్రామాలే చూడలేము.తెలుసుకోముకూడా!పదండి పోదాం పల్లెకు అని బయలు దేరితే ,అక్కడ దేవాలయాల జీర్ణోధ్ధరణ,రోడ్లు వేయించడం,విద్యుద్దీపాలు ఏర్పాటు చేయడం,ఆస్పత్రి నెలకొల్పడం,విద్యాలయాలు స్థాపించడం ఇలా ఎన్నిచేయాలో?ఇవన్నీ చేయాలంటే ఎంతమంది అన్నపూర్ణలు నడుము కట్టాలో?దేవాలయ కార్య క్రమాల్ని గురించి తెలుసుకోవాలనుకొంటే,ఏవిధమైన సహాయం చేయాలన్నా అన్నపూర్ణ ఫొన్ నెంబరు ఇస్తున్నా ఇదుగో!క్.అన్నపూర్ణ 9704175866.
2 comments:
Very nice work you have taken up i am very much impressed with this work i want to help you in this work. please contact me with this number 9885503316 (K.VENKATESWARA RAO h/o K.ANNAPURNA) all the best to you ANNAPURNA.
verry good i want to help you i will contact you deffenitly
Post a Comment