Pages

Sunday, January 18, 2009

విన్డుడైన నందుడు నరుడైనా నారాయణ ప్రభతో వెలిగిపోతున్నాడటమెత్తని పసివానిని హృదయానికి హత్తుకొని ఆనంద లోకాల ప్రాంగణాలు దాటి పరమార్దానందాబ్దిలో ఓలలాడే పవిత్రమూర్తి యశోద మామూలుతల్లా?వట్టి తల్లికాదు.భక్తీ ప్రపత్తుల నయగారపు పంటలు పండించుకొన్న భాగ్యలక్ష్మి. వైకుంఠం నుంచి వేలికివచ్చి ఒడిలో సయ్యాటలాడేఓంకార ప్రణవ నాద మూర్తి చిలికే చిరునవ్వుల జడిలో ఆది అలసిఅర్ధం తెలియని ఐశ్వర్యం గుండెల వాకిట్లో కోటి కాంతులు విర జిమ్ముతూంటే పరవశురాలయ్యే పిచ్చితల్లి యశోద తన బిడ్డ మామూలు పాపడని ఒప్పుకోలేదు_మహానీయుడని గొప్పలు చెప్పుకొందామంటే ఈ జీర్ణ వస్త్రం లోని వజ్రాన్ని ఎవరు దొంగిలిస్తారో నని భయం.తల్లిననే మమకారం జగత్పితకి తల్లిననే ధీరత్వం ఎభావం దాచుకోవాలో,ఏది వెలికి తేవాలో తెలియని అద్వైతం.కృష్ణుడిని దర్శించాలనే కోరిక అందరికి ప్రబల మై పోయింది.అందమైన దేవుడు అందమైన అవతారాలెత్తి మరింత అందమైన లీలలు చేస్తూంటే మనిషి కేమిటి? మహేశ్వరునికి కూడా ఆయన్ని చూడాలని తహతహ పుట్టిందిట.కైలాసం నుంచి కదిలాడు.పరమత గణాలు వెంట వస్తానన్నారు.మిమ్మల్ని విడిచి నేనుండలేను నన్ను కూడా మీ వెంట తీసుకెళ్ళండి' అంది పార్వతి.శివుడు అంగీకరించలేదు.నిజమైన ఆనందం ఎవరికివారే ఒంటరిగా పొందాలనుకొంటారు.గోకులంలో ఒక ఇంటినుంచి ఇలా పాట విన వచ్చింది.
నల్లని వాడంత
కమల నయనాల వాడన్త
దయగల వాదంత

దొరవంటి వాడంత

నెమలి కన్నులు దాల్చి

నటనలు చేస్తాడంట

నవ్వుల పువ్వులు

విరియించు వాడంత

నందుని పంటంతా

యశోద చంటి యత

ఒకసారి చూసితే

వదలనేలేరంతా

వాడెంత వాడతనే

ఈదేంతో లేదతనే

పలుకక నే పెదవి

మధువులోలుకునంత

అపుడే చిలికిన వెన్న వోలె

చిత్తము మెత్తనయత

మహేశ్వరుడు మెల్లగా నందుని గృహ ప్రాంగణం చేరాడు.తన నిజ రూపం వదిలి సాదు రూపం ధరించాడు.విభూతి,ఉరగము,డమరుకము,త్రిశూలము చేత బూనాడు.బిక్ష కోసం యాచించాడు.యశోద ఆదర్శ గృహిణి,అన్నార్తులకి,అతిథులకి ,సత్సంగులకి సాధువులకి బిక్ష వెయ్యడం ఆమెకి నిత్య విధి.

బిడ్డ ఒంటికి కస్తూరి,పునుగు,జవాది పులిమి

No comments: