Tuesday, January 27, 2009
రిపబ్లిక్ ఢే
రిపబ్లిక్ డే ఎన్ని సంవత్సరాలు గడిచినా మనో ఫలకమ్మీదనుంచి కొన్నిచిత్రాలు చెరిగిపోవు.రిపబ్లిక్ డే అనగానె నాచిన్నపుడు బందరులోడాబాపై నుంచుంటే దూరంగా ఒక మబ్బు నేపధ్యంలో పెద్ద ఝండా ఎగురుతూకనిపించింది.ఆరోజుల్లో గాంధీగారన్నా,ఖద్దరన్నా, కాంగ్రేసు ఝండా అన్నారాట్నం అన్నా మనసుగర్వంతో,గౌరవం తో నిండిపోయేవి.ఆవేళ ఝండాని అలా ఎంతసేపో చూస్తూ నిలబడ్డాను. ఈనాటికి అగష్ట్ 15 ,రిపబ్లిక్ డేఅనగానే ఆదృశ్యమే కళ్ళలో నిలబడుతుంది.ఆరోజుల్లో రెడియోలు అందరిళ్ళల్లో వుండేవి కావు,టీ.వి లు అసలేలేవు.ఇలాటి సందర్భాలలో నాన్నగారు సాయంత్రం పూట పార్క్ కి తీసుకెళ్ళేవారు,అక్కడ రేడియో వినేవాళ్ళము. వూళ్ళో ప్రతి కూడలి లోనూ ఒకదిమ్మ కట్టి ఝండాఎగరేసేవారు.పూలు,బుక్కాయలతొ పూజలు చేసే వారు.స్వచ్చ మైన దేశ భక్తి ప్రతివారి కళ్ళల్లో తొణికిసలాడుతూ వుండేది.అందరు ఖద్దరు కట్టేవారు. ప్రతి ఇంట్లో రాట్నం కదులుతూ వుండేది.దేశం పట్ల భక్తిని అలా ప్రకటించేవారు.హిందీ నేర్చుకొనేవారు,నేర్చుకోమని అందరినీ ప్రోత్సహిస్తూండెవారు. మొన్న మాకాలనీలో సొసైటీ వాళ్లు ముగ్గుల పోటీ పెట్టారు.కాలక్షేపం కోసమనుకోండి ,కానుకల కోసం అనుకోండి నేనూ వెళ్ళాను.నేనేమీ ప్రవీణురాల్నికాదు,గుప్పిటలో ముగ్గు గుమ్మంలోపారబొయ్యడమేతెలుసు.రిసల్ట్స్ రిపబ్లిక్ డే నాడు చెపుతామన్నారు.వెళదామనుకొన్నాను,స్వార్ధము,పరమార్ధము కలిసివస్తాయికదా!ఆడవాళ్ళకి ఎక్కడికైనా పక్కింటికైనాసరే వెళదామంటే ఏమి చీర కట్టుకు వెళ్ళాలి అని ప్రశ్న ఉదయిస్తుంది.అదేమి ఖర్మో గాని అగష్ట్ 15రోజున,రిపబ్లిక్ డే రోజున తప్ప ఖద్దరు చీర సంగతి జ్ఞాపకమేరాదు.హిందీ ప్రవీణ ప్రచారక్ ట్రైనింగ్ అయేటప్పుడు ప్రతి శుక్రవారం ఒక స్పెషల్ క్లాసు వుండేది, గీత చెప్పేవారు, ప్రార్ధనలు చేయించేవారు, ఆరోజు అందరు నీలం అంచున్న తెల్ల ఖద్దరు చీర ధరించేవారం.సందర్భానుసారంగా దుస్తులు ధరిస్తే సమంజసం గా వుంటుంది.ఝండా వందనానికి తప్పక ఎం.ఎల్.ఏ గారో,ఎం పి,గారోవస్తారు కదా!వారూ పక్కా ఖద్దరు ధారులై వుంటారు.