వీరిరువురి మధ్య పరదా మరేమిటో కాదు ,"మాయ ".ఆతెర తొలగితెభాగావంతుడు భక్తుడు నాలుగు కళ్లు రెండు కళ్ళుగా చేసుకొని తన్మయులవుతారు.ముగ్ధ మోహనమూర్తి రాధ లోపల కృష్ణుడి పక్కనే వుంటుంది.పరదా వేసినప్పుడు కృష్ణుడు ఆమె కళ్ళలో కళ్లు నిలిపి రాధలోని బాధని బాపి మనసులో తియ్యదనం నింపుతాడు.
శివుణ్ణి చూడగానే కన్నయ్య కిల కిలా నవ్వడం మొదలు పెట్టాడు.సాధువు ఇంద్ర జాలికుడా!మామూలు సాధువు కాదని తెలుస్తూనేవుంది.
దాసీ నెమ్మదిగా పిల్లవాన్ని శివుని దగ్గరికి తీసుకు వెళ్ళింది.శివుడు కృష్ణుని చూసి కిల కిలా నవ్వాడు.శిరసు వంచి వందన మాచరించాడు.కృష్ణ దర్శనంతో మది పొంగింది,కానీ తృప్తి కలుగ లేదు.
"ఒకసారి కన్నయ్య నిలా ఇయ్యమ్మా!అలా దూరం నించి చూస్తె తృప్తి కలగడం లేదు.నా చేతికిస్తే నా వాళ్ళో పెట్టుకొని ఆనందిస్తాను.దూరంగా వుంటే ఆ ఆనందమేదీ?మేమిద్దరం కలుసుకోవాలి.మెత్తటి పాపాన్ని మదికి హత్తుకోవాలి.అద్వైతం లోనే ఆనందం.దూరంలో భయం,దగ్గరలో హాయి."అన్నాడుశివుడు.
కళ్ళుమూసుకొని"ఆహా!కృష్ణుడు ఒక్కసారి నా వడిలోకి వస్తే ఎంత బాగుంటుంది?"అనుకోని కళ్లు తెరచి,యశోదతో-
నీబిడ్డది భవిష్యత్ తెలుసుకోవాలని లేదా?పిల్లవాన్ని ఒక్కసారి నాచేతికిస్తే పాపడి అరిచేతిలోని రేఖలు స్పష్టంగా చూసి మీకు భవిష్య వాని చెపుతాను."
భవిష్య వాని అనగానే యశోడలో ఉత్ఖంట పెరిగింది.బాలున్ని శివుని చేతికిచ్చింది. ఆయన ఒడిలో పెట్టుకొన్నాడు.నిశ్చల సంమాధింలోకి వెళ్ళిపోయాడు. హరి,హరులు ఏకమయ్యారు.ఎవరూ ఏమీ మాట్లాడలేదు.కొంత సేపటికి శివుడు-
తల్లీ!నీబిడ్డ చక్రవర్తికానీ మామూలు వాడుకాదు."అన్నాడు.
మామిడిపండు దొరికితే ఆనందం తో గంతులు వేస్తాము,శివుడి చేతిలోకి చిన్మయ మూర్తి శివుడు వచ్చాడు.ఆయన తాండవ నృత్యం చేసాడు.తన్మయత్వంతో నృత్యం చేసి పిల్లవాన్ని యశోదకప్పగించి వెళ్లి పోయాడు.తన బిడ్డ ఇంట ఆనంద దాయకుడా?అని యశోద కళ్ళప్పగించి చూస్తూ నిలబడి పోయింది.
గోకులంలో శివుడు క్రుశ్నునికోసం వేచి నిల్చున్న స్థలంలో ఒక శివ మందిరం వెలిసింది. ఆ మందిరంలోని శివుణ్ణి "ఆశేస్వరుడు" అని పిలుస్తారు. వ్రజ చౌరాసీకి ప్రదక్షిణం జీవితంలో ఒక్కసారయినా చేయాలి.పాపాలన్నీ పటాపంచలవుతాయి.గోకులం కృష్ణుడి లీలా నాటక రంగం అక్కడకూర్చుని తపస్సు చేస్తే స్వయమ్గా కృష్ణుడే ప్రత్యక్షమయి లీలలు చూపిస్తాడట
రచన -టి.జ్ఞాన ప్రసూన . ఆంద్ర ప్రభ సచిత్ర వార పత్రిక నుంచి పునర్ముద్రితం .
No comments:
Post a Comment