బ్రహ్మ జ్ఞానము పొందటం కంటే బ్రహ్మజ్ఞానిని దర్శించుకోవాలనుకోవడం విశేషం .
యశోద తలుపు ఓరగా నిలబడి "సాధు పుంగవా! బిక్ష ఇచ్చినదానిలో తక్కువవున్నా,LoPAM జరిగినా,వేరేదైనా మీరు కోరినా ఇయ్యడానికి సిద్ధమే!కానీ పసివానిని వీధిలోకి తీసుకురాను. పైగా మీ మెడలో సర్ప రాజును చూసి నాకూనా బెదిరిపోతాడు."అంది.
తల్లీ! నీ బిడ్డడు సామాన్యుడు కాదమ్మా!కాల పురుషునికి యజమాని. బ్రహ్మ దేవుడి తండ్రి. అటువంటి వానికి భయమేమితమ్మాఅంతటి వానికి ఎవరి దృష్టి తగలదు.! నేను ఆయనకు తెలుసు,ఆయన నాకు తెలుసు.ఒక్కసారి చూపించంమా!"అన్నాడు శివుడు.
యశోద ఆశ్చర్యానికి అన్తులేకపోయింది.భీతురాలైంది."ఏమిటండీ మీరనేది?నాబిడ్డ పసికూన.మీరు పట్టు బట్టకండి" అంది."నేను కృష్ణున్ని చూడకుండా తిరిగి వెళ్ళనమ్మా!"అన్నాడు శివుడు.
వీరిద్దరూ ఇలా మాట్లాడుకొంటూ వుండగా లోపల కృష్ణుడికి కధంతా తెలిసిపోయింది.శివుడు తనని చూడటానికి వచ్చాడు.తల్లి తనని బయటికి తీసుకు వెళ్లి చూపించ నంటోంది.జోరుగా ఏడుపు సాగించాడు.
దాసీ యశోద దగ్గరకు వెళ్లి మెల్లగా "అమ్మగారూ!ఆ సాధువు కదలడం లేదు.పెదవులు కదుపుతూ లోలోపల ఏదో గోనుగుతున్నాడు.మీరు నమ్మితే నమ్మండి,లేకపోతేలేదు.ఆయన ఏదో మంత్రం వేసి వుంటాడు. లేకపోతె నీళ్లు పోసుకొని నిద్ర పోతున్న కన్నయ్య ఎందుకు ఏడుస్తాడు?ఇంతవరకూ ఇలాటి సాధువుని నేచూడలేదు బాబూ!వెళ్ళమంటే వెళ్ళాడు.నంద బాబు కూదావూల్లో లేరు.ఎందుకొచ్చింది కృష్ణుడిని ఒకసారి ఆయనకీ చూపించి ఆశీర్వాదం తీసుకోవడమే మంచిది!'అంది.
ఇదుగో!నాబిద్దని ఆసాదువుకు చూపిస్తే చూపించుకానీ ఇలా చూచి, అలా వెళ్లి పొమ్మని చెప్పు.కన్నార్పకుండా చూస్తె నాబిద్దకి దిష్టి తగులుతుంది."అంది యశోద.
స్వరూపాశక్తి లేకపోతె భక్తీ పెరగదు.మనసాటి,తోటి మనిషిని ప్రేమించి ఎంతగా చూడాలని తహతహ లాదతామో ఆ రూపాన్ని మనసులో ముద్రించుకోవాలని ఎంత తాపత్రయ పడతామో అలానే భగవంతునిపట్ల మరిన్ని రెట్లు ఎక్కువ మక్కువ పెంచుకోవాలి. అదే భక్తిగా మారి,ముక్తికి మార్గ మవుతుంది.
కృష్ణ మందిరంలో పరదా వేస్తారు.పరదా తీస్తే భక్తుడికి భగవంతుని దర్శన మవుతుంది.భక్తుడు జీవాత్మ,భగవంతుడు పరమాత్మ.
No comments:
Post a Comment