కార్యక్రమం నడిపేవారు అలానె వుంటారని వూహించుకొన్నా.ఈమాటు ఖద్దరు చీరకొనాలి అనుకొని మళ్ళి ఏమిచీరధరించాలి అని ప్రశ్న తయారయింది.పాములు, మండ్రగబ్బలు వున్న ప్రింట్ కాకుండా వున్న స్వచ్చ మైన తెల్లచీరకోసం వెదికి కట్టుకువెళ్ళా.చివరి క్షణంలో ఫోనులు,వాళ్ళు చెప్పిన టైముకి అయిదు నిముషాలు దాటింది.మధ్యలోనే ఝండాలున్న అయిదారు కారులు నాముందునుంచి రయ్యిమని దూసుకు పోయాయి.ఇవాళ ఇలానే అందరూ బిజీ గా వుంటారు అనుకొని వెడితే ఆ అతిథి కరక్టుగా టైముకు వచ్చి ఝండా ఎగరేసి వెళ్ళిపోయారట. నాకొచ్చిన కానుక పుచ్చుకొని జనగణమన పాడి వచ్చేసా.రిపబ్లిక్ డే పరేడ్ చూద్దామని టి.వి. ముందు కూర్చున్నాను. ఏది ఎలావున్నా గాంధీ చౌక్ ,రాజ పథ్ చూస్తుంటె గుండెల్లో గర్వం పొంగుతుంది.ఢిల్లో వున్నపుడు ప్రత్యక్షంగా పరేడ్ చూసే అదృష్టం కలిగింది.ఆరోడ్డుమీద నడుస్తూంటేనె ఒక పులకరింత. ఒకసారి స్నేహితుల ఇంట్లోపెళ్ళి అయితే పెద్ద విందు చేసారు.అక్కడికి ఇందిరాగాంధీ వచ్చారు. గులాబీ పువ్వు వంటి మనీషి .ఆమె ఠీవి,సాదాతనం ,నవ్వు ఎంతో ఆరాధనని కల్పిస్తాయి. తిండి సంగతే మర్చిపోయి ఎంతో తృప్తిగా తిరిగి వచ్చాము.కలనిజమాయెగా! అనిపించింది.అప్పుడు మాఇళ్ళు పిల్లా మేకా తో నిండుగా వుండేది.పైగా అంధ్రా గెష్టహౌసులావుండేది. సెలవు రోజు వస్తే మావాళ్ళకి గొతెమ్మ కోరికలు పుట్టుకు వచ్చేవి.ఏం,ఏళ్,ఏ పెసరట్టు చేస్తావా?{పెసరెట్టు,ఉప్మా,అల్లపు పచ్చడి.లేకపోతే సాంబారు,దోసె,పచ్చ్డి.ఇడ్లి, సాంబారు,కారప్పొడి ,పచ్చడి.రిపబ్లిక్ డే నాడు ఈటిఫిన్లు చేయాలంటే కోపం వచ్చేది.హాలులోకి వంటింట్లో నుంచి ఒక ఖాళీ కిటికీ వుండేది. అందులోంచి టిఫిన్లు అందిన్స్తూ మధ్య మధ్య లోటి. వి. వీక్షించాల్సి వచ్చేది.విపరీత మైన చలి మంచు.స్నానాలు బాకీ ,వంట బాకీ సింక్ నిండా కప్పులు ప్లేట్లు ఆహ్వానిస్తూ వుండేవిరా!రా! అని.ఏ.పి శకటం కొసం చూసి దాన్ని మనమే తయారు చేసినట్లు సంతోష పడిపోయి బుజాలు చరుచుకొనేవాళ్ళం.ఈమాటైనా రిపబ్లిక్ డే కి పొందూరు ఖద్దరు చీర కొనుక్కు తీరాలి,అని డైరీలో వ్రాసుకొన్నా.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment